ఈ టిప్స్ పాటిస్తే మీ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ డబుల్ అవుతుంది, Mobile phone battery saving tips, how to increase mobile battery life

Hi Friends....
Welcome to My Blog....
 ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను మొబైల్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ గురించి చెప్తాను. వాటిని పాటిస్తే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది.
How to increase battery life
Battery saving tips and tricks
ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే ఎటువంటి టిప్స్ పాటించాలి అనేది ఈ ఆర్టికల్ లో నాకు తెలిసినవన్నీ చెబుతాను. మీకు ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ ఇంకా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్
NUZVID TECH EXP ని subscribe చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Now Coming to the Point....
Battery saving tricks and tips Telugu
Battery saving tips by NUZVID TECH EXP
1. మొబైల్ ఫోన్ కొనేటప్పుడు కెమెరా క్లారిటీ, ర్యామ్ మేనేజ్మెంట్, ప్రాసెసర్, డిజైన్ ఇవి మాత్రమే కాకుండా బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది అన్నది కూడా తెలుసుకుని కొనండి. ప్రతి మొబైల్ తాలూకు ప్రాసెసర్ లో నానో మీటర్ టెక్నాలజీ ఉంటుంది. ఈ నానో మీటర్ టెక్నాలజీ అనేది ఎంత తక్కువ ఉంటే బ్యాటరీ అంత సేవ్ అవుతుంది. అంతేకాకుండా బ్యాటరీ కెపాసిటీ మినిమం 4000mah తగ్గకుండా చూసుకోండి. 5000mah or 6000mah కెపాసిటీ అయితే మరీ మంచిది.
2. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంటే బ్యాటరీ కూడా ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60కి మించి పెట్టుకోకండి.
3. వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మొబైల్ తో పాటు బ్యాటరీ కూడా బాగా హీట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఫోన్ యొక్క పౌచ్ తీసేసి ఓపెన్ ఎయిర్ లో లేదా ఫ్యాన్ కింద ఉంచండి. నన్నడిగితే వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు పౌచ్ తీసేసి రికార్డ్ చేస్తే ఫోన్ తొందరగా వేడెక్కదు.
4. కీబోర్డ్ టైప్ చేసేటప్పుడు కుయ్ కుయ్ అనే శబ్దం వచ్చేలా పెట్టుకోకండి. ఒక్కోసారి ఆ సౌండ్ పక్కవాళ్ళకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. దీనివల్ల ఫోన్ బ్యాటరీ కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ ని ఆఫ్ చేసి పెట్టుకోండి.
Mobile phone battery saving tips
Battery saving tips by NUZVID TECH EXP
5. ఒకసారి ఫోన్ బ్యాటరీ చార్జింగ్ పెట్టి తీసేస్తే దానిని ఒక సైకిల్ అంటాం. అలాగ 400 నుంచి 500 సైకిల్స్ కంప్లీట్ చేస్తే ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 20% తగ్గిపోతుంది. కాబట్టి బ్యాటరీని మాటిమాటికి చార్జింగ్ పెట్టి తీయకండి. కొంతమంది 10% చార్జింగ్ తగ్గగానే వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తారు. అలా మాటిమాటికీ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 15% లేదా 20% ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టి 90% వచ్చాక తీసేయండి. కంప్లీట్ గా ఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యాక చార్జింగ్ పెట్టకండి. అలాగని మరీ 100% వచ్చే వరకు కూడా చార్జింగ్ పెట్టకండి. అలా చేయడం వల్ల కూడా ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.
6. మీ ఫోన్ ని మరీ వేడిగా ఉన్న ప్రదేశంలో గాని లేదా బాగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో గాని పెట్టకండి. ఎందుకంటే ఫోన్ బ్యాటరీ ఎక్కువ హీట్ ని, ఎక్కువ చల్లదనాన్ని కూడా తట్టుకోలేదు. ఈ రెండు సిచువేషన్స్ లో మీ ఫోన్ ఉందంటే బ్యాటరీ లైఫ్ చాలా తొందరగా చచ్చిపోతుంది.
నార్మల్ టెంపరేచర్ లో ఉంటే ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం ఉంటుంది.
7. మొబైల్ కొన్న మూడు సంవత్సరాల తర్వాత బ్యాటరీ లైఫ్ 60 శాతానికి పడిపోతుంది. ఒకవేళ చార్జింగ్ మరీ తక్కువ ఉన్నట్లయితే బ్యాటరీ మార్చేయడమే బెటర్.
8. కొంతమంది ఫోన్స్ ని వాడకుండా ఎక్కువ రోజులపాటు స్విచాఫ్ చేసి పక్కన పడేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఏదైనా అప్పుడప్పుడు వాడుతుంటేనే బాగుంటుంది కదా...! Empty mind devil's workshop అనేది అందుకే...!
మరిన్ని డీటెయిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి👇👇👇

9. మొబైల్ చార్జింగ్ కి చార్జర్ ఏది పడితే అది వాడకండి. ఏ కంపెనీ చార్జర్ ఆ కంపెనీ ఫోన్ కే వాడండి. ఎందుకంటే పవర్ కెపాసిటీ అన్ని చార్జర్స్ లో ఒకేలా ఉండదు. అంతేకాకుండా ఛీప్ క్వాలిటీ ఉన్న చార్జర్స్ ని వాడకండి. వాటివల్ల మొబైల్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. బీ కేర్ ఫుల్...!
10. ప్రజెంట్ మొబైల్ కంపెనీలు ఉపయోగిస్తున్న స్ట్రాటజీ ఫాస్ట్ ఛార్జింగ్. మీకు తెలుసో లేదో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కూడా మొబైల్ బ్యాటరీ కెపాసిటీ త్వరగా తగ్గిపోతుంది. ఉదాహరణకి మీరు ఏదైనా కూర వండుతున్నప్పుడు అది రుచిగా రావాలంటే సన్నని మంట మీద వండితే ఆ కూర చక్కగా ఉడుకుతుంది. రుచిగా కూడా ఉంటుంది.
బాగా ఎక్కువ మంట పెట్టి పడేస్తే...?
మాడిపోతుంది కదా.....!
ఫోన్ బ్యాటరీ విషయంలో కూడా అంతే....
ఫాస్ట్ ఛార్జింగ్ చాలా నష్టం చేస్తుంది...
11. Heat is the biggest enemy of battery
ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు హీటెక్కడం సహజం. కాబట్టి అలాంటప్పుడు ఫోన్ పౌచ్ తీసేసి చార్జింగ్ పెట్టండి.
12. మీరు కొత్త ఫోన్ కొంటున్నప్పుడు SUPER AMOLED DISPLAY ఉన్న ఫోన్ లను ప్రిఫర్ చెయ్యండి. ఎందుకంటే LCD DISPLAY ఉన్న ఫోన్ల కంటే LED DISPLAY ఉన్న ఫోన్లు తక్కువ చార్జింగ్
 తీసుకుంటాయి.
13. ఫోన్ లో BRIGHT COLOUR WALLPAPERS లేదా BLINKING WALLPAPERS అస్సలు వాడకండి. వీటివల్ల చార్జింగ్ ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి డార్క్ థీమ్ ఉన్న వాల్పేపర్స్ నే వాడండి.
How to save phone battery life information in Telugu
Battery saving tips and tricks by NUZVID TECH EXP
14. ఫోన్లో ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ని ఆన్ చేసి పెట్టుకోండి. మీకు బ్రైట్నెస్ ఎంత కావాలో అంతే పెట్టుకోండి లేదా ఈ సెన్సార్ ని ఆన్ చేసుకోండి.
15. మొబైల్ లో ఆటో రొటేట్ సెన్సార్ ని ఆఫ్ చేసి పెట్టుకోండి. అంతేకాకుండా అక్కర్లేని సెన్సార్లన్నింటిని ఆఫ్ చెయ్యండి. వీలైతే బ్యాటరీ సేవర్ మోడ్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి.
16. బ్యాటరీ సేవింగ్ యాప్స్, రామ్ క్లీనర్, battery booster లాంటి చెత్త యాప్స్ ని install  చెయ్యకండి. వాటివల్ల ఫోన్ బ్యాటరీ కి నష్టమే జరుగుతుంది గాని కొంచెం కూడా మేలు జరగదు.
17. మొబైల్ కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే చెయ్యకండి. వాటిలో ఏమైనా బగ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ బగ్స్ వల్ల కూడా చార్జింగ్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు ఒక వారం వెయిట్ చేసి అప్డేట్ చేసుకోండి. ఈలోపు ఏమైనా బగ్స్ ఉంటే కంపెనీలు ఫిక్స్ చేస్తాయి.
18. మొబైల్ లో యాప్స్ ఎన్ని ఎక్కువ ఉంటే ఛార్జింగ్ అంత ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి అవసరం లేని యాప్స్ ని డిలీట్ చేసేయండి. ఫేస్ బుక్, మెసెంజర్, టిక్ టాక్ లాంటి యాప్స్ కి లైట్ వెర్షన్ వాడుకోండి.
19. మొబైల్ లో ALWAYS ON DISPLAY ఆప్షన్ ని ఆఫ్ చేసి పెట్టుకోండి. SCREEN TIMEOUT తక్కువ సేపు ఉండేలా పెట్టుకోండి.

ఈ టిప్స్ ని పాటించండి. మీకు బాగా ఉపయోగపడతాయి.
థాంక్యూ.

ఫ్రెండ్స్.... మీకు లేటెస్ట్ మూవీ రివ్యూస్, అప్డేట్స్ అన్నీ త్వరగా కావాలి అంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్ NUZVID CINEMA TALKIES ని subscribe చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.