Breaking

27, జూన్ 2020, శనివారం

Top 5 photo editing apps, best photo editing apps in Google Play store

Hi Friends....
Welcome to My Blog...
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ గురించి చెబుతాను. అట్లాగే మీకు టెక్నాలజీ రిలేటెెెెడ్ వీడియోస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ NUZVID TECH EXP ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Photo editing apps review Telugu
Top 5 photo editing apps
జనరల్ గా ఫోటో ఎడిటింగ్ యాప్స్ అంటే ప్లే స్టోర్ లో చాలా ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ అంటే Pixellab, PicsArt, Snapseed. ఈ మూడు యాప్స్ కాకుండా ఇంకా 5 బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ గురించి చెబుతాను. ఈ 5 యాప్స్ వర్కింగ్ కూడా పైన చెప్పిన వాటిలాగానే చాలా బాగుంటుంది. ఈ ఫోటో ఎడిటింగ్ యాప్స్ లో మీకు ఏది నచ్చిందన్నది కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి.  అట్లాగే మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్
ఇక లేట్ చేయకుండాా టాపిక్ లోకి వెళ్లిపోదామా...

1. After Light
Best photo editing Apps in Daily Life
After Light App review by NUZVID TECH EXP
ఈ యాప్ సైజు 37mb మాత్రమే. ఇది ఒక యూనివర్సల్ ఫోటో ఎడిటింగ్ యాప్. ఎవరైతే నేచర్ ఫొటోస్ ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తారో వాళ్లకి ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో నేచర్ ఫొటోస్ మనం చాలా బ్యూటిఫుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. ఫొటోస్ లో లైటింగ్ తగ్గించాలన్నా మానిబ్యులేట్ చేయాలన్నా టోటల్గా నేచర్ ఫొటోస్  చాలా చాలా చాలా బ్యూటిఫుల్ గా కనపడాలంటే ఈ యాప్ ని మించింది లేదు.  దీనిలో రకాలైనటువంటి అడ్జస్ట్మెంట్ టూల్స్ కూడా ఉన్నాయండి. అంతే కాకుండా కొత్త ఫొటోస్ కి ఓల్డ్ ఫొటోస్ లాగా కూడా మనం చాలా అందంగా చూపించొచ్చు. టోటల్గా నేచర్ లవర్స్ కి యాప్ సూపర్బ్ అని చెప్పాలి. యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


2. Toolwiz photos- photo editor

Toolwiz Photo editing App review telugu
Toolwiz Photo editing App review by NUZVID TECH EXP
ఈ యాప్ సైజు 85mb మాత్రమే. ఇది ఒక కంప్లీటెడ్ ప్రొఫెషనల్ ఫోటో ఎడిటింగ్ యాప్. దీంట్లో రకరకాలయినటువంటి మ్యాజిక్ ఫిల్టర్స్, డబుల్ ఎక్స్పోజర్స్, రిఫ్లెక్షన్స్, అర్బన్ ఎఫెక్ట్స్, ఫోటో కాలేజ్, డ్రా, ఫేస్ ట్యూన్, డిస్కవర్, గ్లామర్ గ్రో, ల్యాండ్ స్కేప్, గ్రీన్ ఫీల్, లూమా ఎఫెక్ట్ మొదలైనటువంటి ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ రోజు చెప్పిన అన్ని యాప్స్ లోకెల్లా నాకు ఈ యాప్ బాగా నచ్చింది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి స్టైల్ ఫిల్టర్స్ సూపర్బ్ అని చెప్పవచ్చు. ఈ యాప్ లో బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చెెెెయ్యడం మరియు బ్యాక్ గ్రౌండ్ లో బొకే ఎఫెక్ట్ తీసుకురావడం చాలా ఈజీ. అంతే కాకుండా ఇందులో ఉండేటటువంటి డూడుల్స్ మరియు మిర్రర్ లైట్ ఎక్స్లెంట్ అని చెప్పవచ్చు. యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

3. Comics and cartoon maker
How to make our face by cartoon
Comics and cartoon maker app review Telugu
పేరులోనే కార్టూన్ కనబడుతుంది కదా. మన ఫొటోస్ ని ఒక మంచి కార్టూన్ క్యారెక్టర్ లాగా మార్చుకోవచ్చు. ఈ యాప్ సైజు 14mb మాత్రమే. దీంట్లో నెంబర్ ఆఫ్ కామిక్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. లైన్ డ్రాయింగ్, బ్లాక్ అండ్ వైట్ ఫోటో లేదా మీ ఫోటో ని మాంచి కలర్ ఫుల్ కామిక్ క్యారెక్టర్ గా మార్చుకోవచ్చు. కార్టూన్ క్యారెక్టర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ యాప్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. అంతేకాకుండా మీ DP ని కార్టూన్ క్యారెక్టర్ గా కూడా మార్చుకోవచ్చు. మీరు కూడా ఈ యాప్ ని ఒకసారి ట్రై చెయ్యండి. చాలా బాగుంటుంది. యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

4. Photo editor Pro
Top photo editing apps
Photo Editor Pro App review
దీని పేరు చాలా సింపుల్ గా ఉంది కదండీ. సైజు కూడా సింపుల్ గా 12mb మాత్రమే. కానీ దీని వర్కింగ్ మాత్రం ఖతర్నాక్ గా ఉంటుంది. లైట్ వెయిట్ యాప్. ఇది inshort company కి చెందిన యాప్. వర్కింగ్ సూపర్బ్. వందల కొద్దీ ఫిల్టర్లు ఉండటం ఈ యొక్క ప్రత్యేకత. దీంట్లో డబుల్ ఎక్స్ పోజింగ్ చేయొచ్చు బ్యాగ్రౌండ్ ని చాలా చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. లేదా వేరే బ్యాక్గ్రౌండ్ రిప్లేస్ చెయ్యొచ్చు. కొలాజ్ మేకర్ కూడా ఉంది దీంట్లో. అంతేకకుండా ఈ యాప్ లో BODY EDITING కూడా చేయొచ్చు. అంటే లావుగా ఉన్న వాళ్ళని సన్నగా, సన్నగా ఉన్న వాళ్ళని లావుగా లేదా తలని పెద్దగా చేసి పెంచడం ఇట్లాంటి ఫన్నీ మూమెంట్స్ కూడా చెయ్యొచ్చు. అంతేకాకుండా ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. టోటల్గా ఇది ఒక ఆల్ ఇన్ వన్ ఫోటో ఎడిటింగ్ యాప్. చాలా సింపుల్ ఇంటర్ఫేస్ మరియు యూజర్ ఫ్రెండ్లీ యాప్.
యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

5. Enlight Pixaloop
Best photo editing app review in Telugu
Enlight Pixaloop App
ఈ యాప్ సైజు 69mb మాత్రమే. మీ ఫోటోలకు మంచి జీవకళ తీసుకొస్తుంది. ఇందులో చాలా రకాలయినటువంటి యానిమేషన్స్ ఉన్నాయి. మనం సొంతంగా కూడా యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా రివర్ లేదా వాటర్ఫాల్ ఉన్నప్పుడు దాన్ని కదులుతున్నట్లుగా చేస్తుంది ఈ యాప్. నచ్చింది కదా ఈ ఫీచర్. ఓవర్ లే ఆప్షన్ ఇందులో చాలా బాగుంటుంది. బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ లో ఇది కూడా ఒకటి. యానిమేషన్ ఎడిటింగ్ కి దీన్ని మించిన యాప్ లేదు. యానిమేషన్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ యాప్ అదుర్స్ అని చెప్పొచ్చు. యాప్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

*బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నానని అనుకుంటున్నాను. నా ప్రజంటేషన్ నచ్చితే ఈ ఆర్టికల్ ని లైక్ చెయ్యండి. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కుదిరితే నన్ను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.

థాంక్యూ
అండ్
జైహింద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి