Breaking

6, మే 2021, గురువారం

హలాసనం యొక్క ఉపయోగాలు, Halasana Yoga in Telugu, Yoga For Fatigue

మిత్రులందరికీ స్వాగతం

ఈ ఆర్టికల్ లో మీకు హలాసనంకి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేస్తాను. మీకు మీ ఫ్రెండ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది. కావున ఈ ఆర్టికల్ ని అందరికీ షేర్ చెయ్యండి. అట్లాగే మీకు హెల్త్ అండ్ కిచెన్ టిప్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్

NUZVID HEALTH AND KITCHEN

ని SUBSCRIBE చేసుకోండి.

లింక్ కోసం ఇక్కడ CLICK చెయ్యండి.

Halasana Yoga in Telugu
హలాసనం ఉపయోగాలు

యోగాసనాల్లో ఇది కొంచెం కష్టమైన ఆసనం అని చెప్పవచ్చు. కానీ దీని వల్ల కలిగే ప్రయోజనాలు అమోఘం. ముఖ్యంగా శరీరాన్ని ఎటు పడితే అటు విల్లులా వంచగలిగే వాళ్ళకి ఈ ఆసనం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పురాతన కాలం నుండి మన ఋషులు, మునులు మనకి అందించినటువంటి అత్యద్భుతమైన ఆసనాలలో ఇది కూడా ఒకటి. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా గురించి తప్పనిసరిగా తెలుసుకోండి. డైలీ కనీసం ఒక్క ఆసనమైనా వెయ్యండి.

HALASANA In Telugu
CLICK HERE TO PURCHASE YOGA MATS

ముఖ్య గమనిక: యోగాని నిపుణుల సమక్షంలోనే చేయటం మంచిది. అంతేకాని అరకొర జ్ఞానంతో సొంతంగా యోగ చేసి ఇబ్బంది పడకండి. అట్లాగే మీ శరీర తత్వానికి ఏ ఆసనం సూట్ అవుతుందో ఆ ఆసనాన్ని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కష్టమైన ఆసనాలని శరీరానికి నెమ్మదిగా అలవాటు చేయటానికి ప్రయత్నించండి. సమతుల ఆహారం మరియు రోజుకి ఎనిమిది గంటల నిద్ర ఉంటేనే యోగాసనాల వల్ల ఫలితాలు బాగుంటాయి. కావున ఈ విషయాన్ని గమనించగలరు.

HALASANA YOGA
హలాసనం ఉపయోగాలు

"హల" అంటే నాగలి. మన శరీరాన్ని నాగలి ఆకారంలో ఉంచుతుంది కాబట్టే దీనికి హలాసనం అనే పేరు వచ్చింది. మహాభారతంలో బలరాముడి ఆయుధం నాగలి. అందుకే ఆయనని హలాధరుడు అంటారు.

హలాసనాన్ని వీరు వేయకపోవడం మంచిది:

*మెడ నొప్పులు (సర్వైకల్ స్పాండిలైటిస్) ఉన్నవారు ఈ ఆసనం వేయకపోవడమే ఉత్తమం.

*డిస్క్ సమస్యలు, సయాటికా మరియు లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనాన్ని పొరపాటున కూడా వేయకండి.

*నడుము నొప్పితో బాధపడుతున్న వారు కూడా ఈ ఆసనాన్ని వేయవద్దు.

*హై బీపీ మరియు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనాన్ని వెయ్యకూడదు.

*👆👆👆 పైన చెప్పిన సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని జీవితంలో ఎప్పుడూ ట్రై చేయకండి. ఒకవేళ చేస్తే కనుక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి.

*పెద్ద వయస్సు వారు అంటే 60 సంవత్సరాలు దాటిన వారు ఈ ఆసనం ముందు నుంచి అలవాటు లేకపోతే మాత్రం వెయ్యొద్దు.

*గర్భిణీ స్త్రీలు ఈ ఆసనం వేయకూడదు.

*ప్రతిరోజు యోగాసనాలు వేసే అలవాటు ఉన్నవారు మాత్రమే శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి ఈ ఆసనాన్ని వేయటం మంచిది.

*స్త్రీలు పీరియడ్స్ టైం లో ఈ ఆసనాన్ని అస్సలు వేయకూడదు.

*సిజేరియన్ మరియు ఇతర రకాలైనటువంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఆరునెలలు లేదా సంవత్సరం వరకు ఈ ఆసనం వేయకూడదు.

*పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఊబకాయిలు మరియు నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణలో వేయటం మంచిది.

హలాసనం వేయు విధానం:

*ముందుగా నేల మీద మ్యాట్ పరుచుకుని శవాసనం భంగిమలో పడుకోవాలి.

*ఆ తరువాత రెండు చేతుల్ని నడుము కిందికి చేర్చి ఉంచాలి.

*ఇప్పుడు రెండు కాళ్ళనూ దగ్గరగా చేర్చి నెమ్మదిగా నిటారుగా రెండు కాళ్ళని పైకి లేపాలి. మోకాళ్ళు వంగకూడదు. ఈ సమయంలో మన రెండు చేతుల్ని నడుముకి సపోర్ట్ గా ఉంచాలి. వేళ్ళ సహాయంతో నడుముని గట్టిగా పట్టుకోవాలి. ఆ తర్వాత పైకి లేపిన కాళ్ళని మెల్లగా వెనక్కి చాపాలి. రెండు కాళ్ళని మనం ముఖం మీదుగా పోనిస్తూ కింద ఫోటోలో చూపించిన విధంగా నేలను తాకాలి.

Halasana Yoga in Telugu
హలాసనం
మోకాళ్లు బెండ్ అవ్వకుండా నిటారుగా నేలను తాకాలి. ఇప్పుడు రెండు చేతులు నేలమీద చాపాలి. ఈ భంగిమలో గాలిని బాగా పీలుస్తూ ఉండాలి. అలా చేయకపోతే ఒక్కొక్కసారి ఛాతీ దగ్గర ఏదో పట్టేసినట్లు అనిపిస్తుంది. ఇలా మీరు ఎంత సేపు ఉండగలిగితే అంత మంచిది. చేతులు వెనుకకు పెట్టుకోవడం కుదరకపోతే ముందుకి పెట్టుకోవచ్చు. ఈ ఆసనం వేశాక శవాసనంం కంపల్సరిగా వెెెయ్యండి.

హలాసనం వల్ల కలిగే ప్రయోజనాలు:

*భవిష్యత్తులో వెన్నెముకకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు క్రమం తప్పకుండా హలాసనాన్ని వేయండి.

*పిల్లలకు చిన్నప్పటి నుండే ఈ ఆసనాన్ని అలవాటు చేయండి. ముఖ్యంగా క్రీడల్లో రాణించాలనుకునే వాళ్ళకి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది.

*చిన్నపిల్లలు, వయసులో ఉన్నవాళ్ళు, శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉన్నవాళ్ళు మరియు ప్రతిరోజు యోగాసనాలు వేసే అలవాటు ఉన్నవాళ్ళకి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది.

*ఛాతీ దగ్గర నుండి తొడల వరకు ఉన్న అనవసరమైన కొవ్వునంతటినీ కరిగించేస్తుంది కాబట్టి శరీరం నాజూకుగా తయారయ్యి ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.

Daily Yoga
హలాసనం యొక్క ఉపయోగాలు
*థైరాయిడ్ సమస్యని నివారిస్తుంది మరియు భవిష్యత్తులో రాకుండా చేస్తుంది.

*ముఖానికి కాంతిని ఇస్తుంది. ముఖ్యంగా ఈ ఆసనం వేయడం వల్ల మన వయస్సుని దాచేయొచ్చు తెలుసా. పెద్ద వయసు వారిని కూడా చిన్న వయసు వాళ్ళ లాగా చూపిస్తుంది ఈ ఆసనం.

*మోకాళ్ళకి బలాన్నిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

*సర్వాంగాసనం వేసిన తర్వాత ఈ హలాసనం చేయడం వల్ల చాలా మంచి ఉపయోగాలున్నాయి. కావున ఈ రెండు ఆసనాలు ని ప్రతి రోజు క్రమం తప్పకుండా వేయండి.

*వీర్యకణాల సంఖ్యను పెంచడంలో ఈ ఆసనం బాగా దోహదపడుతుంది. స్త్రీలు మరియు పురుషులలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలని (సెక్సువల్ ఆర్గాన్స్) యాక్టివేట్ గా ఉంచుతుంది.

*జీర్ణకోశానికి సంబంధించిన అవయవాలు అన్నింటిని యాక్టివ్ గా ఉంచుతుంది ఈ ఆసనం. తద్వారా మన జీర్ణకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడేలా చేస్తుంది.

*నాడీ మండల వ్యవస్థను సక్రమంగా పని చేయించేలా చేస్తుంది.

*మొదట్లో ఈ ఆసనం వేయడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. నెమ్మదిగా అలవాటు చేసుకోండి.

*నా ప్రెసెంటేషన్ మీకు నచ్చినట్లయితే ఆర్టికల్ అందరికీ షేర్ చేయండి.

*సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి