టాలీవుడ్ హీరోల అదిరిపోయే గెటప్పులు, Best style and getups of tollywood heroes

Hi Friends...
Welcome to My Blog...
ఫ్రెండ్స్ మీకు నేను ఈ ఆర్టికల్ లో ప్రెజెంట్ మన టాలీవుడ్ హీరోలు వేసుకున్న బెస్ట్ గెటప్ అండ్ స్టైల్స్ గురించి చెబుతాను. మొత్తం ఐదు హీరోలు వేసుకున్న గెటప్స్ గురించి వివరిస్తాను. అట్లాగే మీరు ఏ హీరో యొక్క స్టైల్ ని బాగా ఇష్టపడతారన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Now coming to the point...
Pawan Kalyan best style and getup
PAWAN KALYAN STYLE REVIEW BY NUZVID EXPRESS

1.  "Pawan Kalyan" from PANJA movie
పవన్ కళ్యాణ్  గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా... ఎందుకంటే టాలీవుడ్ లో ఈయన ట్రై చేసినన్ని స్టైల్స్ బహుశా ఏ హీరో ప్రయత్నించి ఉండడు... లుక్స్ మరియు గెటప్ విషయంలో ఆయన ఎన్నో సార్లు ట్రెండ్ సెట్ చేశారు కూడా. ఎందుకంటే ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు.... సెట్ చేస్తారు.... ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ లెక్కలోకి తీసుకుని ఆయన సినిమాల్లో బెస్ట్ గెటప్ అంటే నేను "పంజా" సినిమాలోని గెటప్ ని సెలెక్ట్ చేసాను. ఈ సినిమాలో ఆయన బియర్డ్ లుక్ లో కోటు వేసుకుని చాలా స్టైలిష్ గా కనబడతారు. ఆ లుక్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఈ సినిమా హిట్టా ఫ్లాపా అన్నది పక్కన పెడితే ఆయన గెటప్ మాత్రం సూపర్బ్ అని చెప్పాలి.

2. Ram Charan from ORANGE movie
RAM CHARAN style and getup in ORANGE movie
RAM CHARANOCHARAN MOVIE GETUP AND STYLE
నాకు తెలిసి రాంచరణ్ ఇప్పటి వరకు మరియు భవిష్యత్తులో కూడా ఈ సినిమాలో కనిపించినంత క్యూట్ గా కనిపించడనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన తన గెటప్ మరియు హెయిర్ స్టైల్ విషయంలో చాలా శ్రద్ధ కనబరిచారు. చెర్రీ ఈ సినిమాలో నార్మల్ టీషర్ట్ వేసుకున్నా కూడా ఎంతో క్యూట్ గా కనిపిస్తాడు. సినిమా రిజల్ట్ నెగిటివ్ కావచ్చు గానీ రాంచరణ్ స్టైల్ మరియు మ్యూజిక్ ఎక్స్లెంట్ అని చెప్పాలి. నాకు బాగా నచ్చిన హీరో గెటప్స్ లో ఇది కూడా ఒకటి.

3. PRABHAS from MIRCHI Movie
PRABHAS MIRCHI movie
PRABHAS from MIRCHI Movie
ఈ సినిమాలో ప్రభాస్ క్రాఫ్ట్ పక్కకు దువ్వి చాలా స్టైల్ గా కనపడతాడు. ఆరడుగుల హైట్ మరియు ఫార్మల్ గెటప్ లో ఉన్న ప్రభాస్ ని చూస్తుంటే రెండు కళ్ళు చాలవు తెలుసా...! ఫార్మల్ గెటప్ లో కూడా అందంగా కనపడొచ్చని ప్రభాస్ నిరూపిస్తాడు సినిమాలో. మొత్తంగా చూస్తే ఈ సినిమాలో ప్రభాస్ వేసిన టీషర్ట్స్ మరియు బ్యాగ్స్, షూస్ ఎక్స్లెంట్. ఈ సినిమాకి ముందు డార్లింగ్ సినిమాలో లూజు షర్ట్స్, చత్రపతి సినిమాలో కార్గో పాంట్స్ మరియు బిల్లా మూవీ లో సూట్ గెటప్పులు కూడా చాలా బాగుంటాయి. కానీ వాటన్నిటి కంటే మిర్చి సినిమా లోని గెటప్పే చాలా చాలా చాలా బాగుంటుంది.



4. Jr.Ntr from Naannaku Prema tho
Jr.Ntr looks and getups in Naannaku Prema tho movie
Jr.Ntr from Naannaku Prema tho movie
ఈ సినిమాకి ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ అన్నీ మాస్ గెటప్పుల్లోనే కనిపిస్తాడు. కానీ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ఫస్ట్ టైం చాలా క్లాస్ లుక్ లో చూపిస్తాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక చోట సూట్ వేసుకుని చేతిలో పెయింటింగ్ పట్టుకుని స్టైల్ గా నడిచొచ్చే సీన్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. టోటల్ గా గెటప్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ట్రై చేశాడు. సక్సెస్ అయ్యాడు కూడా.

5. MAHESH BABU from Pokiri and Athithi
Mahesh Babu getup in Pokiri movie
Pokiri movie
Athidhi Mahesh Babu
MAHESH BABU from Athithi movie
మహేష్ బాబు కెరీర్లో బెస్ట్ గెటప్ అంటే పోకిరి సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాకు ముందు ఉన్న గెటప్స్ అన్నీ దాదాపుగా క్లాస్ మరియు ఫార్మల్ గెటప్సే‌. పోకిరి సినిమాలో పూర్తి మాస్ లుక్ మరియు గెటప్ తో అదరగొట్టేశాడు. టోటల్ గా ఈ సినిమాలో ఆయన గెటప్స్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవన్నీ ఆడియన్స్ కి తెగ నచ్చేశాయి కూడా. అట్లాగే అతిధి సినిమాలో కూడా మహేష్ బాబు హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది.

ఇవి ఫ్రెండ్స్ అయిదుగురు టాలీవుడ్ హీరోల బెస్ట్ గెటప్స్. నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి మరియు నన్ను ఫాలో అవ్వండి. మీకు లేటెస్ట్ మూవీ రివ్యూస్ అన్నీ జెన్యూన్ గా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ NUZVID CINEMA TALKIES ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Thank You
And
JAIHIND

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.