Breaking

25, జూన్ 2020, గురువారం

భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా, future smartphones

Hi Friends...
Welcome to My Blog....
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయో వివరించి చెబుతాను.
Smartphone technology in future
Smartphones in future
పదేళ్ల క్రితం వరకు ఫోన్ అంటే జస్ట్ కీప్యాడ్ ఫోన్ ఉండటమే గ్రేట్.
Nokia old model Phones
Nokia 1100

Samsung keepad phone
Samsung Guru


అప్పట్లో నోకియా 1100, శాంసంగ్ గురు మొబైల్ ఫోన్ల డామినేషన్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడంతా మారిపోయింది. కొత్త కొత్త ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఆ తర్వాత VGA CAMERA, కలర్ డిస్ప్లే, 112mb Ram ఇలా చాలా ఫీచర్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు మనం
10 సంవత్సరాల తర్వాత మొబైల్ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇది నేను ఊహించి చెబుతున్న డీటెయిల్స్. కొంచెం అటు ఇటు కావచ్చు. కానీ 90 శాతం జరిగి తీరుతాయి.

1. ప్రస్తుతం అందరూ టచ్ మరియు ఫుల్ డిస్ప్లే ఉన్న ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు కదా. భవిష్యత్తులో ఈ మోడల్ ఫోన్లు బాగా ఓల్డ్ అయిపోతాయి. వీటి స్థానంలో రోలింగ్ టెక్నాలజీ ఉండే ఫోన్లు వస్తాయి. వీటిని ఒక పేపర్ లాగా రౌండ్ గా ఉండలా చుట్టేయవచ్చు.
Rolling smartphones
Rolling Technology phones in future

2. అండర్ డిస్ప్లే కెమెరా స్థానంలో... డిస్ప్లే మొత్తం కెమెరా లా ఉండే ఫోన్లు వస్తాయి.
ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఫ్రంట్ స్క్రీన్ మొత్తం ఒక మిర్రర్ లాగా అయిపోతుంది. డిస్ప్లే మొత్తం కెమెరాలా మారిపోతుంది. అప్పుడు ఫ్రంట్ ఫోటో తీసుకున్నప్పుడు ఎక్కువ వెల్తురు లోపలికి రావడం వల్ల పిక్చర్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది కదా ఈ టెక్నాలజీ.
in display ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా ఇందులోనే సెట్ చేస్తారు. దీని వల్ల ఉపయోగం ఏంటంటే డిస్ప్లే మీద ఎక్కడ వేలు పెట్టినా ఫోన్ అన్ లాక్ అవుతుంది.

3. ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్లలో త్రిబుల్ కెమెరా, క్వాడ్ కెమెరా, పెంటా కెమెరా ఇలా చాలా రకాలైనటువంటి కెమెరాలు ఉన్నాయి.
Mobile phone Camera
Mobile Camera
భవిష్యత్తులో ఉండే ఫోన్లలో కేవలం ఒక కెమెరా మాత్రమే ఉంటుంది. అన్ని సెన్సార్లు అందులోనే ఇమిడి ఉంటాయి.
ఈ సెన్సార్లన్నీ AI TECHNOLOGY తో నడుస్తాయి.
AI అంటే ARTIFICIAL INTELLIGENCE TECHNOLOGY.

4. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లలో సిమ్ కార్డులు ఉండవు. అన్ని ఈ సిమ్స్ మాత్రమే ఉంటాయి.
SIM cards in mobile phone
Mobile Sim Cards

5. ఇక ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికొస్తే ఫ్యూచర్లో అది 32gb వరకు ఉండొచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే అంతా క్లౌడ్ స్టోరేజీ సేవలను వినియోగించుకుంటారు. భవిష్యత్తులో క్లౌడ్ స్టోరేజ్ సేవల యొక్క రేట్లు తగ్గే అవకాశం ఉండొచ్చు. అందుకే ఈ సేవలను విరివిగా ఉపయోగించుకుంటారు.

6. మనం ఏదైనా యాప్ ని install చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఫోన్ లో అయితే యాప్ స్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకుంటాము.
Android apps review
Mobile apps
ఫ్యూచర్ లో ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్లే స్టోర్ లోనే మనం డైరెక్ట్ గా ఆ యాప్ ని install చేసుకోకుండా వాడుకోవచ్చు.
దీని వల్ల మొబైల్ మరియు కంప్యూటర్ మీద భారం తగ్గుతుంది. ఫోన్ బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది.

7. ప్రాసెసర్స్ లో ఎక్కువగా NPU PROCESSERS ని ఎక్కువగా వాడతారు. NPU అంటే NEURAL PROCESSING UNIT. ఇది AI TECHNOLOGY తో పనిచేస్తుంది. ఫ్యూచర్ ఫోన్లన్నీ AI TECHNOLOGY తోనే పని చేస్తాయి కాబట్టి దానికి అవసరమైన సెన్సార్ల సంఖ్య కూడా పెరుగుతుంది.

8. ఫ్యూచర్ లో మొబైల్ ఫోన్లలో చార్జింగ్ పోర్ట్ ఉండదు. అన్నీ వైర్లెస్ చార్జింగ్ తోనే పనిచేస్తాయి.
Mobile charging
Mobile Charging

9. ఫోన్ల విషయంలో ఫ్యూచర్ లో వచ్చే ఇంకొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఫీచర్ ఫోన్లనేవి ఉండవు. అన్నీ స్మార్ట్ ఫోన్సే ఉంటాయి.
Apple iPhone images
Apple iPhone

10. ఫ్యూచర్ ఫోన్లలో ఉండే ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటంటే DTH SERVICES తగ్గిపోతాయి. OTT PLATFORMS ఎక్కువవుతాయి.
OTT PLATFORMS INFORMATION
Netflix
జనాలు వీటికి బాగా అడిక్ట్ అవుతారు. OTT PLATFORMS పెరగటం వల్ల కొత్త కొత్త సినిమాలన్నీ వీటిలోనే రిలీజ్ అవుతాయి.

11. మొబైల్ ఫోన్స్ బాగా డెవలప్ అవ్వటం వల్ల ఆన్లైన్ షాపింగ్ కూడా పెరుగుతుంది.
Online shopping information
Online shopping

ప్రతి వస్తువుని ఆన్లైన్లోనే కొనడానికి బాగా అలవాటుపడతారు. డ్రోన్ ద్వారా డెలివరీ చేసే సర్వీసులు ఎక్కువవుతాయి.

*ఫ్యూచర్ లో మొబైల్ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయన్నది నాకు తెలిసినదంత మీతో చెప్పాను. ఈ ఆర్టికల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి.

థాంక్యూ
అండ్
జైహింద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి