Breaking

13, జూన్ 2021, ఆదివారం

ఈ ఆలయాన్ని దర్శిస్తే కాశీకి వెళ్ళినట్లే, Kolhapur Maha Lakshmi Temple, Kolhapur Sri Mahalaxmi Temple Information in Telugu

మిత్రులందరికీ స్వాగతం...

ఈ ఆర్టికల్ లో మీకు అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవది అయిన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుడి గురించి నాకు తెలిసిన వివరాలన్నీ చెప్తాను. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించని వారంటూ ఎవరూ ఉండరు. అదేవిధంగా ఈ అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం.  మహిళలు మాత్రమే కాకుండా వ్యాపారులు కూడా ఈ దేవతని నిత్యం పూజిస్తూ ఉంటారు. అయినా ఈ రోజుల్లో లక్ష్మి లేకుండా ఏ పనీ జరగదు కదా. అయితే కోట్ల మంది పూజించే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఉండే ఆలయాలు చాలా తక్కువనే చెప్పాలి. అలా ప్రత్యేకంగా ఉన్న ఆలయాలలో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పంచగంగ నది ఒడ్డున ఈ అమ్మవారి ఆలయం ఉంది. స్కంద పురాణం మరియు దేవి పురాణం ప్రకారం ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని మరియు ఈ దేవతని కరవీర మహాలక్ష్మి అని పూజిస్తారు. ప్రళయం సంభవించినప్పుడు పరమశివుడు కాశీ క్షేత్రాన్ని కాపాడినట్లుగానే లక్ష్మీదేవి కూడా తన చేతులతో ఈ ప్రాంతాన్ని పైకెత్తి మహా ప్రళయం నుంచి కాపాడిందని చెబుతారు. అందుకే ఇక్కడి అమ్మవారిని కరవీర మహాలక్ష్మిగా పిలుచుకుంటారు. అట్లాగే పరమశివునికి కాశీ పుణ్యక్షేత్రం ఎంత ముఖ్యమో శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవికి ఈ కొల్హాపూర్ క్షేత్రం అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాశీకి వెళ్ళినట్లేనని చెబుతారు.

.kolhapur mahalakshmi temple how to reach
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు
అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఈ క్షేత్రానికి సంబంధించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. చనిపోయిన సతీదేవి దేహాన్ని చేతిలో పెట్టుకుని పరమ శివుడు ప్రళయతాడవం చేసినప్పుడు ఆ ధాటికి ఖండితమైన ఆమె శరీర భాగాలలో నయనాలు (కళ్ళు) ఇక్కడ పడ్డాయని ఆ విధంగా ఈ అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలసిందని ఒక కథ ప్రచారంలో ఉంది.

Kolhapur temple history
కొల్హాపూర్ మహాలక్ష్మి దేవి గుడి
మరొక కథనం ప్రకారం ఒకసారి భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు వచ్చాడట. అయితే విష్ణుమూర్తి ఆ మహర్షి రాకను గమనించలేదు. దాంతో ఆ ఋషి ఆగ్రహంతో విష్ణుమూర్తి వక్షస్థలం పైన బలంగా తన్నాడు. తాను కొలువై ఉండే విష్ణుమూర్తి వక్షస్థల భాగాన్ని ఓ ముని కాలితో తాకడాన్ని సహించలేని లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసి ఆ తర్వాతి కాలంలో ఇక్కడే ఉండిపోయిందని చెబుతారు. ఇంతటి మహత్తరమైనటువంటి ఈ ఆలయాన్ని దర్శించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. మరిన్ని వివరాల కోసం కింద ఇచ్చిన వీడియో చూడగలరు. ఈ వీడియోలో 5ని. 30సెకండ్ల నుంచి కొల్హాపూర్ అమ్మవారి విశేషాలున్నాయి.అయితే మొదట్లో ఇక్కడ చాలా చిన్న ఆలయం ఉండేదట. అప్పట్లో కర్ణదేవ్ అనే రాజు కొంకణ్ ప్రాంతం నుంచి కొల్హాపూర్ వచ్చినప్పుడు అడవిలో ఉన్న ఈ ఆలయాన్ని చూసి చుట్టూ ఉన్న చెట్లను తొలగించి ఈ గుడిని అందరికీ అందుబాటులోకి తెచ్చాడని చెబుతారు. ఆ తర్వాత కాలంలో ఎందరో రాజులు ఈ గుడిని మరియు చుట్టుపక్కల ప్రాంతాలను బాగా అభివృద్ధి చేశారు. ఓసారి అగస్త్య ముని కాశికి ప్రత్యామ్నాయంగా మరో పుణ్యక్షేత్రాన్ని చూపించమని పరమశివుడిని అడిగాడట. అందుకు సమాధానంగా శివుడు కొల్హాపూర్ ని చూపించాడని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి వెళితే కాశీని దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని దేవీ భాగవతంతో పాటు పద్మ, స్కంద మొదలైన పద్దెనిమిది పురాణాలలో ప్రస్తావించబడినది.
కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం విశిష్టత
కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవాలయం
ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. అవి ఏంటంటే అమ్మవారి విగ్రహాన్ని ఎంతో విలువైన లోహంతో తయారుచేశారని, ఆ విగ్రహం దాదాపు 40 కేజీల బరువు ఉంటుందని చెబుతారు. కలశం, పద్మం, పాత్ర, పుష్పం పట్టుకుని నాలుగు చేతులతో సింహవాహినిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతిరోజూ ఐదు పూటలా ఇచ్చే హారతులు చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే నమ్మండి.
Kolhapur Maha Lakshmi Temple images
కొల్హాపూర్ అమ్మవారి గుడి విశేషాలు
ప్రతి రోజూ మధ్యాహ్నం దత్తాత్రేయుడు ఈ ఆలయానికి వచ్చి భిక్ష స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఇక్కడ దత్తాత్రేయుడికి కూడా ఓ ఆలయం ఉంది. అంతే కాకుండా ఆది శంకరాచార్యులు ఈ గుడిని సందర్శించి శ్రీచక్రాన్ని స్థాపించినట్లు చరిత్ర చెబుతోంది. రథసప్తమి సమయంలో మూడు రోజుల పాటు అమ్మవారి విగ్రహం పైన సూర్యకిరణాలు పడతాయి. మొదటి రోజు పాదాల పైన, రెండవ రోజు మధ్య భాగం పైన, చివరి రోజు ముఖంపైన సూర్య కిరణాలు పడతాయి. ఈ దృశ్యాలను చూడటానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వస్తారు.
Kolhapur temple history in Telugu
కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం విశేషాలు
ప్రత్యేక సందర్భాల్లో చేసే పూజలతో పాటు దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు విశేష పూజాదికాలు కూడా నిర్వహిస్తారు. నాలుగు ద్వారాలు ఉండే ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారు తూర్పు దిక్కున కొలువై ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మి ఆలయంతో పాటు వెంకటేశ్వరుడు, తుల్జా భవాని, వినాయకుడు, శివుడు వంటి ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.
కొల్హాపూర్ ఆలయ చరిత్ర
కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం మహారాష్ట్ర
కొల్హాపూర్ కి ఎలా చేరుకోవచ్చు...?
విమానం ద్వారా వచ్చేవాళ్ళు ముంబై వరకు వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా ఈ ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు. సంవత్సరం మొత్తం ఆలయం తెరిచే ఉంటుంది. ఒకవేళ రైల్లో వెళ్ళాలనుకుంటే కొల్హాపూర్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి బస్సు లేదా ఏ ప్రైవేటు వాహనం ద్వారా అయినా ఈ గుడికి చేరుకోవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే అందరికీ షేర్ చెయ్యండి.

సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి