Breaking

21, మే 2021, శుక్రవారం

భారతదేశంలో ఎంతో అందమైన కోట ఇదే, Best Tourist Spot for Nature Lovers, Kalavantin Durg Maharashtra, Beautiful Fort for trekking, beautiful place for trekking

 ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం ఒక స్వర్గం లాంటిది. కొంతమంది అందమైన ప్లేసులు చూడటానికి వేరే దేశాలు వెళ్తుంటారు. కానీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మన దేశంలోనే ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఈ ప్రదేశం కూడా ఒకటి. సముద్రమట్టానికి 2250 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ కోట. అయితే ఇక్కడికి వెళ్ళాలంటే మీరు శారీరకంగా దృఢంగా ఉంటే సరిపోదు.. మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండాలి. ఎందుకంటే అది ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు. ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం లాంటిది కూడా. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు సాగాలి. లేదంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే. 2250 అడుగుల హైట్ మీటర్లలో కొలిస్తే 685మీ. అది కూడా నిటారుగా ఎక్కుతూ వెళ్ళాలి. కాబట్టి పైకి చేరుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు.

*ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడ ఉంది...?

*ఆ ప్లేస్ కి వెళ్ళటానికి అనువైనటువంటి సమయం ఏది...?

*ఇండియాలోనే ఎంతో అందమైనటువంటి పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా పేరుగాంచిన "కళావంతిన్ కోట" గురించి తెలుసుకోవాలని ఉందా...?

kalavantin durg location
Beautiful places in India
*ఇక్కడికి ఎలా చేరుకోవాలి...?
ఈ కోట "ఠాకూర్ వాడి" అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి దగ్గర్లో "పన్వేల్" రైల్వే స్టేషన్ ఉంది. 
Kalvantin Durg Panvel village
Panvel Railway Station

ట్రైన్ ద్వారా పన్వేల్ గ్రామం చేరుకొని అక్కడి నుండి ఠాకూర్ వాడి విలేజ్ కి బస్సు లేదా ఆటో ద్వారా చేరుకోవచ్చు. ఆటో మరియు టమ్ టమ్ అనే వెహికల్స్ ద్వారా రావాలనుకుంటే ఎక్కువ చార్జ్ చేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకూ బస్సుని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బస్సు ఛార్జి తక్కువ కాబట్టి. సొంత వాహనాల్లో వచ్చేవారికి ఠాకూర్ వాడి విలేజ్లో పార్కింగ్ సౌకర్యం కలదు. పార్కింగ్ కిి కొంత అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. ఉదయం 7 లేదా 8 గంటల్లోపు ఈ కోట దగ్గరికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. ఎనిమిది తర్వాత నుంచి యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం పూట చాలా త్వరగా ఈ కోట దగ్గరికి చేరుకొని మంచు తెరల్లో కళావతి కోట అందం మరియు ఉషోదయపు అందాల్ని వీక్షించండి. అంత ఎత్తైన కోట మీద నుంచి సూర్యోదయాన్ని చూస్తుంటే రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి.
ఒక ముఖ్య గమనిక:
కోట దగ్గరికిి వెళ్ళే ముందు వాటర్ బాటిల్ మరియు గ్లూకోజ్ ప్యాకెట్ వీలైతే కొంచెం ఫ్రూట్స్ దగ్గర పెట్టుకోండి. పైకి ఎక్కే కొద్దీ చెమట బాగా పట్టి త్వరగా డీహైడ్రేట్ అయినప్పుడు ఇవన్నీ పనికొస్తాయి. అట్లాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ కోట దగ్గరకి వెళ్లకపోవటమే మంచిది. గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆస్తమా, ఇస్నోఫీలియా, బ్రాంకైటిస్ మరియు ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. నా సజెషన్ ఏంటంటేే ఇలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ట్రెక్కింగ్ చెయ్యకపోవడమే బెటర్.
Beautiful places in Maharashtra, best vacation spot for outdoor lovers in India best holiday destination for nature lovers in India
చత్రపతి శివాజీ నిర్మించిన కళావతి కోట
కొండపైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. కానీ అవన్నీ నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉంటాయి. పైకి ఎక్కేటప్పుడు చేతిలో కర్ర కంపల్సరిగా పెట్టుకోండి. చాలా ఆసరాగా ఉంటుంది. ఒకవేళ దగ్గర కర్ర లేకపోతే కింద అమ్ముతారు కొనుక్కోండి.
*ఈ కళావతి కోటని చూడటానికి ఏ సమయంలో వెళ్ళాలి.
*జూన్ నుంచి అక్టోబర్ వరకు అనువైన సమయం. ఎందుకంటే వర్షాకాలంలో ఈ కొండ పైకి ఎక్కినప్పుడు మేఘాలన్నీ మన పక్కనే ఉన్నట్లు ఉంటుంది. పైనున్న కోట మీద నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రీనరీ చూడటానికి చాలా చాలా బాగుంటుంది. 
kalavantin durg Maharashtra
కళావతి  కోట మహారాష్ట్ర

కాకపోతే వర్షం వల్ల పైకి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. మెట్లన్నీ వర్షంలో తడిచి ఉంటాయి. కాబట్టి తడి మెట్ల మీద పైకి ఎక్కేటప్పుడు కాలు జారకుండా చూసుకోండి. 
kalavantin durg trekking beautiful place, best travel destination for nature lovers in India best vacation destinations for nature lovers  in India best vacation spot for outdoor lovers in India best holiday destination for nature lovers in India best place for nature lovers in india best places for nature lovers in south india best places to visit in south india for nature lovers best underrated travel destination for nature lovers best vacation spots for nature lovers in India
కళావంతిన్ దుర్గ్ మహారాష్ట్ర
ఒకవేళ పొరపాటున కాలు జారితే తీవ్రంగా గాయాలు అవ్వడమో లేదా ప్రాణాలు పోవటం కూడా జరుగొచ్చు. అన్నీ తట్టుకుని పైన పీక్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చే ఆనందమే వేరు. చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో కోట. పైకి ఎక్కిన తర్వాత పడ్డ కష్టమంతా మర్చిపోతాం.
Chatrapathi Shivaji Kalavanthin Durg
పన్వేల్ గ్రామంలో ఉన్న కళావతి కోట
*ఇంతకీ ఈ కళావతి కోటని ఎవరు కట్టించారు...?
*ఈ కోటని (షుమారుగా) 1657 లో చత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించారు. అప్పటి కాలంలో ఆ ప్రాంతం రాణి అయినటువంటి కళావతి పేరు మీదగా ఈ కోటను కట్టించారని చెప్పుకుంటారు. అప్పట్లో ఈ కోట శత్రుదుర్భేద్యంగా ఉండేది. శత్రువులు ఈ కోటను దాటి ముందుకు వెళ్ళటం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. దానికి తోడు చుట్టూ దట్టమైన అడవులు మరియు పర్వతాలతో నిండి ఉండటం కూడా ఈ కోటకి బాగా కలిసొచ్చింది. ఒక పక్క కోట మీద పహారా కాస్తూనే అడవులు మరియు కొండల్లో నుంచి గెరిల్లా యుద్ధం చేయటంలో మరాఠా యోధులు నిష్ణాతులు అని చెప్పాలి. ఆ విధంగా చత్రపతి శివాజీ నిర్మించిన అద్భుతమైన మరియు అందమైన కోటల్లో ఒకటిగా దీని గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తప్పకుండా చూడవలసిన మరియు అందమైనటువంటి టూరిస్ట్ ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి.

అట్లాగే మీకు మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్ కి సంబంధించిన వివరాలు కావాలంటే కింద ఇచ్చిన వీడియో చూడండి.
కుదిరితే నా వ్లాగింగ్ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి లేదా కింద ఉన్న ఇమేజ్ పైన ట్యాప్ చేయండి.
My Name is SIVA YouTube Channel
ఛానల్ లోకి వెళ్ళటానికి ఈ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి


థాంక్యూ
అండ్
జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి