Hi Friends....
Welcome to My Blog....
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను మిమ్మల్ని బాగా మోటివేట్ చేసే కొన్ని అద్భుతమైన మోటివేషనల్ మూవీస్ గురించి చెబుతాను. అట్లాగే ఈ మోటివేషనల్ మూవీస్ లో మీకు ఏది బాగా నచ్చిందన్నది కింద మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అంతే కాకుండా మీకు లేటెస్ట్ మూవీ రివ్యూస్ కావాలంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్
NUZVID CINEMA TALKIES ని SUBSCRIBE చేసుకోండి. చాలా జెన్యూన్ గా మూవీ రివ్యూస్ ఇస్తాను. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఇక లేట్ చెయ్యకుండా టాపిక్ లోకి వెళ్లిపోదామా...!
*లిస్టులో చెప్పుకోబోయే ఫస్ట్ సినిమా వచ్చేసి...
1. దంగల్ మూవీ
అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. ఈ సినిమా యొక్క నిడివి రెండు గంటల 45 నిమిషాలు. ఈ సినిమా డైరెక్టర్ పేరు నితీష్ తివారీ. మహావీర్ సింగ్ ఫోగట్ అనే రెజ్లర్ లైఫ్ లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సినిమా లెంగ్త్ దాదాపు మూడు గంటలపాటు ఉన్నా ఆడియన్స్ కి ఎక్కడా బోరు కొట్టకుండా తెరకెక్కించడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. కూతుళ్లను రెజ్లర్స్ గా తీర్చిదిద్దటంలో అమీర్ ఖాన్ పడ్డ కష్టం ఎంతన్నది స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇందులోని సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ని గదిలో బంధించిన సన్నివేశంలో అయితే ప్రేక్షకులు కంటతడి పెట్టేస్తారు కూడా. మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రకి అమీర్ ఖాన్ జీవం పోసాడనే చెప్పాలి. పాత్రలోని వేరియంట్స్ కి తగ్గట్లుగా తన గెటప్ మరియు శరీరాకృతిని కూడా మార్చుకోవడం కేవలం అమీర్ ఖాన్ కే చెల్లింది.
2. ఫైండింగ్ నీమో
ఈ సినిమా 2003 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నిడివి ఒక గంట 40 నిమిషాలు. మంచి మెసేజ్ ఇచ్చే కంటెంట్ ఉన్న మూవీ. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా యొక్క కథ ఉంటుంది. నీమో అనే చేప పిల్ల తప్పిపోయి తిరిగి తన తండ్రి వద్దకు ఎలా చేరిందన్నది స్క్రీన్ మీద చాలా ఆసక్తికరంగా చూపిస్తారు. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ సినిమా చూసేటప్పుడు మొబైల్ లో అయితే ఒక మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ మరియు టీవీలో అయితే మంచి క్వాలిటీ సౌండ్ బాక్సులు పెట్టుకుని చూడండి. నాకు నచ్చిన కార్టూన్ మూవీస్ లో బెస్ట్ మూవీ ఇది.
3. IAM LEGEND movie
నా ఫేవరెట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో ఒంటరితనంతో బాధపడే ఒక సైంటిస్ట్ గా విల్ స్మిత్ యొక్క నటన అద్భుతం అని చెప్పాలి. ఒక వైరస్ ప్రభావంతో ప్రపంచంలో మూడో వంతు జనాలందరూ జాంబీ లు గా మారిపోతారు. ఆ వైరస్ కి విరుగుడు కనుక్కున్న తర్వాత హీరో చనిపోవడంతో సినిమా ముగుస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న చక్కని మెసేజ్ ని ఈ సినిమా ఇస్తుంది. ఈ సినిమాలోని విల్ స్మిత్ క్యారెక్టర్ కి జనాలు ఫిదా అయిపోయారు. అందుకే ఈ సినిమాని బ్లాక్బస్టర్ హిట్ లిస్టు లో చేర్చారు.
4. Babe Pig in the City
ఈ సినిమాలో ఒక పందిపిల్ల లీడ్ రోల్ పోషించింది. జనరల్ గా పందుల్ని చూస్తే మనం అసహ్యించుకుంటాం. కానీ ఈ సినిమాలో పంది పిల్ల చేసే అల్లరి, సాహసాలు అబ్బుర పరిచేలా ఉంటాయి. ఈ పంది పిల్ల జంతువులు అన్నిటికి నాయకుడిగా ఉంటూ వాటన్నిటినీ లీడ్ చేస్తుంటుంది. అయితే అనుకోకుండా జంతువులన్నింటిని సర్కస్ కంపెనీ వాళ్ళు ఎత్తుకెళ్లిపోతారు. తన వాళ్లందరినీ తిరిగి ఎలా విడిపించింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం మన సమాజంలో చాలామంది కులము మతము మరియు డబ్బు హోదా అనే తారతమ్యాలతో ఒకళ్ళనొకళ్ళు విభజించుకుని కొట్టుకు చస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ సినిమా ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఇందులోని జంతువులన్నీ ఎంతో ఐక్యమత్యంగా కలిసి మెలిసి ఉంటాయి. ఐకమత్యం అనే ఒక చక్కని మెసేజ్ ని ఇస్తుందీ సినిమా.
5. Pursuit of happiness
మనల్ని బాగా మోటివేట్ చేసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎన్ని భయంకరమైన కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలి అనే సందేశాన్ని ఇస్తుందీ సినిమా. ఒక తండ్రి తన కొడుక్కి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో చక్కగా బోధిస్తాడు. ఆ తండ్రి పాత్రలో విల్ స్మిత్ నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఉంటుంది. నిజజీవితంలో తండ్రీకొడుకులు అయిన విల్ స్మిత్ మరియు జేడ్ స్మిత్ ఈ సినిమాలో కూడా తండ్రి కొడుకులు గా నటించడం యాదృచ్చికం. మొత్తంగా చూస్తే మనల్ని బ్రెయిన్ వాష్ చేసి బాగా మోటివేట్ చేసే అత్యద్భుతమైన సినిమాల్లో ఈ సినిమా ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
6. సన్నాఫ్ సత్యమూర్తి
ఇంత మంచి మోటివేటెడ్ మూవీస్ లిస్టు లో ఒక తెలుగు సినిమా కూడా ఉండటం మనకి ఎంతో గర్వకారణం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైరెక్టర్. ప్రతి ఫ్రేమ్ లోనూ ఆయన సిగ్నేచర్ కనిపిస్తుంది. చాలా చాలా డీసెంట్ క్యారెక్టర్ లో ప్రకాష్రాజ్ కనిపిస్తారు. విలువలకు కట్టుబడే వ్యక్తిగా బన్నీ నటన మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఆస్తి కోల్పోయినా కూడా తను నమ్ముకున్న విలువలు కోసమే బ్రతుకుతాడు. చివరకు గెలుస్తాడు కూడా. మొత్తంగా చూస్తే ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెన్సార్ వాళ్ళు దీనికి క్లీన్ యు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని ఈ సినిమా చూడొచ్చు.
7. Chak De India
షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత బాగుంటుంది ఈ సినిమా. దీని తర్వాత ఎన్నో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ వచ్చాయి. వాటన్నిటినీ ఈ సినిమాతో పోల్చటం ఈ సినిమా యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అవమానానికి గురైన కబీర్ ఖాన్ అనే హాకీ ప్లేయర్ పాత్రలో షారుక్ ఖాన్ జీవించేశాడని చెప్పాలి. తనకు జరిగిన అవమానాన్ని సన్మానం గా మార్చుకోవడం కోసం అతను ఎంచుకున్న మార్గం చాలా ఉన్నతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాను తప్పకుండా చూడాలి. ఇది వాళ్ళని బాగా మోటివేట్ చేస్తుంది కూడా.
మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ వీడియో చూడండి.👇👇
ఇవి ఫ్రెండ్స్....
మిమ్మల్ని బాగా మోటివేట్ చేసే కొన్ని అద్భుతమైన చిత్రాలు...
నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ని వేరే వాళ్ళకి షేర్ చేయండి.
Welcome to My Blog....
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను మిమ్మల్ని బాగా మోటివేట్ చేసే కొన్ని అద్భుతమైన మోటివేషనల్ మూవీస్ గురించి చెబుతాను. అట్లాగే ఈ మోటివేషనల్ మూవీస్ లో మీకు ఏది బాగా నచ్చిందన్నది కింద మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అంతే కాకుండా మీకు లేటెస్ట్ మూవీ రివ్యూస్ కావాలంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్
NUZVID CINEMA TALKIES ని SUBSCRIBE చేసుకోండి. చాలా జెన్యూన్ గా మూవీ రివ్యూస్ ఇస్తాను. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఇక లేట్ చెయ్యకుండా టాపిక్ లోకి వెళ్లిపోదామా...!
*లిస్టులో చెప్పుకోబోయే ఫస్ట్ సినిమా వచ్చేసి...
1. దంగల్ మూవీ
![]() |
| Dangal movie review by NUZVID CINEMA TALKIES |
2. ఫైండింగ్ నీమో
![]() |
| Finding Nemo review by NUZVID CINEMA TALKIES |
3. IAM LEGEND movie
![]() |
| IAM LEGEND movie review by NUZVID CINEMA TALKIES |
4. Babe Pig in the City
![]() |
| BABE PIG IN THE CITY movie review by NUZVID CINEMA TALKIES |
5. Pursuit of happiness
![]() |
| Pursuit of happyness movie review by NUZVID CINEMA TALKIES |
6. సన్నాఫ్ సత్యమూర్తి
![]() |
| Son of Satyamurthy movie review by NUZVID CINEMA TALKIES |
7. Chak De India
షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత బాగుంటుంది ఈ సినిమా. దీని తర్వాత ఎన్నో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ వచ్చాయి. వాటన్నిటినీ ఈ సినిమాతో పోల్చటం ఈ సినిమా యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అవమానానికి గురైన కబీర్ ఖాన్ అనే హాకీ ప్లేయర్ పాత్రలో షారుక్ ఖాన్ జీవించేశాడని చెప్పాలి. తనకు జరిగిన అవమానాన్ని సన్మానం గా మార్చుకోవడం కోసం అతను ఎంచుకున్న మార్గం చాలా ఉన్నతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాను తప్పకుండా చూడాలి. ఇది వాళ్ళని బాగా మోటివేట్ చేస్తుంది కూడా.
మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ వీడియో చూడండి.👇👇
ఇవి ఫ్రెండ్స్....
మిమ్మల్ని బాగా మోటివేట్ చేసే కొన్ని అద్భుతమైన చిత్రాలు...
నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ని వేరే వాళ్ళకి షేర్ చేయండి.
మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే నా మరో యూట్యూబ్ ఛానల్ NUZVID TECH EXP నుంచి SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.