Breaking

17, ఆగస్టు 2020, సోమవారం

What type of memory cards we should buy, ఎటువంటి మెమరీ కార్డ్స్ ని మనం కొనాలి

మిత్రులందరికీ స్వాగతం

ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీరు ఎటువంటి మెమరీ కార్డ్స్ ని కొంటే బాగుంటుందో క్లియర్గా చెబుదామని అనుకుంటున్నాను. అట్లాగే మీకు టెక్నాలజీ కి సంబంధించిన వీడియోస్ కావాలంటే నా టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Memory cards buying guide by NUZVID EXPRESS

ఇక లేట్ చేయకుండా ట్రాఫిక్ లోకి వెళ్లి పోదామా....

మెమరీ కార్డ్స్.... వీటినే ఎస్.డీ కార్డ్స్ అని కూడా పిలుస్తారు. ఎస్.డీ అంటే ఏంటో తెలుసా...?

సెక్యూర్ డిజిటల్ కార్డ్స్.

MEMORY CARDS IN TELUGU
మెమరీ కార్డులు కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి

మొత్తంగా చూస్తే మూడు రకాలైనటువంటి మెమరీ కార్డ్స్ అందుబాటులో ఉంటాయి.

1. ఎస్.డీ కార్డ్స్

2. ఎస్.డీ.హెచ్.సీ కార్డ్స్

3. ఎస్.డీ.ఎక్స్.సీ కార్డ్స్

ఎస్.డీ.హెచ్.సీ అంటే సెక్యూర్ డిజిటల్ హై కెపాసిటీ కార్డ్స్

ఎస్.డీ.ఎక్స్.సీ అంటే సెక్యూర్ డిజిటల్ ఎక్స్ టెండెడ్ కెపాసిటీ కార్డ్స్.

వీటిని మూడు పేర్లతో ఎందుకు పిలుస్తారో వివరంగా తెలుసుకుందాం.

1.ఎస్.డీ కార్డ్స్

SD CARD INFORMATION

ఇవి 2జీబీ వరకు సపోర్ట్ చేస్తాయి.

2. ఎస్.డీ.హెచ్.సీ కార్డ్స్

SD HC CARDS

ఇవి 2జీబీ నుంచి 32జీబీ వరకు సపోర్ట్ చేస్తాయి.

3.ఎస్.డీ. ఎక్స్.సీ కార్డ్స్

SD XC CARDS

ఇవి 32జీబీ నుంచి 2టీబీ అరకు సపోర్ట్ చేస్తాయి.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరెప్పుడైనా మెమరీ కార్డు కొనేటప్పుడు దాని యొక్క స్పీడ్ గురించి కూడా తెలుసుకుని కొనండి. ప్రతి మెమరీ కార్డు పైన దాని యొక్క స్పీడ్ ఎంత అన్నది రాసి ఉంటుంది. 

ఉదాహరణకి మీరు కొన్న మెమరీ కార్డు మీద సీ4, సీ6, సీ8 లేదా సీ10 వీటిలో ఏదైనా ఒకటి రాసి ఉంటే అవి ఆ కేటగిరీకి చెందిన స్పీడ్ క్లాస్ కి చెందినవని అర్థం.

Best quality memory card

సీ4 అంటే 4ఎమ్.బీ.పి.యస్ స్పీడ్ అని, సీ6 అంటే 6ఎమ్.బీ.పి.యస్ స్పీడ్ అని అర్థం. ప్రస్తుతం "సీ" క్యాటగిరితో పాటు "యు"  అన్న కేటగిరి కొత్తగా వచ్చి చేరింది.

Latest high quality memory cards

2015 కి ముందు కొన్న మెమరీ కార్డ్స్ మీద "సీ" అని రాసి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన మెమరీ కార్డ్స్ మీద "యు" అని రాసి ఉంటుంది. "యు" అంటే అల్ట్రా హై స్పీడ్ కెపాసిటీ అని అర్థం. మీ మెమరీ కార్డు "సీ" కేటగిరీకి చెందినది అయితే మీరు నార్మల్ స్పీడ్ ఉన్న మెమరీ కార్డ్స్ వాడుతున్నారని అర్థం. ఒక్కోసారి సీ4 కేటగిరి మెమరీ కార్డు కూడా 10ఎమ్.బీ.పి.యస్ స్పీడ్ ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి రేట్ ఎక్కువైనా పర్లేదు కంపెనీ మెమరీ కార్డ్స్ నే కొనండి.

ఇక "యు" కేటగిరీకి వస్తే "యు1" "యు2"  "యు3"  క్యాటగిరీస్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి.

SONY COMPANY MEMORY CARDS

యు1 - 10ఎమ్.బీ.పి.యస్ స్పీడ్

యు2 - 20ఎమ్.బీ.పి.యస్ స్పీడ్

యు3 - 30ఎమ్.బీ.పి.యస్ స్పీడ్

ప్రస్తుతం ఉన్న అవసరానికి తగ్గట్టు మీరు "యు" కేటగిరీకి చెందిన మెమరీ కార్డ్స్ ని వాడితే మంచిది. "యు3" మెమరీ కార్డ్స్ ని వాడితే మరీ మంచిది. "యు3" అంటే 30ఎమ్.బీ.పి.యస్ స్పీడ్. మంచి బ్రాండ్ ఐతే ఈ టైపు మెమరీ కార్డ్స్ ఒక్కోసారి 100ఎమ్.బీపి.యస్ స్పీడ్ ని కూడా అందిస్తాయి.

Best high quality memory cards

అట్లాగే.....

 ఎలా పడితే అలా మెమరీ కార్డ్స్ ని తయారు చేసి అమ్ముదాం అంటే కుదరదు. దానికంటూ ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారమే మెమరీ కార్డ్స్ తయారు చేయాలి. మీరు వాడుతున్న మెమరీ కార్డు "సీ" కేటగిరీకి చెందినదైతే దాని ధర "యు" కేటగిరీ మెమరీ కార్డు ధరలో 25% ఉంటుంది. ఉదాహరణకి సీ4 కేటగిరి 16జీబీ మెమరీ కార్డు ధర 500 ఉంటే.... అదే యు కేటగిరీకి చెందిన 16జీబీ మెమరీ కార్డు ధర 2000 ఉంటుంది. కాబట్టి రేట్ ఎక్కువైనా పర్లేదు బ్రాండెడ్ వి..... అందులోనూ "యు" కేటగిరీ మెమరీ కార్డ్స్ ని మాత్రమే కొనండి.


అంతే కాకుండా.... మీ ఫోన్ లో సీ10 కేటగిరి మెమరీ కార్డ్ ఉంటే 1080పి క్వాలిటీ వరకు ఫోటోలు వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. 1080పి తక్కువకి సీ4, సీ6 సపోర్ట్ చేస్తాయి. సినిమా వీడియోలు మరియు 3డీ వీడియోస్ స్టోర్ చేసుకోవాలంటే యు1 కేటగిరీ మెమరీ కార్డు ఉండాలి. అన్నిటికంటేేేే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెమరీ కార్డ్స్ ని మీ ఫోన్ సపోర్ట్ చేయగలిగి ఉండాలి. అప్పుడే కరెక్ట్ గా పనిచేస్తాయి. 4కే క్వాలిటీలో వీడియోస్

ని మీ ఫోన్ లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా యు3 మెమరీ కార్డ్స్ ని వాడితే మంచిది.

కొంతమంది తక్కువ రేట్ కి వస్తుంది కదా అని సీ4, సీ6 కేటగిరీ మెమరీ కార్డ్స్ ని కొంటుంటారు. తక్కువ క్వాలిటీ మెమరీ కార్డ్స్ వల్ల ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ఫోన్ స్పీడ్ తగ్గే అవకాశాలు ఎక్కువ.

ఫైనల్ గా ఒకటే చెబుతున్నా... మీ ఫోన్ లో మంచి క్వాలిటీ వీడియోస్, ఫొటోస్ స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా "యు" కేటగిరీ మెమరీ కార్డ్స్ నే వాడండి.

ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

1 కామెంట్‌: