మీకు తప్పనిసరిగా ఉపయోగపడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాప్స్, వెబ్సైట్స్, most useful government of India websites and apps

Hi Friends...
Welcome to My Blog...
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి చెందిన, మీకు బాగా ఉపయోగపడే యాప్స్ మరియు వెబ్ సైట్స్ గురించి చెబుదామని అనుకుంటున్నాను. అవి మీకు డైలీ లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
Government of India official websites and apps
Government of India apps and websites information
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే దయచేసి వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్లకీ ఏదోలా ఉపయోగపడొచ్చు.
ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్లి పోదామా...!

1. UMANG app
Umang App uses
UMANG APP REVIEW BY NUZVID EXPRESS

2017 నవంబర్ 23న ఈ యాప్ ని స్టార్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యాప్  యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఈ యాప్ 13 భాషల్లో అందుబాటులో ఉంది. రీసెంట్ గా స్టాఫ్ సెలక్షన్ బోర్డుని కూడా ఈ యాప్ కి అటాచ్ చేశారు. SSC కి సంబంధించి కంప్లీట్ జాబ్ నోటిఫికేషన్స్ మరియు రిజల్ట్స్ గురించి ఎక్కడో వెతుక్కోవాల్సిన పనిలేదు. ఈ ఉమంగ్ యాప్ లో సెర్చ్ చేస్తే చాలు. యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

2. E Pathashala App
E Pathashala App information
E Pathashala App review by NUZVID EXPRESS
ఈ యాప్ NCERT కి సంబంధించి అన్ని తరగతుల పాఠాలు, సిలబస్ మరియు స్టడీ మెటీరియల్ అందిస్తుంది. టీచర్స్ మరియు పేరెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ గైడ్ లైన్స్ ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ యొక్క వర్కింగ్ సూపర్ అని చెప్పొచ్చు. ఎవరైతే NCERT సిలబస్ లో చదువుతూ ఉంటారో వాళ్లకి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది.
యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

3. My Gov App
My Gov App information in Telugu
My Gov App review by NUZVID EXPRESS
2014 ఏప్రిల్ 26న ఈ యాప్ ని ఒక వెబ్ సైట్ రూపంలో స్టార్ట్ చేశారు. తర్వాత మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. దేశ అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్తులు చేయడమే ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం.  అంతే కాకుండా ప్రభుత్వం మీద తమ అభిప్రాయాల్ని ప్రజలు నిర్భయంగా ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ యాప్ లో ఇంకా చాలా చాలా ఫీచర్లు తీసుకొస్తున్నారు. యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

4. Arogya Setu app
Arogya Sethu app review by NUZVID TECH EXP
Arogya Setu app review in Telugu
ఈ యాప్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. భయంకరమైన కరోనా మహమ్మారి వల్ల ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఆరోగ్యసేతు యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ని ఉపయోగించి మనకు దగ్గరలో కరోనా పేషెంట్ ఎవరైనా ఉన్నారా అన్నది తెలుసుకోవచ్చు. కరోనా కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఈ యాప్ లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి.
యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

5. GST RATE FINDER app
GST RATE FINDER APP
GST RATE FINDER APP REVIEW IN TELUGU
మన గవర్నమెంట్ ఒక్కో వస్తువు మీద ఒక్కో రకంగా జీఎస్టీ వేస్తుంది. మరి ప్రతీ వస్తువు మీద జీఎస్టీ ఉందో తెలుసుకోవాలంటే కొంచం కష్టమే. అలాంటి వారికి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏఏ వస్తువు మీద ఎంత జీఎస్టీ పడుతుందనేది ఒక అవగాహన కల్పిస్తుంది. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

6. BHIM app
BHIM APP REVIEW BY NUZVID TECH EXP
BHIM APP REVIEW IN TELUGU
ఫోన్ పే, గూగుల్ పే లాగా ఇది కూడా ఒక పేమెంట్ సర్వీస్ యాప్. ఇండియాలో ఉన్న అన్ని పేమెంట్ యాప్స్ కంటే చాలా ఈజీగా ఉంటుంది. సూపర్ గా వర్క్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అవటం వల్ల ఇందులో ఏ విధమైనటువంటి క్యాష్ బ్యాక్ లు ఉండవ్. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కానీ ఈ యాప్ ని యూజ్ చేయడం చాలా ఈజీ. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

*ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి సంబంధించి ఆరు యాప్స్ గురించి తెలుసుకున్నాం కదా...! ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి సంబంధించి రెండు ముఖ్యమైన వెబ్ సైట్స్ గురించి కూడా తెలుసుకుందాం.

1. RTI ONLINE
Right to information Website
RTI ONLINE Website

ఈ వెబ్సైట్ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ ని ఆన్లైన్లో నే అడగొచ్చు. ప్రతీసారి మనం లెటర్ రాసి వాళ్ళని బతిమాలుకొని ఇన్ఫర్మేషన్ అడగటం వాళ్ళు ఇవ్వకపోవడం జరుగుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మనం డైరెక్టుగా డిపార్ట్మెంట్ వైజ్ గా ఆన్లైన్ లోనే ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. ఇందులో మనకి కావలిసిన ఇన్ఫర్మేషన్ చాలా త్వరగా చేరుతుంది. చాలా జెన్యూన్ వెబ్సైట్ కూడా.
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

2. E Aadhaar
How to download Aadhaar card
E Aadhaar website
ఈ వెబ్సైట్ ద్వారా మనం మన ఆధార్ కార్డ్ ని చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు.

ఇవి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి సంబంధించి ఆరు యాప్స్ మరియు 2 ఇంపార్టెంట్ వెబ్సైట్స్. ఈ ఆర్టికల్ లో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. వీలైతే వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు ఇంకా టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ NUZVID TECH EXP YouTube Channel ni Subscribe chesukondi. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.