Breaking

28, ఏప్రిల్ 2021, బుధవారం

శీర్షాసనం యొక్క ఉపయోగాలు, Shirshasana Benefits in Telugu , Uses of Yoga, Best in Yoga

మిత్రులందరికీ స్వాగతం...

ఈ ఆర్టికల్ లో మీకు నేను శీర్షాసనం యొక్క ఉపయోగాలు చెబుతాను. దీనిని యోగాసనాల రాజు అంటారు. అంతేకాకుండా ప్రతిరోజు ఈ ఆసనం వేయడం వల్ల దాదాపుగా 40కిపైగా అనారోగ్యాల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అందుకే ఈ ఆసనం యోగాసనాలు అన్నిటిలోనూ రాజుగా పిలవబడుతుంది.

Benefits of headstand yoga
శీర్షాసనం యొక్క ఉపయోగాలు

ముఖ్య గమనిక: యోగాసనాలు నిపుణుల సమక్షంలోనే వెయ్యండి. అంతేకాని అరకొర అజ్ఞానంతో సొంతంగా ట్రై చెయ్యొద్దు. మీ శరీర తత్వానికి ఏ యోగాసనం సూట్ అవుతుందో తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకోవడం మంచిది. యోగాతో పాటు సమతుల ఆహారం మరియు రోజుకు ఎనిమిది గంటల నిద్ర ఉంటేనే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కావున ఈ విషయాన్ని గమనించగలరు. ఎప్పుడూ కూడా హడావిడిగా యోగ చేయకూడదు. ప్రశాంతంగా యోగా చెయ్యాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి.

shirshasana yoga
శీర్షాసనం వేసే విధానం

*శీర్షాసనం మొదటినుంచి నేర్చుకునేవాళ్ళు గోడ సపోర్టుతో వేయడం మంచిది. ముందుగా ఒక మెత్తటి దిండుని తీసుకుని దానిని గోడకి దగ్గరగా పెట్టి రెండు అరచేతులు దగ్గరగా చేర్చి దిండు మీద పెట్టవలెను.

Sheershasana uses
శీర్షాసనం మొదటినుంచి
ఆ తర్వాత పై ఫొటోలో చెప్పిన విధంగా చేతులు పెట్టి ఆ చేతులలో మీ తలని ఉంచి ముందుకి వంగి పైన చూపిన విధంగా రెండు కాళ్ళని పైకి లేపవలెను. కాళ్ళని పూర్తిగా పైకి లేేపి గోడ సపోర్టుతో బ్యాలెన్స్ చేయవలెను. ఆసనం వేస్తున్నంతసేపు నెమ్మదిగా గాలి పీలుస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇలాగ శ్వాస మీద ధ్యాస పెడుతూ యోగా చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం కింద ఇచ్చిన వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా బాగా అర్థమవుతుంది.
ముందుగా ఒక నిమిషం సేపు ఈ శీర్షాసనం వెయ్యటం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సమయాన్ని కొద్దికొద్దిగా పెంచుకుంటూ పోవాలి. శీర్షాసనానికి శరీరం పూర్తిగా అలవాటు పడిన తరువాత గోడ సపోర్ట్ లేకుండా వెయ్యటం నేర్చుకోవాలి. గోడ సపోర్టు లేకుండా శీర్షాసనం వేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం: డైరెక్టుగా ఎప్పుడూ నేల మీద యోగాసనాలు వేయకూడదు.
ఫ్లోర్ మీద ఒక మెత్తటి క్లాత్ పరిచి దాని మీద యోగాసనాలు వేయడం మంచిది. మ్యాట్ ఉంటే మరీ మంచిది.
Headstand yoga uses
శీర్షాసనం వల్ల కలిగే లాభాలు
శీర్షాసనం యొక్క ఉపయోగాలు:
*విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఈ ఆసనం నేర్పించడం చాలా మంచిది. దాంతో ఏకాగ్రత పెరిగి చదువులో ముందుంటారు.
*జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
*మతిమరుపుని తగ్గిస్తుంది.
*ఈ ఆసనం వేయడం వల్ల తలకి రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
*ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఈ ఆసనం వేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు మరియు కీళ్లనొప్పుల నుంచి దూరంగా ఉండొచ్చు.
*థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళకి శీర్షాసనం ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది.
*నడుము మరియు పొట్ట దగ్గర దగ్గర కొవ్వుని కరిగిస్తుంది.
*శీర్షాసనం వలన మెదడుకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అందువల్ల మెదడు ఎప్పుడూ చురుకుగా పనిచేస్తుంది.
*దంత సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం నోటి దుర్వాసన ఉన్నవాళ్లు ఈ ఆసనం వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
(గమనిక: దంత సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం మరియు నోటి దుర్వాసన సమస్యలు ఇతర కారణాల వల్ల కూడా వస్తాయి. ఒకవేళ శీర్షాసనంతో అవి తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం)
*ముఖాన్ని కాంతిమయం చేస్తుంది.
*అధిక మొటిమలు సమస్య ఉన్నవాళ్లకి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది.
CLICK HERE TO PURCHASE YOGA MATS
*ప్రతిరోజు ఈ ఆసనం వేయడం వల్ల ముఖము ఎంతో ఎర్రగా మరియు అందంగా కనబడుతుంది.
*నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు అనగా సరిగ్గా నిద్రపట్టని వాళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ ఆసనం వేయడం వల్ల మెదడులో ఉండేటటువంటి నాడులు అన్నింటికీ రక్తప్రసరణ బాగా జరిగి సుఖ నిద్ర పడుతుంది.
*భవిష్యత్తులో షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు అల్జిమర్స్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే వారంలో కనీసం ఐదు రోజులైనా ఈ ఆసనం వేయాలి.
*ఈ ఆసనం కంటి సమస్యలను నివారిస్తుంది మరియు మీ కళ్ళు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనబడతాయి.
*కంటి కింద నల్లటి చారలు తగ్గిస్తుంది.
*ముఖానికి మంచి రంగు మరియు తేజస్సుని అనిపిస్తుంది.
*ముఖం మీద ముడతలు పడకుండా మరియు వృద్ధాప్యం తొందరగా రాకుండా ఉండాలంటే మాత్రం ప్రతిరోజు శీర్షాసనం వెయ్యండి.
*ఒత్తిడి మరియు స్ట్రెస్ ని బాగా తగ్గిస్తుంది.
*మానసిక ప్రశాంతతని అందిస్తుంది.
*ఈ ఆసనం వేయడం వల్ల లోపల ఉన్నటువంటి చెడు కొవ్వు పోయి శరీరం మన అదుపులో ఉంటుంది.
*నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు ప్రతిరోజూ ఈ ఆసనం వేయడం మంచిది.
*ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉన్నవాళ్లు-
అంటే  ఆస్తమా, ఇస్నోఫీలియా, బ్రాంకైటిస్, సైనస్, నిమోనియా మరియు ఇతర లంగ్స్ సమస్యలకి ఈ ఆసనం మంచి విరుగుడుగా పని చేస్తుంది.
*మెదడును చురుకుగా ఉంచి మేధాశక్తిని పెంచడంలో దోహదపడుతుంది.
*ఒబేసిటీని తగ్గిస్తుంది.
*రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
*వీర్యకణాల సంఖ్యని పెంచుతుంది.
*నత్తిగా మాట్లాడుటను అరికడుతుంది.
*స్టామినాను పెంచుతుంది
*తల తిరగటం ని తగ్గిస్తుంది.
*జీర్ణశక్తిని పెంచుతుంది.
*ముక్కుకు సంబంధించిన సమస్యల్ని తగ్గిస్తుంది లేదా రాకుండా చేస్తుంది.
*నరాల బలహీనతని అదుపులో ఉంచుతుంది.
(గమనిక: నరాల బలహీనతకి ఇతర అంశాలు కూడా కారణం కావచ్చు. ఒకవేళ ఈ ఆసనంతో నరాల బలహీనత తగ్గకపోతే డాక్టర్ ని సంప్రదించండి.)
*భవిష్యత్తులో జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మరియు క్యాన్సర్లు రాకుండా చూస్తుంది.
*హెర్నియా (వరిబీజం) సమస్యని రాకుండా చూస్తుంది.
*చాలా రకాలైనటువంటి మానసిక సమస్యలకి తట్టుకునే శక్తినిస్తుంది.
*మూర్ఛ వ్యాధిని అదుపులో ఉంచుతుంది మరియు కొత్తవాళ్ళకి రాకుండా చేస్తుంది.
*ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే దీన్ని ఆసనాలన్నిటిలోకి రాజు అంటారు.
*ఈ ఆసనం ఎంతసేపు వేయాలన్నది మీ శరీరం సహకరించటాన్ని బట్టి ఉంటుంది.
శీర్షాసనాన్ని వీళ్ళు వేయకూడదు.
*గర్భిణీ స్త్రీలు, హై బీపీ, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఊబకాయులు ఈ ఆసనాన్ని వేయకూడదు.
*ఒకవేళ ఊబకాయులు (హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు) ఈ ఆసనాన్ని వేసినట్లయితే కాలర్ బోన్ విరిగే ప్రమాదముంది.
సర్వేజనా సుఖినోభవంతు....🙏🙏🙏🙏🙏

అట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్...
మీకు హెల్త్ మరియు కిచెన్ కి సంబంధించిన టిప్స్ లేదా వీడియోలు కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ NUZVID HEALTH AND KITCHEN ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ CLICK చెయ్యండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి