Breaking

28, ఏప్రిల్ 2021, బుధవారం

ఎలక్ట్రిక్ వాహనాలతో నిజంగానే పర్యావరణాన్ని కాపాడవచ్చా...?, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు వాటి ఉపయోగాలు, Uses of Electric Vehicles, information about electric vehicles

 మిత్రులందరికీ స్వాగతం...

ఈ ఆర్టికల్ లో మీకు నేను ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఉపయోగాలు మరియు ప్లస్సులు, మైనస్సులు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను.

Electric vehicles review by SIVA RAM YADAV DASARI from NUZVID TECH EXP
ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ఉపయోగాలు

*ఎలక్ట్రిక్ వాహనాల వల్ల నిజంగానే పొల్యూషన్ తగ్గుతుందా....??

జవాబు: 50% అవును, 50% కాదు

50% అవును అని ఎందుకు చెప్తున్నానంటే..

ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎటువంటి పొగని రిలీజ్ చెయ్యవు. శబ్దం అసలే ఉండదు. పెట్రోల్ ఖర్చుతో పోల్చుకుంటే దీని మెయింటినెన్స్ ఖర్చు చాలా చాలా తక్కువ.

ఇక 50% కాదు అని ఎందుకు చెప్తున్నానంటే...

ఎలక్ట్రిక్ వాహనాలకి వాడే విద్యుత్తుని మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామో తెలుసా...?

పవర్ గ్రిడ్ కి వచ్చే విద్యుత్తు అంతా బొగ్గు నుంచే తయారవుతుంది. బొగ్గుని మండించి విద్యుత్తును తయారు చేస్తారన్న సంగతి మీకు తెలుసు. బొగ్గుని ఎంతగా మండిస్తే అంత కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. దీని ద్వారా వచ్చిన కరెంటునే మనం ఎలక్ట్రిక్ వాహనాలు నడపడానికి ఉపయోగిస్తున్నాం.

అంటే మనం పర్యావరణాన్ని కాపాడుతున్నామా...?

ఒక్కసారి మీరే ఆలోచించండి...!

Thermal power plant producing energy
ధర్మల్ పవర్ ప్లాంట్

థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే కరెంట్ ని వాడటం వల్ల పెట్రోల్ వినియోగానికి ఎలక్ట్రిక్ వాహనానికి తేడా ఏముంది చెప్పండి. ఎలక్ట్రిక్ వాహనం వాడటం వల్ల మనకి డబ్బులు ఆదా అయితే సరిపోతుందా...?

పర్యావరణాన్ని కాపాడాలనే కనీస స్పృహ కూడా మనకు ఉండక్కర్లేదా...?

మరియు  ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీల పరిస్థితి ఏమిటి..?

బ్యాటరీలు కాలం చెల్లిపోతే వాటిని పక్కన పడేస్తాం..

కానీ ఆ బ్యాటరీలలో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు భూమిలో కలిస్తే ఎంత ప్రమాదమో తెలుసా...!

ఆ రసాయనిక పదార్థాలు గాల్లో కలిస్తే ఆ చుట్టుపక్కల ఉండే చెట్లు, జంతువులు, మనుషుల పరిస్థితి ఏంటి...? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా మీరు...?

కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలకి ప్లస్సులు ఎన్ని ఉన్నాయో మైనస్సులు కూడా అన్నే ఉన్నాయి.

*ఎలక్ట్రిక్ వాహనాలకి వాడే బ్యాటరీ పర్యావరణహితమైనది అయి ఉండాలి.

Nikita and Nishitha making Nexus battery
కొత్తరకమైన నెక్సస్ బ్యాటరీ
*రీసెంట్ గా  భువనేశ్వర్ కి చెందిన నిఖిత మరియు నిషిత అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వరి మరియు గోధుమ పొట్టు నుంచి పనిచేసే ఒక కొత్త రకమైన బ్యాటరీని తయారు చేశారు. ఇది పూర్తిగా పర్యావరణహితమైనది. మామూలు లిథియం అయాన్ బ్యాటరీ కంటే మూడు రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుంది. ధర కూడాా తక్కువే. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి.
Solar energy in India
సౌర విద్యుత్ పథకం
*ఇళ్లల్లో మనం వాడే కరెంటు సోలార్ ఎనర్జీ అయితేనే ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది.*పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఖచ్చితంగా వాడాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాలకి ఉండే ప్రధానమైన ప్లస్ పాయింట్ ఇదే. భూమిలో నుండి ఆయిల్ ని తీసి ఇష్టమొచ్చినట్లు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. దాని వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వర్షాలు టైంకి పడవు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి. ఇలాంటి దారుణమైన పరిస్థితి ముందు తరాల వాళ్ళకిిి  రాకుండా ఉండాలంటే ఎలక్ట్రిక్ వాహనాలని ఖచ్చితంగా వాడాల్సిందే.
*ప్రతి సంవత్సరం భారత దేశం సుమారుగా 10 లక్షల కోట్ల పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల మనము ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాము. అంతేకాకుండా అన్ని కోట్ల రూపాయల విలువైన పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం అంటే పొల్యూషన్ ని ఏ రేంజ్ లో పెంచుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఎలక్ట్రిక్ వాహనాలను గవర్నమెంట్ ప్రోత్సహిస్తే కనుక ఎంతో విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని సేవ్ చేసిన వాళ్లమవుతాం. అలా సేవ్ చెయ్యగా మిగిలిన అమౌంట్ ని ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోవచ్చు.
*అంతే కాకుండా పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద గవర్నమెంట్ కి టాక్సుల రూపంలో బోలెడంత అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మడం మొదలు పెడితే గవర్నమెంట్ కి చాలా నష్టం వస్తుంది. బహుశా అందుకే మన ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద సరిగ్గా ఫోకస్ చేయడం లేదనుకుంటా...! పర్యావరణం మరియు ప్రజల ఆరోగ్యం కంటే డబ్బు ఎక్కువా చెప్పండి...!
Electric cars
ఎలక్ట్రిక్ వాహనం
*నార్వే దేశం పర్యావరణం మరియు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించింది కాబట్టే ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. నిజానికి నార్వే దేశానికి వచ్చే ఆదాయంలో సింహభాగం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి నుంచే వస్తాయి. అయినా కూడా ఆ దేశం పెట్రోలియం వాహనాల వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తోంది.
*అయితే మన దేశం కూడా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ముందు ముందు ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను. రీసెంట్ గా ఓలా కంపెనీ మన దేశంలో అయిదు వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపించింది. ప్రపంచంలోనేే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇదే.
Electric vehicles benefits
ఎలక్ట్రిక్ స్కూటర్లు
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం లో ఎదురయ్యే సమస్యలు మరియు వాటికి ఉన్న డిస్ అడ్వాంటేజెస్:
*పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల యొక్క పికప్ చాలా తక్కువ.
*సర్వీసింగ్ స్టేషన్స్ మరియు ఛార్జింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉండటం.
*ఎలక్ట్రిక్ వాహనాల ఖరీదు చాలా ఎక్కువ. ఒక ఎలక్ట్రిక్ వాహనం ఖరీదుతో రెండు పెట్రోల్ వెహికల్స్ కొనుక్కోవచ్చు తెలుసా...!
*రీసేల్ వాల్యూ లేకపోవడం.
*ఫైనాన్స్ సౌకర్యం ఉండకపోవడం.
*బ్యాటరీ కాస్ట్ చాలా చాలా ఎక్కువ ఉండటం.
అయితే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ప్రస్తుతం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ముందు ముందు ఈ సమస్యలన్నింటిని అధిగమిస్తుందని ఆశిద్దాం.
నా ప్రజెంటేషన్ నీకు నచ్చితే ఈ ఆర్టికల్ ని అందరికీ షేర్ చెయ్యగలరు.
థాంక్యూ
&
జైహింద్

అట్లాగే ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్.
మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే నా టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ NUZVID TECH EXP ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ CLICK చెయ్యండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి