Breaking

8, జూన్ 2021, మంగళవారం

ఇండియాలోనే అందమైన జలపాతం, Beautiful Tourist Place For Lovers and Couples, Dudhsagar Waterfall Goa, One of the beautiful waterfalls in India, beautiful waterfalls

మిత్రులందరికీ స్వాగతం...

ఈ ఆర్టికల్ లో మీకు నేను గోవా దగ్గరలో ఉన్న దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఆర్టికల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి షేర్ చెయ్యండి. భారతదేశంలో ఉన్న అతిపెద్ద వాటర్ ఫాల్స్ లో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది.

Goa tourist places
దూద్ సాగర్ వాటర్ ఫాల్స్
షారుక్ ఖాన్ మరియు దీపికా పదుకొనే కలిసి నటించిన బాలీవుడ్ మూవీ CHENNAI EXPRESS ఇక్కడే షూటింగ్ జరిపారు. 
Shahrukh Khan and Deepika padukone Movie shooting location
చెన్నై ఎక్స్ ప్రెస్ షూటింగ్ లొకేషన్ లో షారుఖ్, దీపిక
ఈ మూవీ రిలీజైన తర్వాత ఈ జలపాతానికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. తర్వాతి కాలంలో ఈ ప్రదేశం కూడా ఒక క్రేజియస్ట్ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. ఈ జలపాతం యొక్క ఎత్తు 1017అడుగులు మరియు వెడల్పు 100 అడుగులు. చుట్టూ ఎత్తయిన కొండలు మధ్యలో అందమైనటువంటి జలపాతం. దాని పక్కనుంచి వెళ్తున్న రైలు ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం నిజంగా ఒక స్వర్గం లాంటిది.


*ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి...?

ఈ ప్రదేశం గోవా మరియు కర్ణాటకల సరిహద్దులో ఉంటుంది. ఉత్తర భారతం వైపు నుంచి వచ్చే వాళ్ళు ముందుగా కులేం లో దిగి అక్కడి నుంచి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కి చేరుకోవచ్చు.

dudhsagar waterfall kulem Village
కులేం రైల్వే స్టేషన్
కులేం నుంచి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కి 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ మీరు సొంత వాహనంలో కులేం గ్రామానికి చేరినట్లయితే మీ వాహనాన్ని అక్కడే పార్క్ చేసి జలపాతం దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ గ్రామంలో పార్కింగ్ సదుపాయం ఉంది. అయితే ఒక్కో వాహనానికి పార్కింగ్ ఫీజు 100 రూపాయలు. జలపాతం దగ్గరికి వెళ్ళటానికి ప్రభుత్వమే వాహనాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క వాహనంలో ఐదుగురు మాత్రమే కూర్చుంటారు. ఒక మనిషికి రాను పోను కలిపి 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో దట్టమైన అడవి గుండా జలపాతం ఎంట్రెన్స్ దగ్గరికి చేరుకోవచ్చు. దారి మధ్యలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలని సందర్శించటానికి వెళ్ళినప్పుడు కెమెరా వెంటబెట్టుకుని వెళ్ళటం బెటర్. మంచి మంచి ప్రదేశాలను కెమెరాతో క్యాప్చర్ చేయొచ్చు. అట్లాగే ఫోటోలు తీయడానికి దయచేసి డీ.ఎస్.ఎల్.ఆర్ కెమెరానే వాడండి. పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. మొబైల్ తో ఫోటోలు, వీడియోలు తీయడం వల్ల క్వాలిటీ అంత మంచిగా రాదు. జలపాతం దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ ఖరీదు 50 రూపాయలు మరియు లైఫ్ జాకెట్ ఖరీదు 75 రూపాయలు. జలపాతం దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావటానికి కేవలం గంటన్నర సమయం మాత్రమే ఇస్తారు. ఒకవేళ ఆలస్యమైతే ఒక్కో మనిషికి గంటకు 300 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. ఒకవేళ ఇదంతా మీకు దోపిడీగా అనిపిస్తే మాత్రం ఇంకో మార్గం కూడా ఉంది. అదే నడక మార్గాన జలపాతం దగ్గరికి చేరుకోవడం.

Goa tourist places
దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారి
కులేం గ్రామం నుండి జలపాతం దగ్గరికి 11 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అమ్మో పదకొండు కిలోమీటర్లు ఎలా వెళ్లాలి అని ఆలోచించకండి. చాలామంది టూరిస్టులు అలా గ్రూపులుగా వెళుతూ ఉంటారు. వాళ్ళతో సరదాగా ఆడుతూపాడుతూ చుట్టూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఈజీగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అంత దూరం నడిచినట్టే తెలియదు. అట్లాగే ఒక ముఖ్య గమనిక: జలపాతం దగ్గర ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉండవు. కాబట్టి ముందే వాటర్ బాటిల్స్ మరియు భోజనం అడ్జస్ట్ చేసుకుని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి. దక్షిణ భారతదేశం నుంచి వచ్చే పర్యాటకులు క్యాస్టిల్ రాక్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కి చేరుకోవచ్చు. 
Indian tourism
క్యాస్టిల్ రాక్ రైల్వే స్టేషన్ గోవా
క్యాస్టిల్ రాక్ రైల్వే స్టేషన్ నుంచి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే నడవలేని వాళ్ళు కులేం గ్రామానికి చేరుకుని అక్కడి నుండి వాహనాల్లో జలపాతం దగ్గరికి చేరుకోవచ్చు. ఎందుకంటే క్యాస్టిల్ రాక్ రైల్వే స్టేషన్ నుంచి జలపాతానికి వాహన సౌకర్యం లేదు. వాహనాల్లో చేరుకునేవాళ్ళు జలపాతం కింది భాగాన్ని మాత్రమే చూడగలుగుతారు. 
Waterfalls information in India
దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఏరియల్ వ్యూ
అదే నడక మార్గాన అడవిగుండా జలపాతాన్ని చేరుకునే వాళ్ళు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రకృతిని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు జలపాతం మధ్యభాగానికి చేరుకున్నారు కాబట్టి. అక్కడి నుంచి చూస్తే జలపాతం పైభాగం మరియు చుట్టూ ఉన్న ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. కాబట్టి నడక మార్గాన జలపాతం దగ్గరికి చేరుకునే ప్రయత్నం చెయ్యండి.

Indian tourist spots
దూద్ సాగర్ వాటర్ ఫాల్స్
ఈ జలపాతాన్ని సందర్శించడానికి అనువైన సమయం సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు. వెనక నుండి అందమైన పాల నురుగు లాంటి జలపాతం ఒక పక్క రైల్వే ట్రాక్ మొత్తంగా చూస్తే ఈ ప్రదేశం అదుర్స్ అంతే. రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి వెనక ఉన్నటువంటి జలపాతం బ్యాగ్రౌండ్ తో ఫోటో దిగటం అనేది జీవితకాలం మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. లవర్స్ మరియు కొత్తగా పెళ్ళైన జంటలకు ఈ ప్రదేశం పిచ్చపిచ్చగా నచ్చుతుంది. కాబట్టి ఈసారి గోవా వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా విజిట్ చెయ్యండి.


*

అట్లాగే ఫ్రెండ్స్ నాదొక చన్న రిక్వెస్ట్..

మీకు జర్నీ వ్లాగ్ కి సంబంధించి వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి లేదా కింద ఉన్న ఇమేజ్ పైన ట్యాప్ చేయండి

SIVA RAM YADAV DASARI
ఛానల్ లో కి వెళ్ళటానికి ఈ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి