Breaking

28, జూన్ 2020, ఆదివారం

Top 7 video editing apps, best video editing apps information in Telugu

Hi Friends....
Welcome to My Blog....
Top 7 video editing apps in Google Play store
Top 7 video editing apps by NUZVID TECH EXP
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను ఏడు వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి చెబుతాను. వీటి వర్కింగ్ స్టైల్ ని బట్టి వీటికి ఏడు నుంచి ఒకటి వరకు ర్యాంకులు కూడా ఇస్తాను. అట్లాగే ఈ వీడియో ఎడిటింగ్ యాప్స్ లో మీకు ఏది నచ్చిందన్నది కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ చెప్పండి. అట్లాగే మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలంటే నా టెక్ యూట్యూబ్ ఛానల్ NUZVID TECH EXP ని subscribe చేసుకోండి. ఛానల్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్లిపోదామా...!

7. QUIK FREE VIDEO EDITOR
Top video editing apps in Google Play store
QUIK FREE VIDEO EDITOR App review
లిస్టు లో ఏడవ ప్లేస్ లో ఉన్న వీడియో ఎడిటింగ్ యాప్ పేరు QUIK FREE VIDEO EDITOR APP. ఫోటోస్ అన్నీ కలిపి ఒక వీడియోగా చేయటంలో ఈ యాప్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఉండే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇది ఒక ఐడియల్ యాప్. కరెక్టుగా చెప్పాలంటే THERE IS NO WATERMARK IN THIS APP. స్లో మోషన్ వీడియోస్, ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోస్ చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. Intro videos ని చాలా ఎఫెక్టివ్ క్వాలిటీతో ఎడిటింగ్ చెయ్యొచ్చు. వీడియోస్ ని 1080p Quality వరకు Export చేయొచ్చు. యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

6. VIDEO EDITOR FOR YOUTUBE
Top 5 video editing apps
Video Guru App review Telugu
ఆరో ప్లేస్ లో ఉన్న వీడియో ఎడిటింగ్ యాప్ పేరు VIDEO EDITOR FOR YOUTUBE. దీనినే VIDEO GURU యాప్ అని కూడా అంటారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం, intro, outro వీడియోస్ చెయ్యటం యాప్ లో చాలా చాలా ఈజీ. ఇందులో బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే వీడియో ఎడిటింగ్ ని మొదటి నుంచి నేర్చుకోవాలనుకుంటారో వాళ్లకి ఈ యాప్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ కి సరిపడా సైజులో వీడియోస్ ని Export చేసుకోవచ్చు. టోటల్గా ఈ యాప్ లో వీడియోస్ ని హెచ్డీ ఫార్మేట్ వరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ యాప్ లో ఉన్న ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇందులో different types of layers ఉంటాయి. వీటి ద్వారా మన వీడియోస్ ని చాలా ఇంప్రెసివ్ గా ఎడిట్ చేయొచ్చు. యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి...




5. VLOGIT VIDEO EDITING APP
Video editing app vlogit review in Telugu
VLOGIT VIDEO EDITING APP REVIEW
ఈ యాప్ పేరుకు తగ్గట్లే వ్లాగ్ వీడియోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. వ్లాగ్ అంటే ట్రావెల్ వీడియోస్. ఈ యాప్ లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఇందులోని స్టిక్కర్స్. వీటి ద్వారా మన వీడియో కి ఒక కొత్త లుక్ తీసుకురావచ్చు. ఇందులో టెక్స్ట్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ యాప్లో కూడా వాటర్ మార్క్ లేదు. 1080p క్వాలిటీలో మీ వీడియోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. అట్లాగే ఫ్రెండ్స్ నాదో చిన్న సలహా ఏంటంటే... ఎవరైతే యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేస్తుంటారో వాళ్లు ఆ వీడియో ఎడిటింగ్ యాప్స్ లో ఉన్న మ్యూజిక్స్ ని వాడకండి. కాపీరైట్ claims, strikes వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. ఈ యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

4. VIVA VIDEO EDITOR
Viva video editing app review in Telugu
Viva video editing app review
ఇది కూడా బేసిక్ ఫీచర్స్ ఉన్నటువంటి వీడియో ఎడిటింగ్ యాప్. దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో కూడా చాలా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. చాలా మంది తమ టిక్ టాక్ వీడియోస్ ని ఇందులోనే ఎడిట్ చేస్తారు. ఈ యాప్ లో వాటర్ మార్క్ ఉంటుంది. వాటర్ మార్క్ లేకుండా కావాలనుకుంటే ఒరిజినల్ వెర్షన్ పరిచయం చేయాల్సి ఉంటుంది. అంతేకానీ unknown sources నుంచి డూప్లికేట్ వెర్షన్స్ ని డౌన్లోడ్ చేసుకోకండి. వాటిలో ఉన్నటువంటి మాల్ వేర్, స్పైవేర్ వల్ల మన ఫోన్ లోని డేటా చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. డబ్బులు కట్టి ఒరిజినల్ వెర్షన్ ని మాత్రమే వాడండి. ఈ యాప్ ప్రస్తుతం ప్లే స్టోర్ నుంచి తొలగించబడినది.

3. FILMORA GO
Best video editing apps in Google Play store
FILMORA GO App Review in Telugu
ఇది మంచి రిచ్ ఫీచర్స్ ఉన్నటువంటి వీడియో ఎడిటింగ్ యాప్. అంతేకాకుండా ఈ యాప్ PC VERSION లో కూడా అవైలబుల్ గా ఉంది. వీడియో ఎడిటింగ్ యాప్స్ లో అన్నింటికంటే ముందు నుంచి ఉన్నటువంటి యాప్. ఓల్డ్డెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్. ఇందులో ఫుల్ హెచ్ డి క్వాలిటీ లో వీడియోస్ ని ఎక్స్పోర్ట్ చెయ్యొచ్చు. Different type of transactions, text features, layers, filters ఉండటం ఈ యాప్ యొక్క ప్రత్యేకత. థీమ్స్ కూడా బాగుంటాయి. ఇందులో కూడా వాటర్మార్క్ ఉంటుంది కానీ వీడియో చివర్లో ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ మార్క్ ని ఈజీగా తీసేయొచ్చు. ఈ యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

2. POWER DIRECTOR
Best and top most video editing apps in Google Play store
Power director app review Telugu
ఈ యాప్ కూడా PC VERSION మరియు MOBILE VERSION లో కూడా అందుబాటులో ఉంది. దీంట్లో ఉండేటటువంటి టెక్స్ట్ ఫీచర్స్ ఇంతవరకు ఏ వీడియో ఎడిటింగ్ యాప్ లో లేవు. అంత బాగుంటాయవి. Different type of transactions ఉండటం ఈ యాప్ యొక్క ప్రత్యేకత. వాటిని వాడటం వల్ల వీడియోస్ సైజ్ ఏ మాత్రం తగ్గదు. కాకపోతే ఇందులో వాటర్మార్క్ ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ కొనాలంటే మాత్రం కొంచెం ఖరీదు ఎక్కువే. ఒరిజినల్ వెర్షన్ ఖరీదు 3000 పైనే ఉంటుంది. మొదట్లో ఈ యాప్ ని యూజ్ చేయడం కొంచెం కష్టంగా ఉన్నట్లనిపిస్తుంది కానీ తర్వాత చాలా చాలా ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో గ్లిచ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మన వీడియోని 4k export చేసుకోవచ్చు. కాకపోతే 4k, 1080p లో Export చేయాలంటే ఒరిజినల్ వెర్షన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్స్ లో దీనికి నేను రెండోస్థానం ఇస్తున్నాను.

1. KINEMASTER APP
Best Android video editing apps review Telugu
Kinemaster app review Telugu
ప్రస్తుతానికి ఈ యాప్ మొబైల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్యూచర్ లో కంప్యూటర్ వెర్షన్ రావచ్చు. చాలా బెస్ట్ మరియు హై క్వాలిటీ ఫీచర్స్ ఉన్నటువంటి వీడియో ఎడిటింగ్ యాప్ ఇది. అంతే కాకుండా ఇందులో ఏ యాప్ లో లేనటువంటి మల్టిపుల్ లేయర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే ఎన్ని లేయర్స్ అయినా యాడ్ చేసుకుని వీడియోలు ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులోని ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే "క్రోమా కీ" ని చాలా పర్ఫెక్ట్ గా ఉపయోగించచ్చు. టోటల్ గా ఇది ఒక ALL IN ONE VIDEO EDITING APP. ఇందులో కూడా వాటర్మార్క్ ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ కాస్ట్ పవర్ డైరెక్టర్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువే.
ఈ యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

*ఇవి ఫ్రెండ్స్ బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్స్ యొక్క ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిందంతా మీతో చెప్పేశాను. ఈ ఆర్టికల్ నచ్చితే లైక్ చేయండి.
వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.

థాంక్యూ
అండ్
జైహింద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి