![]() |
| SIVA RAM YADAV FROM NUZVID CINEMA TALKIES |
Welcome to my Blog....
ఈ ఆర్టికల్ లో మీరు తప్పకుండా చూడాల్సిన ఆరు అద్భుతమైన సౌత్ ఇండియన్ సినిమాల గురించి రివ్యూ ఇస్తాను. వీటిలో ఒకటి హాలీవుడ్ మూవీ మిగతా అయిదు సౌత్ ఇండియన్ మూవీస్. ఈ ఆరు సినిమాల్లో మీకు ఏది బాగా నచ్చింది అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీటిలో ఏదైనా సినిమా మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.
అట్లాగే మీరు లేటెస్ట్ మూవీ రివ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్ NUZVID CINEMA TALKIES ని subscribe చేసుకోండి.
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
లిస్ట్ లో ఫస్ట్ చెప్పబోయే సినిమా వచ్చేసి
1. Shawshank redemption మూవీ
ఈ సినిమా 1994 లో రిలీజ్ అయింది. ఇంట్లో ఉండటాన్ని జైలు జీవితం గా భావించే వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఈ సినిమా చూడటం వల్ల మీ లో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ పోయి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి.
![]() |
| Shawshank redemption review by NUZVID CINEMA TALKIES |
2. లూసిఫర్
ఇది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ఈ సినిమా చాలా చక్కగా వివరిస్తుంది.
ఈ సినిమాకి మోహన్లాల్ నటన హైలెట్ అని చెప్పాలి. ఆయన సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో తన భుజాలమీద మోసేసాడు. క్యారెక్టర్లో ఆయన చూపించే వేరియేషన్స్ మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. విలన్ గా చేసిన వివేక్ ఒబెరాయ్ తనకున్న పరిధిలో బాగానే నటించాడు. ఒక నాయకుడు చనిపోతే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది.... అధికారం కోసం ఒకరికొకరు ఎలాంటి కుయుక్తులు పన్నుతారు అనే విషయాన్ని ఈ సినిమా చాలా బాగా ప్రెజెంట్ చేసింది. నాకు అమితంగా నచ్చిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. త్వరలో ఈ సినిమాకి రెండో పార్ట్ కూడా రానుంది.
3. PERANBU
సెరిబ్రల్ పాలసీ అనే వ్యాధి ఉన్న తన కూతురిని ఒక తండ్రి ఎంత ప్రేమగా చూసుకున్నాడు అన్నదే ఈ సినిమా యొక్క ప్రధాన కథ. తండ్రి క్యారెక్టర్లో మమ్ముట్టి జీవించాడనే చెప్పాలి. హీరోయిన్ అంజలి క్యారెక్టర్ కూడా మనల్ని కొంతమేరకు ఆకట్టుకుంటుంది. కూతురి కోసం తపన పడే తండ్రిగా మమ్ముట్టి యాక్షన్ అల్టిమేట్ అని చెప్పాలి. మనమందరం నేచర్ లో ఒక భాగమే అన్న చక్కని విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. తండ్రి కూతురు మధ్యలో వచ్చే సన్నివేశాలు మనల్ని ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేస్తాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి.
4. ఖైదీ...
5. అసురన్....
ఈ రెండూ హీరో బేస్డ్ సినిమాలు. ఒక డిఫరెంట్ పాయింట్ ని కమర్షియల్ గా ఎలా చెప్పచ్చో ఈ రెండు సినిమాలు తెలియజేస్తాయి. మొత్తంగా చూస్తే రెండూ సూపర్బ్ మూవీస్.
ఖైదీ సినిమాలో కూతురు కోసం ఎదురుచూస్తున్న తండ్రిగా కార్తీ నటన మనల్ని చాలా చాలా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే అతను జైలు నుంచి విడుదల అవుతాడు కాబట్టి....! సినిమా మొత్తం ఒక నైట్ లో జరిగే స్టొరీ. డైరెక్టర్ చాలా ఆసక్తిగా తెరకెక్కించాడు ఈ సినిమాని.
ఇక అసురన్ విషయానికొస్తే... సమాజంలో ఉన్న సమస్యల్ని ప్రస్తావిస్తూనే ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. హీరో క్యారెక్టర్ లో ధనుష్ ని తప్ప మరొకరిని అస్సలు ఊహించుకోలేం. అంత బాగా నటించాడు తను.
6. జెర్సీ మూవీ
నాని కెరీర్లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఈ సినిమా ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అర్జున్ అనే ఒక క్రికెటర్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా దర్శకుడు. కథలోకి వెళితే అర్జున్ తన క్రికెట్ కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే క్రికెట్ ని వదిలేస్తాడు. అతను క్రికెట్ ని ఎందుకు వదిలేసాడు...? మళ్లీ క్రికెట్ ఆడాడా...? తర్వాత ఏం జరిగింది...? అన్న విషయాల్ని డైరెక్టర్ చాలా చక్కగా తెరకెక్కించాడు. కొడుకు కోసం బ్రతికే తండ్రిగా నానీ యాక్టింగ్ అదుర్స్ అని చెప్పాలి. భార్య క్యారెక్టర్లో శ్రద్ధా శ్రీనాథ్ చక్కని నటన కనబరిచింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా బాగా సెట్ అయ్యాయి. సినిమా సెకండాఫ్ లో వచ్చే ట్రైన్ సీన్ టోటల్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఆ సీన్ లో నాని యొక్క పర్ఫార్మెన్స్ ని చూసిన ప్రతీ ప్రేక్షకుడు కంటతడి పెట్టడం ఖాయం. ఫిల్మీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన అద్భుతమైన సినిమాల్లో ఇది కూడా ఒకటి.
ఇది ఫ్రెండ్స్ ఆరు అద్భుతమైన సినిమాల యొక్క రివ్యూస్. నా ప్రజెంటేషన్ నచ్చితే ఈ ఆర్టికల్ ని షేర్ చెయ్యండి.
థాంక్యూ.
మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ NUZVID TECH EXP నుంచి Subscribe చేసుకోండి.
లింక్ కోసం ఇక్కడ CLICK చెయ్యండి
![]() |
| Lucifer movie review by NUZVID CINEMA TALKIES |
![]() |
| Peranbu movie review by NUZVID CINEMA TALKIES |
సెరిబ్రల్ పాలసీ అనే వ్యాధి ఉన్న తన కూతురిని ఒక తండ్రి ఎంత ప్రేమగా చూసుకున్నాడు అన్నదే ఈ సినిమా యొక్క ప్రధాన కథ. తండ్రి క్యారెక్టర్లో మమ్ముట్టి జీవించాడనే చెప్పాలి. హీరోయిన్ అంజలి క్యారెక్టర్ కూడా మనల్ని కొంతమేరకు ఆకట్టుకుంటుంది. కూతురి కోసం తపన పడే తండ్రిగా మమ్ముట్టి యాక్షన్ అల్టిమేట్ అని చెప్పాలి. మనమందరం నేచర్ లో ఒక భాగమే అన్న చక్కని విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. తండ్రి కూతురు మధ్యలో వచ్చే సన్నివేశాలు మనల్ని ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేస్తాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి.
![]() |
| Khaithi Movie Review by NUZVID CINEMA TALKIES |
5. అసురన్....
![]() |
| Asuran movie review by NUZVID CINEMA TALKIES |
ఖైదీ సినిమాలో కూతురు కోసం ఎదురుచూస్తున్న తండ్రిగా కార్తీ నటన మనల్ని చాలా చాలా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే అతను జైలు నుంచి విడుదల అవుతాడు కాబట్టి....! సినిమా మొత్తం ఒక నైట్ లో జరిగే స్టొరీ. డైరెక్టర్ చాలా ఆసక్తిగా తెరకెక్కించాడు ఈ సినిమాని.
ఇక అసురన్ విషయానికొస్తే... సమాజంలో ఉన్న సమస్యల్ని ప్రస్తావిస్తూనే ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. హీరో క్యారెక్టర్ లో ధనుష్ ని తప్ప మరొకరిని అస్సలు ఊహించుకోలేం. అంత బాగా నటించాడు తను.
![]() |
| Jersey movie review by NUZVID CINEMA TALKIES |