Breaking

25, జూన్ 2020, గురువారం

తెలుగు హీరోలు మిస్ చేసుకున్న బ్లాక్బస్టర్ సినిమాలు, Telugu heroes who are the blockbuster movies

Hi Friends...
Welcome to My Blog...
ఫ్రెండ్స్ మీకు నేను ఈ ఆర్టికల్ లో మన తెలుగు హీరోలు మిస్ చేసుకున్న సూపర్ డూపర్ హిట్ మూవీస్ లిస్ట్ గురించి చెప్తాను. ఒకవేళ ఏవైనా మిస్ అయి వుంటే మాత్రం కింద కామెంట్స్ రూపంలో సజెస్ట్ చేయండి. వాటిని నా నెక్స్ట్ ఆర్టికల్ లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే మీకు లేటెస్ట్ మూవీ రివ్యూస్ అన్నీ జెన్యూన్ గా కావాలంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్ NUZVID CINEMA TALKIES ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్లిపోదామా...

1. హీరో రాజశేఖర్
Rajashekhar rejected movies list
Hero Rajashekhar

రాజశేఖర్ మిస్ చేసుకున్న సినిమాల లిస్టు తెలిస్తే మాత్రం ఆయన మీద జాలి కలగక మానదు. కాల్షీట్స్ ఖాళీ లేకపోవడంవల్ల గానీ మరేదైనా కారణం వల్ల గానీ ఆయన ఈ బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ మిస్ చేసుకున్నారన్నది 100% నిజం.
*ఆయన మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాల్లో మొదటగా చెప్పేది "చంటి" సినిమా. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పాలి. కానీ ఈ సినిమా మొదట రాజశేఖర్ దగ్గరికే వచ్చింది. కొన్ని కారణాల రీత్యా ఈ సినిమా రాజశేఖర్ లిస్టు లోంచి చేజారిపోయింది. ఈ విషయాన్ని రాజశేఖర్ గారు స్వయంగా "అలీతో సరదాగా" అనే ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయంలో మీకేమైనా అనుమానం ఉంటే ఆ ప్రోగ్రాం ఒకసారి చూడండి.
*శంకర్ మరియు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన జెంటిల్మెన్ మూవీ కూడా మొదట రాజశేఖర్ గారి దగ్గరికే వచ్చింది. ఆ సమయంలో ఆయన అల్లరి ప్రియుడు సినిమా షూటింగ్లో ఉండటంతో ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా రాజశేఖర్ గారి దురదృష్టం అనే చెప్పాలి.
*రాజశేఖర్ వదులుకున్న 3 బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసి చిరంజీవి హీరోగా నటించిన "ఠాగూర్"
ఈ సినిమా కూడా ఫస్ట్ రాజశేఖర్ గారి దగ్గరికే వచ్చింది. డేట్స్ కుదిరి ఆయన చేద్దామని ఇంట్రెస్ట్ చూపించే లోపు ఈ సినిమా చిరంజీవి గారి దగ్గరికి వెళ్లడం జరిగింది. బహుశా ఈ సినిమా వల్లనే రాజశేఖర్ మరియు చిరంజీవి  మధ్య విభేదాలు తలెత్తాయని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.

2. జూనియర్ ఎన్టీఆర్
Jr.ntr cinema reviews
Jr Ntr
ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి సింహాద్రి సినిమాని మొదట బాలయ్య బాబుతో చేద్దామనుకున్నారు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. చిరంజీవి సినిమా కలెక్షన్లతో పోటీపడేంత స్థాయి సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చింది. ఇక హీరో నితిన్ నటించిన దిల్, రామ్ చరణ్ నటించిన ఎవడు, అల్లు అర్జున్ ఆర్య సినిమాలు మొదట ఎన్టీఆర్ దగ్గరికే వచ్చాయి. ఎవడు సినిమా అయితే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో చేద్దాం అనుకున్నారు కానీ కుదర్లేదు. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అదే "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా"

3. పవన్ కళ్యాణ్ కెరీర్లో మొట్ట మొదటి సోలో హిట్ అయిన తొలిప్రేమ సినిమా ని మొదట హీరో సుమంత్ తో చేద్దామనుకున్నారు.
Hero Sumanth movie reviews
Hero Sumanth
అయితే సుమంత్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో అది కాస్తా పవన్ కళ్యాణ్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.

4. హీరో పవన్ కళ్యాణ్
Pawan Kalyan rejected cinemas list
Power Star Pawan Kalyan
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్టు కూడా చాలానే ఉంది. పూరి జగన్నాథ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయిపోకిరి మరియు ఇడియట్ సినిమాలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ తోనే చేద్దాం అనుకున్నారు. డేట్స్ కుదరక వేరే హీరోలతో చేయాల్సి వచ్చింది.
Pawan Kalyan rejected movies list
Power Star Pawan Kalyan
అయితే....!
ఈ సినిమాలు మిస్ అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఇమేజేం పడిపోలేదు. మిస్ చేసుకున్న సినిమాలకు మించి బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టారాయన. త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అతడు, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్ సినిమాలు కూడా పవన్ కళ్యాణే చేయాల్సింది.

5. అల్లు అర్జున్
Allu Arjun missing movies list
STYLE STAR ALLU ARJUN
రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన టువంటి భద్ర సినిమా మొదట అల్లుఅర్జునే చేయాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా "అర్జున్ రెడ్డి" సినిమాని మొదట అల్లు అర్జున్ తోనే చేద్దామనుకున్నారు. కానీ ఆ సినిమాలోని బోల్డ్ నెస్ నచ్చక ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా శర్వానంద్ దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా రిజెక్ట్ చేయడంతో చివరికి విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది. విజయ్ కెరీర్ ని ఈ సినిమా ఒక ఊపు ఊపింది. విజయ్ దేవరకొండ సినిమా అంటేనే అర్జున్ రెడ్డి అనేంత రేంజిలో ఆ సినిమా హిట్ అయింది.

6.ఇక వరుణ్ సందేశ్ బ్లాక్ బస్టర్ హిట్ కొత్త బంగారులోకం సినిమాని మొదట నాగచైతన్యతో తీద్దాం అనుకున్నారు.
7. శతమానం భవతి సినిమాని మొదట హీరో రాజ్ తరుణ్ తో చేద్దాం అనుకున్నారు. కానీ ఆయనతో వచ్చిన విభేదాల వల్ల దిల్రాజు ఈ సినిమాని శర్వానంద్ తో తీయాల్సి వచ్చింది. శర్వానంద్ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.
8. ఇక బాహుబలి సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాని బాలీవుడ్ హీరోలతో తీద్దాం అనుకున్నారు. కానీ కుదర్లేదు. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది ఈ సినిమా.
9. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకుంది. అదే "పోకిరి" సినిమా.

ఇవి మన హీరోలు మరియు హీరోయిన్లు మిస్ చేసుకున్న కొన్ని బ్లాక్బస్టర్ హిట్ సినిమాలు.
నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ను అందరికీ షేర్ చేయండి.

థాంక్యూ
అండ్
జైహింద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి