Breaking

6, మే 2021, గురువారం

ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించండి ఇలా, how to stop food adulteration, food safety in India

మిత్రులందరికీ స్వాగతం...

ఈ ఆర్టికల్ లో మీకు నేను ఆహారపదార్థాల్లో జరిగే కల్తీని ఎలా తెలుసుకోవచ్చో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అట్లాగే ఈ ఆర్టికల్ మీకు, మీ ఫ్రెండ్స్ కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి అందరికి షేర్ చెయ్యండి. 

Latest kitchen tips
ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించడం ఎలా
*ఆహార పదార్థాల కల్తీ అనేది స్లో పాయిజన్ లాంటిది. ఇది నెమ్మది నెమ్మదిగా మన శరీరంలోని  అన్ని వ్యవస్థల మీద చావుదెబ్బ కొడుతుంది. ఈ కల్తీని అరికట్టడానికి ప్రభుత్వం దగ్గర చాలినంత అధికారులు లేరు.

ఒకవేళ ఉన్నా...!

వాళ్ళు సక్రమంగా పని చేస్తారని గ్యారెంటీ లేదు. ఈ కల్తీ వ్యాపారం రోజు రోజుకీ అంతకంతకీ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఒక రకంగా దీనికి ప్రభుత్వ వైఫల్యం కూడా కారణమని చెప్పొచ్చు. ఈ కల్తీని అరికట్టాలంటే "ఆహార కల్తీ నిరోధక చట్టానికి" ఇంకా పదును పెట్టాలి. కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఆహారపదార్థాల్లో కల్తీ జరిగిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు.

ఆహార పదార్థాల కల్తీ
ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించండిలా
*పాలల్లో జరిగే కల్తీని కనుక్కోవడం ఎలా: ఒక చిన్న బాటిల్లోకి కొద్దిగా పాలు తీసుకుని మూత బిగించి బాగా షేక్ చెయ్యాలి. ఒకవేళ ఆ పాలలో డిటర్జెంట్ లాంటివి ఏమైనా కలిపితే నురగ ఎక్కువగా వస్తుంది.
Food safety authority in India
పాలలో జరిగే కల్తీని గుర్తించండిలా

*పండ్లకి మరియు కూరగాయలకి అంటించిన కృత్రిమ రంగుని కనిపెట్టండి ఇలా: తెల్లని బ్లాటింగ్ పేపర్ ని కొంచెం నీటితో తడిపి లేదా తడి దూదితో కూరగాయలు లేదా ఫ్రూట్స్ ని తుడిస్తే వాటిలో కలిపినటువంటి కృత్రిమ రంగులు ఇట్టే తెలిసిపోతాయి.
How to find food adulteration
కృత్రిమ రంగులు చల్లిన పండ్లు


*ఐస్ క్రీంలలో జరిగే కల్తీని కనిపెట్టండి ఇలా:

ఐస్ క్రీమ్ నుంచి ఒక అరచెంచా ఐస్ క్రీంని బయటకి తీసి అందులో రెండు లేదా మూడు చుక్కలు నిమ్మరసం పిండాలి. అందులోంచి నురగలు వస్తే దాంట్లో డిటర్జెంట్ పౌడర్ లాంటిది కలిసిందని అర్థం.

Food safety information in Telugu
ఐస్ క్రీంలలో జరిగే కల్తీని గుర్తించండిలా

*మిరియాలు కల్తీవో కాదో తెలుసుకోండి ఇలా:

కొన్ని మిరియాలను ఆల్కహాల్ లో వేసినట్లయితే నిజమైనవి ఆల్కహాల్ లో మునిగిపోతాయి. అదే బొప్పాయి గింజలు అయితే పైకి తేలతాయి.

Food safety knowledge in Telugu
మిరియాలు


*ఉప్పు లేదా పంచదారలో జరిగే కల్తీని గుర్తించండి ఇలా:

Awareness about food safety
కల్తీ ఉప్పుని పసిగట్టండి ఇలా

పంచదార మరియు ఉప్పుని చెరొక టీ స్పూన్ తీసుకొని గ్లాసుడు నీళ్ళలో వెయ్యండి. రెండూ అసలైనవి అయితే నీటిలో కరిగిపోతాయి. ఒకవేళ వాటిలో ఏదైనా పొడి లాంటిది కలిపినట్లయితే నీటి అడుగున పేరుకుపోతుంది.

పంచదార కల్తీ
పంచదార కల్తీని అరికట్టడం ఎలా

*కల్తీ తేనెని కనిపెట్టడం ఎలా:
Food safety information in Telugu
కల్తీ తేనెని ఎలా గుర్తించాలి
అర టీ స్పూను తేనెలో కొంచెం దూదిని ముంచి తీసి వెలిగిస్తే నిజమైన తేనె అయితే ఏ ఆటంకం లేకుండా మండుతుంది. అదే కల్తీ తేనె అయితే చిటపటలాడుతుంది.

*టీ పొడిలో జరిగే కల్తీని కనిపెట్టండి ఇలా
Food safety information in Telugu
టీ పొడిలో జరిగే కల్తీని గుర్తించండిలా
ముందుగా కొంచెం టీ పొడిని ఒక పేపర్ మీద చల్లి పైన అయస్కాంతంతో గుండ్రంగా తిప్పాలి. ఒకవేళ టీ పొడిలో ఇనుప రజను కలిసినట్లయితే అయస్కాంతానికి ఇనుప ముక్కలన్నీ అతుక్కుంటాయి. అట్లాగే తడిగా ఉన్నటువంటి ఫిల్టర్ పేపర్ మీద కొంచెం టీ పొడిని చల్లినట్లయితే ఒకవేళ వాడేసిన టీ పొడికి రంగు వేసి అమ్మితే కనుక ఆ రంగు పేపర్ కు అంటుకుంటుంది. ఆ విధంగా కల్తీ పొడిని కనిపెట్టవచ్చు.

*కల్తీ నెయ్యిని సులభంగా కనిపెట్టండి ఇలా:
Food safety information in Telugu
నెయ్యి కల్తీదో కాదో తెలుసుకోవడం ఎలా
ముందుగా కరిగిన నెయ్యిలో ఒక టీస్పూను పంచదార వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ నెయ్యి ఎరుపు రంగులో మారినట్లయితే కల్తీ జరిగిందని గుర్తించండి.

*కారంలో జరిగే కల్తీ గురించి తెలుసుకోండి:
Food adulteration in chilli powder
ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించండిలా
కారం మంచి రంగులో రావటానికి అందులో "మెటానిల్" అనే కెమికల్ వాడతారు తెలుసా. ఈ కెమికల్ చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు మరియు జీర్ణ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. ఈ మెటానిల్ కెమికల్ ని చాక్లెట్లు, జాంగ్రీలు మరియు జిలేబి తయారీలో కూడా మంచి రంగు రావడం కోసం వాడతారు. కొంతమంది అత్యాసపరులు మిరపకాయల తొడిమల్ని పిండి చేసి దాన్ని కూడా కారంలో కలిపి అమ్మేస్తున్నారు. ఇంతకుముందు కారంలో ఇటుకల పొడి కలిపి అమ్మేవారు. అయితే జనం దానిని గుర్తించడంతో ఇలా తొడిమల్ని, ప్రమాదకరమైన రంగుల్ని కలిపి అమ్మేస్తున్నారు. మంచి కారం ఏదో గుర్తించాలంటే ఒకటే పరిష్కారం. స్వయంగా మిరపకాయలు కొని మిల్లు పట్టించుకొని వాడుకోవటమే.

*మీరు కొన్న ఇంగువ మంచిదా కాదా తెలుసుకోండి ఇలా:
మీరు కొన్న ఇంగువ మంచిదైతే కర్పూరంలా మండుతుంది. కల్తీ ఇంగువ అయితే మండదు.

*కల్తీ పసుపుని గుర్తించండి ఇలా:
Duplicate turmeric powder
కల్తీ పసుపుని గుర్తించండిలా
*ఒక చిటికెడు పసుపుని నీళ్లలో వేసి దాంట్లో రెండు చుక్కలు హైడ్రోక్లోరిక్ ఆసిడ్ వేయండి. పసుపులో మెటానిల్ ఎల్లో కలర్ కలిపినట్లయితే ఆ నీరు ఊదా రంగులోకి మారుతుంది.
How to find duplicate turmeric powder
పసుపు పొడి
అంతేకాకుండా పసుపులో లెడ్ క్రోమేట్  కలిపినట్లయితే నీళ్లు మరీ ఎక్కువ పచ్చగా మారతాయి. ఒరిజినల్ పసుపు నీళ్లలో కరగకుండా అడుగున పేరుకుంటుంది.
CLICK HERE TO PURCHASE YOGA MATS
*నా ప్రజెంటేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఆర్టికల్ ని అందరికీ షేర్ చెయ్యగలరు.
*సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి