Breaking

2, సెప్టెంబర్ 2020, బుధవారం

10 ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు, 10 best family oriented movies in Telugu

మిత్రులందరికీ స్వాగతం

ఈ ఆర్టికల్ లో మీకు నేను తెలుగులో గత 20 సంవత్సరాలలో పది ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు గురించి వివరిస్తాను. అంతేకాకుండా బోనస్ గా ఇంకొక కుటుంబ కథా చిత్రం గురించి కూడా చెబుతాను.  అంటే మొత్తంగా 11 కుటుంబ కథా చిత్రాల గురించి చెప్తాను.

కుటుంబ కథా చిత్రాల్లో హిట్ అయినవి చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పాలంటే ఆర్టికల్ బాగా లెంగ్తీ అయిపోతుంది. కాబట్టి ఉన్నవాటిలోంచి బెస్ట్ అనిపించిన 11 సినిమాల రివ్యూ చెబుతాను. అట్లాగే మీకు లేటెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్ NUZVID CINEMA TALKIES ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

10 best family entertainment movies in Telugu

1. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి

kshemangavelli labangarandi

మొదట చెప్పే సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ సినిమా 2000 ఫిబ్రవరి 4న రిలీజ్ అయింది. ఈ చిత్రం నిడివి 2గంటల 50ని. డైరెక్టర్ పేరు రాజా వన్నెం రెడ్డి. కుటుంబ కథా చిత్రాల్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే నవ్వు ఆపుకోలేను. అంత బాగుంటుంది ఈ సినిమా. ఎమ్.ఎల్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ఎమ్.వి.లక్ష్మి గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్, రోజా, రాజేంద్రప్రసాద్, ప్రీతి, బ్రహ్మానందం, కోవై సరళ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంలో నటించారు. మొత్తంగాా చూస్తే ఈ సినిమా ఒక కంప్లీట్ అవుటండవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఉండే సంఘటనల్ని చాలా వినోదాత్మకంగా చూపించారు. అహంకారం ప్రదర్శించే భర్తల క్యారెక్టర్లలో శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం యాక్టింగ్ అల్టిమేట్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం కోవై సరళ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. సినిమా హిట్ అవడానికి బ్రహ్మానందం కోవై సరళ గార్ల కామెడీ బాగా ప్లస్ అయింది.

2. కలిసుందాం...రా

kalisundam raa movie

వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు మరియు సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దర్శకుడి పేరు ఉదయ్ శంకర్. ఈ చిత్రం నిడివి 2గం 36ని. 2000 సంవత్సరం జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో  కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది కూడా. ఎస్ఎ. రాజ్ కుమార్ అందించిన సంగీతాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటారు. వెంకటేష్ సిమ్రాన్ తో పాటు కళాతపస్వి కె.విశ్వనాథ్, శ్రీహరి, అన్నపూర్ణ, రంగనాథ్, బ్రహ్మానందం, ఆలీ, రాళ్ళపల్లి మొదలైనటువంటి భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందింది. తమ రెండు కుటుంబాలని కలపటం కోసం వెంకటేష్ చాలా కష్టపడతాడు ఈ సినిమాలో. వెంకటేష్ సిమ్రాన్ చాలా మంచి జోడీ అనిపించుకున్నారు ఈ సినిమాతో.

3. సందడే సందడి

sandade sandadi

ఆదిత్య రామ్ మూవీస్ బ్యానర్ పై ముప్పలనేని శివ దర్శకత్వంలో ఆదిత్య రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతి బాబు, కవిత రజిని, రాజేంద్ర ప్రసాద్, రాశి, శివాజీ మరియు సంఘవి జంటగా నటించిన ఈ చిత్రం 2002 డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది. తప్పు దారిలో వెళ్తున్న తమ భర్తల్ని దారికి తెచ్చుకునే క్యారెక్టర్లలో కవిత రజిని, రాశి మరియు సంఘవీల యాక్టింగ్ అదుర్స్ అని చెప్పాలి. అంతేకాకుండా ఈ ముగ్గురికి సహాయం చేసే క్యారెక్టర్ లో కోవై సరళ అద్భుతమైన హాస్యాన్ని పండించింది.   బ్రహ్మానందం కామెడీ కూడా బాగా పండింది. హీరోలు ముగ్గురూ చాలా బాగా నటించారు. నవ్వించారు కూడా.

4. మా అన్నయ్య

maa annayya movie

2002 డిసెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఎస్.ఆర్.ఎస్ అండ్ శ్రీ గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సింగనమల రమేష్ మరియు బెల్లంకొండ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ పేరు రవిరాజా పినిశెట్టి. విక్రమన్ ఈ చిత్రానికి కథని అందించారు. రాజశేఖర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఆయనతో పాటు మీనా, బ్రహ్మాజీ, వినీత్, రమాప్రభ, నాజర్ తదితరులు నటించారు. కుటుంబ బాధ్యతలు తలకెత్తుకునే అన్న క్యారెక్టర్ లో  రాజశేఖర్ గారి యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే క్యారెక్టర్లో హీరోయిన్ మీనా చాలా బాగా నటించింది. అందరూ తమ పరిధి మేరకు చాలా చక్కని అభినయాన్ని కనబరిచారు.

5. డాడీ

chiranjeevi movie daddy

ఈ సినిమా 2001 అక్టోబర్ 4న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. చిరంజీవి సరసన సిమ్రాన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా లెంగ్త్ 2గం 36ని. ఎస్ఏ. రాజ్ కుమార్ అందించిన పాటలు చాలా మెలోడియస్ గా ఉంటాయి. ఈ సినిమా కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోయినా చిరంజీవి కెరియర్ లో బెస్ట్ ఎమోషనల్ కంటెంట్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది. చిరంజీవి లాంటి పెద్ద హీరో ఒక నార్మల్ క్యారెక్టర్ చేయడం ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. ఈ సినిమా విషయంలో దర్శకుడు సురేష్ కృష్ణ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

ఏదేమైనా కానీ ...

కూతురు కోసం తపనపడే తండ్రి క్యారెక్టర్లో చిరంజీవి గారి నటన ఆడియెన్స్ ని కంటతడి పెట్టిస్తుంది. కామెడీ తక్కువ ఉండటం కూడా ఈ సినిమాకి ఉన్న మరొక మైనస్ పాయింట్.

6. అతడు

mahesh babu athadu movie

త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలెంట్ ప్రపంచానికి తెలిసింది ఈ సినిమాతోననే చెప్పాలి. ఎక్కడా బోర్ కొట్టని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో, సున్నితమైన హాస్యంతో మరియు గూబ పగిలిపోయే పంచ్ డైలాగులతో ఈ సినిమా రూపొందింది. హీరో మహేష్ బాబు కెరీర్లోని బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమాకి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే క్లైమాక్స్ ఫైట్ తీయడానికిిిి 180 కెమెరాలు వాడారు తెలుసా. ఇది కూడా ఒక రికార్డే. మహేష్ బాబు త్రిషల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. బ్రహ్మానందం, సునీల్, తనికెళ్ళ భరణి మరియు బ్రహ్మాజీల కామెడీ చాలా బాగుంటుంది. సినిమాలెంగ్త్ మూడు గంటలైనా కానీ ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని మలచడంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 100% సక్సెస్ అయ్యాడు.

7. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

seethamma vakitlo sirimalle chettu

మహేష్ బాబు, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలను ఒకే సినిమాలో నటింపజేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజుని అభినందించి తీరాల్సిందే. ఇద్దరు హీరోలకి తగ్గట్లు కథ రాయడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, కోట శ్రీనివాసరావు,  సమంత, అంజలి, రోహిణి హట్టంగడి, తనికెళ్ల భరణి, రవిబాబు తదితరులు నటించిన ఈ సినిమా 2013 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్లలో దూసుకెళ్లి పోయింది ఈ సినిమా.

8. భలే భలే మగాడివోయ్

bhale bhale magadivoy
నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా 2015 సెప్టెంబర్ 4న రిలీజైంది. మతిమరుపు అనేే కాన్సెప్ట్ తో కామెడీని జోడించి వినోదాత్మకంగా  తెరకెక్కించారు. తను మతిమరుపు కనపడకుండాా హీరో నాని ఇచ్చే కవరింగ్ సూపర్బ్. ఈ సినిమాతో డైరెక్టర్ మారుతి తన ఖాతాలో మరొక హిట్ ని వేసుకున్నాడు. గోపీసుందర్ అందించిన సంగీతం చాలా బాగుంటుంది. సన్నివేశాలకు తగ్గట్లు వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్ అనే చెప్పాలి. కామెడీ డోస్ ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది.
9. శతమానం భవతి
sathamanam bhavati movie

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా  2017 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. బిడ్డలకు దూరమైన తల్లిదండ్రుల పాత్రలో జయసుధ ప్రకాష్ రాజ్ ల నటన మనసుకి హత్తుకునేలా ఉంటుంది. బావామరదళ్ళ క్యారెక్టర్లలో నటించిన అనుపమ పరమేశ్వరన్, శర్వానంద్  కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సన్నివేశాలకు తగ్గట్లు వచ్చే కామెడీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. తల్లిదండ్రుల్ని దూరం పెట్టే కొడుకులు, కూతుళ్లకి ఈ సినిమా ఒక గుణపాఠం అని చెప్పాలి. చక్కని కుటుంబ విలువలతో ఎక్కడా అసభ్యత లేకుండా ఈ సినిమా రూపొందింది.
10. గీత గోవిందం
geetha govindam movie

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు15 2018న రిలీజ్ అయింది. అర్జున్ రెడ్డి లాంటి రఫ్ క్యారెక్టర్ తర్వాత విజయ్ గోవింద్ లాంటి స్మూత్ క్యారెక్టర్ చేయడం విజయ్ దేవరకొండకే చెల్లింది. హీరోయిన్ రష్మిక కూడా చాలా బాగా నటించింది. రాహుల్ రామకృష్ణ కామెడీ సూపర్బ్ అని చెప్పొచ్చు. కొద్దిసేపే అయినా వెన్నెల కిషోర్ తన కామెడీతో బాగా నవ్విస్తాడు. కథకి అవసరమైన ముఖ్యమైన పాత్రలో నిత్యా మీనన్ నటించింది. సుబ్బరాజు, నాగబాబు మరియు అన్నపూర్ణ తమ పరిధి మేరకు మెప్పించారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. పాటలు అదుర్స్.
11. అత్తారింటికి దారేది
attarintiki daredi movie review Telugu

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 2013 సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా దారుణమైన ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దాంతో అయన ఈ సినిమా కోసం ఎంతో కసితో, కష్టపడి పని చేశారు. ఆయన కష్టం స్క్రీన్ మీద క్లియర్ గా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ టాలెంట్ తో పాటు త్రివిక్రమ్ మ్యాజిక్ కూడా తోడవడంతో సినిమా బంపర్ హిట్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సూపర్బ్. సమంత, నాదియా, ప్రణీత, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, బొమన్ ఇరానీ, రావు రమేష్ తదితరులు ఈ సినిమాలో నటించారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా టాప్ ప్లేస్ లో నిలిచింది.

నా ప్రజంటేషన్ నచ్చితే ఈ ఆర్టికల్ ని అందరికీ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్.
థాంక్యూ.
అండ్
జైహింద్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి