Breaking

2, మే 2021, ఆదివారం

సర్వాంగాసనము దాని యొక్క ఉపయోగాలు, Sarvangasana benefits, Benefits of yoga

 Hi Friends...

Welcome to My Blog...

ఈ ఆర్టికల్ లో మీకు నేను సర్వాంగాసనం యొక్క ఉపయోగాలు చెబుతాను. 

sarvangasana benifits
Sarvangasana Yoga
సర్వాంగము అనగా శరీరంలోని అన్ని అవయవాలకు ఉపయోగపడుతుంది ఈ ఆసనం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక జీవనశైలి వల్ల మన శరీరానికి సరైనటువంటిి వ్యాయామం లేకుండా పోతోంది. దీనివల్ల ఊబకాయం, బీపి మరియు షగర్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నాం. పైన చెప్పిన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సర్వాంగాసనం వేయటం చాలా బెటర్. ఈ ఆసనం వేయడం మొదట్లో కొంచెం కష్టంగా ఉండవచ్చు. శరీరానికిిి కొంచెం కొంచెంగా అలవాటు చెయ్యండి.

ముఖ్య గమనిక: యోగాని ఎప్పుడూ నిపుణుల సమక్షంలోనే చేయండి. అంతేగాని అరకొర జ్ఞానంతో సొంతంగా యోగ చేయాలని చూడకండి. అట్లాగే మీ శరీర తత్వానికి ఏ ఆసనం సూట్ అవుతుందో ఆ ప్రకారం చేస్తే బాగుంటుంది. యోగాతో పాటు సమతుల ఆహారం మరియు రోజుకు ఎనిమిది గంటల నిద్ర ఉండాలి. అప్పుడే మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.

CLICK HERE TO PURCHASE YOGA MATS

సర్వాంగాసనం వేయు విధానమ:

ముందుగా నేల మీద యోగా మ్యాట్ పరచుకుని శవాసన భంగిమలో పడుకోవాలి. యోగ మ్యాట్ లేకపోతే మందపాటి క్లాత్ పైన కూడా చెయ్యొచ్చు. అంతే కానీ డైరెక్ట్ గా నేలమీద యోగాసనాలు వేయకండి. ఇప్పుడు రెండు కాళ్ళని దగ్గరికి చేర్చిన తరువాత మోకాళ్ళని ఛాతీ వరకు మరచి నెమ్మదిగా రెండు కాళ్ళని పైకి లేపవలెను. ఆ తర్వాత రెండు చేతులని మన వీపు వెనుక భాగంలోకి చేర్చి నడుముకి రెండు వైపులా రెండు చేతుల్ని ఆనించి నెమ్మదిగా నడుముని పైకి లేపవలెను. నడుము మరియు కాళ్ళ బరువు మెడ మీద పడేంత వరకూ కాళ్ళని నిటారుగా చాపాలి. రెండు కాళ్ళని 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. శరీరము యొక్క బరువుని రెండు మోచేతుల మీద పడేలా చూసుకోవాలి. ఈ భంగిమలో ఎంత సేపు ఉండగలుగుతారో అంత సేపు ఉండండి. ఎంత ఎక్కువ సమయం ఈ భంగిమలో ఉంటే అన్ని మంచి ఉపయోగాలు ఉంటాయి. ఆ తర్వాత కాళ్ళని కిందికి నెమ్మదిగా మోకాళ్ళ వరకు మంచి ఛాతీకి ఆనించి కాళ్ళని నేల మీద నెమ్మదిగా ఉంచవలెను. తర్వాత కొన్ని నిమిషాల పాటు శరీరాన్ని శవాసనం భంగిమలో ఉంచాలి. ప్రతి ఆసనానికి మధ్యలో కొద్దిసేపు కంపల్సరి శవాసనం వెయ్యాలి. ఈ సర్వాంగాసనాన్ని అన్ని వయసుల వారు వెయ్యవచ్చు.

sarvangasana benifits in Telugu
సర్వాంగాసనం యొక్క ఉపయోగాలు

ఈ ఆసనాన్ని ఎవరు వెయ్యకూడదు అంటే:

*సర్వైకల్ స్పాండిలైటిస్ మరియు భుజమునకు సంబంధించిన సమస్యలు మరియు అధిక బరువు ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని వెయ్యకూడదు.

*అధిక రక్తపోటు మరియు గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు సర్వాంగాసనము వెయ్యకూడదు. పై సమస్యలు ఉన్నా కూడా మీరు నిపుణుల పర్యవేక్షణలో సర్వాంగాసనం వెయ్యవచ్చు.

Sarvangasana Yoga Information
సర్వాంగాసనం యొక్క ఉపయోగాలు

సర్వాంగాసనము వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు:

*బాగా హైట్ ఎదగాలనుకునే పిల్లలకి ఈ ఆసనం ఒక వరం అని చెప్పవచ్చు. కావున మీ పిల్లల చేత ప్రతిరోజు ఈ ఆసనం వేయించండి.

*కాళ్ళని బాగా పైకి లేపి ఉంచి ఆసనం వేయడం వల్ల పాదాలు మరియు కాళ్ళలోని రక్తం  గొంతులో ఉన్నటువంటి థైరాయిడ్ మరియు గుండెకు చేరుతుంది. ఇలా రక్తప్రసరణ బాగా జరగడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది.

*థైరాయిడ్ గ్రంథికి మంచిగా రక్తప్రసరణ జరగటం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు లేదా భవిష్యత్తులో థైరాయిడ్ సమస్య రాకుండా చేసుకోవచ్చు. అనగా థైరాయిడ్ గ్రంథిని యాక్టివ్ గా ఉంచుతుంది.

*జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

*రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

Latest yoga information Telugu
సర్వాంగాసనం యొక్క ఉపయోగాలు
*సర్వాంగ ఆసనం వేయడం వల్ల రక్తము కాళ్ళ నుండి తల వరకు ప్రవహిస్తుంది. అందుకని ఈ ఆసనం వేయడం వల్ల కళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది.

*అన్ని రకాలైనటువంటి తలనొప్పులు మరియు థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది.

*ముఖానికి కాంతిని ఇస్తుంది. ఫేస్ లో ఉన్నటువంటి ముడతలు తగ్గిస్తుంది మరియు యువతని బాగా చికాకు పెట్టే మొటిమల్ని తగ్గిస్తుంది.

(గమనిక: కొన్ని రకాలయినటువంటి హార్మోన్స్ ప్రభావం వల్ల కానీ లేదా కెమికల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల కానీ మొటిమలు వచ్చే అవకాశం ఉంది. కావున ఈ ఆసనం వల్ల మొటిమలు తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించటం ఉత్తమం.)

*సర్వాంగాసనము ముఖానికి మంచి ఎక్సర్సైజ్ ని ఇస్తుంది.

*జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

*దాదాపుగా శీర్షాసనం వేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో అన్నే ప్రయోజనాలు ఈ సర్వాంగాసనం ద్వారా కూడా కలుగుతాయి.

*ఈ ఆసనం వేయడం వల్ల నాడీ వ్యవస్థకి రక్త ప్రసరణ బాగా జరిగి నాడీ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.

సర్వాంగాసనము యొక్క ఉపయోగాలు
సర్వాంగాసనము మరియు దాని ఉపయోగాలు
*ప్రతిరోజు ఈ ఆసనం వేయడం వల్ల భవిష్యత్తులో గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.  ఊపిరితిత్తులని శుభ్రం చేయడంలో ఈ ఆసనం బాగా దోహదపడుతుంది.
*ప్రతిరోజు ఈ ఆసనం వేయడం వల్ల శరీరాన్ని మన అదుపులో ఉంచుకోవచ్చు.

*ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఖాళీ కడుపుతో సర్వాంగాసనాన్ని వెయ్యాలి. సాయంత్రం పూట కూడా ఒకవేళ మీరు ఖాళీ కడుపుతో ఉంటే కనుక ఈ ఆసనాన్ని ట్రై చెయ్యొచ్చు.

*ఉదయం పూట 6 నుండి 8 గంటల మధ్యలో ప్రసరించే సూర్యకిరణాలలో డి విటమిన్ ఉంటుంది. ఆ లేత సూర్య కిరణాలు శరీరం మీద పడుతున్నప్పుడు ఈ ఆసనం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

*అట్లాగే ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్.

మీకు హెల్త్ మరియు కిచెన్ కి సంబంధించిన టిప్స్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ NUZVID HEALTH AND KITCHEN ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ CLICK చెయ్యండి.

సర్వేజనా సుఖినోభవంతు...🙏🙏🙏

2 కామెంట్‌లు: