Hi Friends....
Welcome to My Blog...
ఫ్రెండ్స్ మీకు నేను ఈ ఆర్టికల్ లో వైరస్ కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ గా ఆడిన ఆరు హాలీవుడ్ సినిమాల గురించి చెబుతాను. అట్లాగే మీకు మూవీ రివ్యూస్ కావాలి అనుకుంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్ NUZVID CINEMA TALKIES ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఇక లేట్ చెయ్యకుండా టాపిక్ లోకి వెళ్లిపోదామా....!
Best virus stories in Hollywood movies
వైరస్ కాన్సెప్టుతో హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలోంచి ఆరు బెస్ట్ సినిమాలని సెలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకు వచ్చాను. వీటిని చూసే అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు.
వైరస్ కాన్సెప్ట్ మూవీస్ లో ఆల్ టైం గ్రేట్ మూవీ అంటే "కంటేజియన్" మూవీ. చాలా ఎక్సలెంట్ మూవీ. దీనికి ఈ లిస్టులో పేరు ఇచ్చి ఇంత మంచి క్లాసిక్ సినిమాని అవమానపరచ దలుచుకోలేదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
1. FLU
Korean movie flu review
ఇది ఒక కొరియన్ మూవీ. ఈ సినిమా 2013 లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ పేరు కిమ్ సంగ్ సూ. స్టోరీ లోకి వెళితే హాంకాంగ్ లో కొంతమంది వ్యక్తుల్ని అనఫిషియల్ గా ఒక కంటైనర్ లో పెట్టి కొరియాకి తరలిస్తూ ఉంటారు. ఆ కంటెయినర్లో ఉన్న వాళ్ళలో ఒకడికి ఈ ఫ్లూ వైరస్ ఎటాక్ అవుతుంది. తెల్లారేసరికి కంటైనర్ లోని ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఆ తర్వాత ఆ వైరస్ కొరియా మొత్తం వ్యాప్తి చెందుతుంది. పరిస్థితి చేయి దాటి పోతుంది. ఈ వైరస్ ధాటికి గవర్నమెంట్ కూడా చేతులెత్తేస్తుంది. ఈ సినిమాలో డ్రామా మరియు సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అని చెప్పాలి. వైరస్ల వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారన్నది ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్లు చూపిస్తారు. ఈ సినిమా చూసే అవకాశం వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సూపర్బ్ మూవీ.
2. WORLD WAR Z
WORLD WAR Z movie review by NUZVID CINEMA TALKIES
ఈ సినిమా కూడా 2013లోనే రిలీజ్ అయింది. ఈ సినిమాలో బ్రాడ్ పిట్ హీరోగా నటించాడు. వైరస్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా ఇదేనండీ. ఈ సినిమా డైరెక్టర్ పేరు మార్క్ ఫాస్టర్.
Brad Pitt cinema world War Z review Telugu
కథలోకి వెళితే భయంకరమైనటువంటి ఒక వైరస్ ఎటాక్ చేయడంతో ప్రపంచంలో ఉన్న ప్రజల్లో 90% జాంబీలుగా మారిపోయి ఒకళ్ళనొకళ్ళు చంపుకుని తింటుంటారు. ఆ టైంలో జెర్రీ అనే ఒక యూఎన్ ఎంప్లాయ్(బ్రాడ్ పిట్) ఫ్యామిలీతో సహా సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఈ వైరస్ కి విరుగుడు కనిపెట్టే పనిలో USA గవర్నమెంట్ కి సాయం చేస్తాడు. కంటెంట్ పరంగా చూస్తే ఇది పక్కా యాక్షన్ మూవీ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ ని పరుగులు పెట్టించే రేసీ స్క్రీన్ ప్లే ఈ సినిమా సొంతం. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడుతుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ మరియు జాంబీస్ క్రియేషన్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. బ్రాడ్ ఫిట్ యాక్టింగ్ అల్టిమేట్ అని చెప్పాలి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మొత్తంగా చూస్తే వైరస్ మరియు జాంబీ బేస్డ్ సినిమాల్లో ఇది సెకండ్ బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఫస్ట్ సినిమా కంటేజియన్ అని ఆల్రెడీ ముందే చెప్పేశాను కదా.
3. 28 Days Later
28 days later movie review Telugu
4. 28 Weeks Later
28 weeks later movie review in Telugu
ఈ రెండు సినిమాలకి డైరెక్టర్ ఒక్కరే. అతడే స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీ డైరెక్టర్ డానీ బోయల్. మనుషుల్లో ఉండే కోపం మరియు అగ్రెసివ్ నెస్ తగ్గించడానికి కేంబ్రిడ్జి యూనివర్సిటీ సైంటిస్టులు "రేజ్" అనేటటువంటి ఒక వైరస్ ని కనిపెడతారు. దాన్ని ఒక చింపాంజీ మీద ప్రయోగిస్తారు. కానీ ఆ ప్రయోగం ఫెయిల్ అవుతుంది. తర్వాత ఆ వైరస్ జనాల మీద ఎటాక్ అయ్యి విపరీతమైన కోపం మరియు అగ్రెసివ్ నెస్ తో జాంబీలుగా మారిపోతారు. 28 days later మరియు 28 weeks later రెండు మూవీస్ యొక్క కాన్సెప్టు ఒకటే అయినప్పటికీ ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాయటంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. యాక్షన్ మరియు డ్రామాని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని డైరెక్టర్ డానీ బోయల్ ఈ రెండు సినిమాలని తీశాడు. మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ వీడియోని చూడండి.
5.12 Monkeys
12 monkeys movies review by NUZVID EXPRESS
ఈ సినిమా 1995 లో రిలీజ్ అయింది. బ్రాడ్ పిట్ మరియు బ్రూస్ విల్లీస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. జనాలని చంపే వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవడానికి హీరోలిద్దరూ టైం ట్రావెల్ చేస్తారు. అలా వెనక్కి వెళ్ళి ఆ వైరస్ యొక్క మూలం కనిపెట్టి దానిని అంతం చేయడమే ఈ సినిమా స్టోరీ. వైరస్ మరియు జాంబి బేస్డ్ మూవీస్ లో ఇదొక డిఫరెంట్ జానర్ మూవీ. రెగ్యులర్ గా ఉండే టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లా కాకుండా దర్శకుడు చాలా విభిన్నంగా ప్రజెంట్ చేస్తాడు. ఈ సినిమాకి బ్రాడ్ పిట్ మరియు బ్రూస్ విల్లీస్ యాక్టింగ్ మెయిన్ ప్లస్ పాయింట్. అంతే కాకుండా ఈ సినిమా విజువల్ గా ఒక వండర్ అని చెప్పాలి. ఈ సినిమా చూసే అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకోకండి. సూపర్బ్ మూవీ.
6. BLINDNESS
BLINDNESS movie review Telugu
ఈ సినిమా 2008 లో రిలీజైంది. ఈ సినిమా డైరెక్టర్ ఫెర్నాండో మిర్లెస్. స్టోరీ లోకి వెళితే జపాన్లో ఒక వ్యక్తి హఠాత్తుగా చూపు కోల్పోవడంతో కంటి డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా చూపుని కోల్పోతాడు. కళ్ళముందు అంతా తెల్లగా మారిపోయి చూపు కోల్పోయేలా చేయడం ఈ వైరస్ యొక్క లక్షణం. అలా అలా ఆ వైరస్ జపాన్ అంతటా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ప్రభుత్వం ఈ వైరస్ ఎటాక్ అయినవాళ్లందరినీ ఐసోలేషన్ క్యాంపుల్లో ఉంచుతుంది. అక్కడ కూడా ప్రజలు గ్రూపులు గ్రూపులుగా మారిపోయి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మనిషికి మనిషే శత్రువు అన్న కాన్సెప్ట్ ని ఈ సినిమా ఎక్సలెంట్ గా ప్రెజెంట్ చేస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ మనల్ని బాగా ఆలోచింప చేస్తుంది కూడా. ఈ సినిమాలో మార్క్ రఫెల్లో మరియు జూలియన్ మోర్ యాక్టింగ్ అల్టిమేట్ అని చెప్పాలి. మొత్తంగా చూస్తే మనిషిలోని స్వార్థం ఎంత భయంకరమైనదో ఈ సినిమా చక్కగా చూపిస్తుంది.
ఇవి ఫ్రెండ్స్ జాంబీ మరియు వైరస్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆరు ఎక్సెలెంట్ మూవీస్. నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ని వేరేవాళ్ళకి షేర్ చేయండి.
అంతే కాకుండా మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ NUZVID TECH EXP ని SUBSCRIBE చేసుకోండి.
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి