Breaking

29, ఏప్రిల్ 2021, గురువారం

Vacuum Cleaner Buying Guide, How to Choose Best Vacuum Cleaner, Use of Vacuum Cleaner, Vacuum Cleaner

మిత్రులందరికీ స్వాగతం...

ఈ ఆర్టికల్ లో ఎటువంటి వాక్యూమ్ క్లీనర్ కొంటే బాగుంటుందో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఆర్టికల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి షేర్ చెయ్యండి.

Vacuum cleaner in Telugu
ఎటువంటి వాక్యూమ్ క్లీనర్ ని తీసుకోవాలి
అట్లాగే మీకు టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
NUZVID TECH EXP YouTube Channel
ఫ్రెండ్స్.... ఒకప్పుడు ప్రజల ఒంట్లో శక్తి ఉండేది కాబట్టి ఇంట్లో మూలమూలలా ఉన్న దుమ్ముని కూడా ఎంతో ఓపికగా శుభ్రం చేసుకునే వాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో ఈ పనిని వాక్యూమ్ క్లీనర్లు చేసేస్తున్నాయి.

వాక్యూమ్ క్లీనర్ కొనటానికి వెళ్లేముందు ముఖ్యంగా నాలుగు విషయాలని గుర్తుంచుకోండి.
1.బ్యాగ్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలా లేక బ్యాగ్ లెస్ వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలా...?
2.మీకు ఎటువంటి వాక్యూమ్ క్లీనర్ కావాలి...?
3.ఎంత పవర్ కెపాసిటీ ఉన్న వాక్యూమ్ క్లీనర్ ని కొనాలి...?
4.మీకు ఎటువంటి ఫీచర్స్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ కావాలి...?
Vaccum Cleaner Buying Guide
CLICK HERE TO PURCHASE VACUUM CLEANERS

1. బ్యాగ్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలా లేక బ్యాగ్ లేని వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలా...?
బ్యాగ్ ఉన్నటువంటి వాక్యూమ్ క్లీనర్ ని డ్రై క్లీనింగ్ లో వాడతాము. కాబట్టి బ్యాగ్ నిండిన ప్రతీసారి దానిని తీసేసి మళ్ళీ కొత్త బ్యాగ్ ని పెట్టుకోవాలి. ఎవరి ఇంట్లో అయితే ఇస్నోఫీలియా, ఆస్తమా మరియు ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు గల వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ బ్యాగ్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ కరెక్ట్ గా సూటవుతుంది.
How to choose a best vacuum cleaner
బ్యాగ్ ఉన్న వాక్యూమ్ క్లీనర్
బ్యాగ్ లేని వాక్యూమ్ క్లీనర్ కొనటం వల్ల ప్రతిసారి బ్యాగు మార్చాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ప్రతిసారి బ్యాగు కొనుక్కునే ఖర్చు తగ్గుతుంది. బ్యాగ్ బదులు ఇందులో హెపా ఫిల్టర్ ని వాడతారు.
Vacuum cleaner hepa filters
హెపా ఫిల్టర్
ఇది చాలా కాలం పాటు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. మాటిమాటికీ మార్చాల్సిన అవసరం ఉండదు.
Best vacuum cleaner for kitchen and home
బ్యాగ్ లేని వాక్యూమ్ క్లీనర్
ఎవరింట్లో అయితే చిన్న పిల్లలు మరియు పెట్స్ ఉంటారో వాళ్లకి హెపా ఫిల్టర్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ హెపా ఫిల్టర్ చిన్న చిన్న ధూళి కణాలని కూడా చాలా ఈజీగా పీల్చుకుంటుంది. అయితేేేే తడి క్లీనింగ్ చేసేటప్పుడు హెపా ఫిల్టర్ ని తీసేసి వాడాలి. లేదంటే అది పాడైపోతుంది.
2. మీకు ఎటువంటి వాక్యూమ్ క్లీనర్ కావాలి..
మీ ఇంటికి ఎటువంటి వాక్యూమ్ క్లీనర్ సెట్ అవుతుందో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కొనుక్కోవడం బెటర్. పెద్ద పెద్ద ఫ్లోర్లు లేదా కార్పెట్స్ ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు అప్ రైట్ వాక్యూమ్ క్లీనర్ వాడితే బాగుంటుంది.
Best vacuum cleaner for home
అప్ రైట్ వాక్యూమ్ క్లీనర్
ఈ టైపు వాక్యూమ్ క్లీనర్స్ ని ఆఫీసుల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటేే ఇవి చాలా బరువుగా ఉంటాయి. అదే మీ ఇంట్లో ఉన్న కార్పెట్స్, ఫ్లోర్స్ మరియు మెట్లు శుభ్రం చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు క్యానిస్టర్ వాక్యూమ్ క్లీనర్ వాడితే బాగుంటుంది.
Best vacuum cleaner for house purpose
క్యానిస్టర్ వాక్యూమ్ క్లీనర్

ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఈ టైప్ వాక్యూమ్ క్లీనర్లు వెట్ క్లీనింగ్ మరియు డ్రై క్లీనింగ్ రెండు విభాగాల్లోనూ ఉంటాయి. మీ ఇంటికి ఏది సూట్ అవుతుందో చెక్ చేసుకుని కొనుక్కోండి. అట్లాగే వాక్యూమ్ క్లీనర్స్ కి సంబంధించి నేనిచ్చే ముఖ్యమైన సలహా ఏంటంటే ఈ వాక్యూం క్లీనర్స్ ని కేవలం డ్రై క్లీనింగ్ కి మాత్రమే వాడుకోండి. వెట్ క్లీనింగ్ కి చీపిరి తీసుకుని ఇల్లంతా కడిగేసి శుభ్రం చేసుకోవడం చాలా బెటర్. ఒకవేళ మీ ఇంట్లో పెంపుడు జంతువులు లేదా చిన్న పిల్లలు ఉన్నట్లయితే మీరు కార్డ్ లెస్ వాక్యూమ్ క్లీనర్ వాడటం ఇంకా బెటర్. 

Best quality vacuum cleaner kitchen
కార్డ్ లెస్ వాక్యూమ్ క్లీనర్
ఈ టైపు వాక్యం క్లీనర్స్ ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి చాలా సులభంగా తీసుకెళ్లవచ్చు. అస్సలు బరువు ఉండదు. అంతేకాకుండా ఇవి వాడటం చాలా ఈజీ. అయితేేేేే ఈ టైైైపు వాక్యూమ్ క్లీనర్స్ ఖరీదు చాలా ఎక్కువ.  మీ ఇంట్లో ఉన్న వెహికల్స్ లోని సీట్ మరియు కార్పెట్స్ శుభ్రం చెయ్యాలంటే మీరు హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ వాడితే చాలా బాగుంటుంది. 
Best vacuum cleaner for keyboard cleaning and vehicle cleaning
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్
ఇవి చాలా చిన్నగా లైట్ వెయిట్ గా ఉంటాయి. చేతితో చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. వాడటం చాలా ఈజీ. దీంతో కంప్యూటర్ కీబోర్డుని కూడా చాలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు.
ఇల్లంతా తిరిగి శుభ్రం చేసుకోవడానికి కష్టంగా ఉంటే మీరు రోబో వాక్యూమ్ క్లీనర్ ని వాడటం చాలా బెటర్.
Automatic robot vacuum cleaner for home
రోబో వాక్యూమ్ క్లీనర్
ఇది ఫ్లోర్ మరియు కార్పెట్ క్లీనింగ్ ని చాలా సమర్థవంతంగా పూర్తి చేస్తుంంది. వీటి ఖరీదు షుమారుగా పాతిక వేలు పైనే ఉంటుంది.
3.ఎంత పవర్ కెపాసిటీ ఉన్న వాక్యూమ్ క్లీనర్ ని కొనాలి..
వాక్యూమ్ క్లీనర్ యొక్క మోటార్ పవర్ కెపాసిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత దుమ్ము ధూళిని బాగా పీల్చుకుంటుంది. కాకపోతే మోటార్ పవర్ ఎక్కువయ్యేకొద్దీ కరెంటు ఎక్కువ ఖర్చవుతుంది. శబ్దం కూడా బాగానే వస్తుంది.
4.మీకు ఎటువంటి ఫీచర్స్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ కావాలి...
వాక్యూమ్ క్లీనర్ కొనేముందు మీ ఇంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొనాలి. అంతే కాకుండా వాక్యూమ్ క్లీనర్ లో స్పేర్ పార్టులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మీ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని వాక్యూమ్ క్లీనర్ కంటే మరీ మంచిది.
నా ప్రజంటేషన్ మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.
థాంక్యూ
అండ్
జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి