Breaking

1, ఆగస్టు 2020, శనివారం

Hollywood heroes and heroines real life success ful stories

Hollywood heroes successful stories
Hi Friends...
Welcome to my Blog.....
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను మన హాలీవుడ్ హీరోలు సక్సెస్ అవ్వకముందు ఎలాంటి జీవితం గడిపారన్నది క్లియర్ గా తెలియజేస్తాను. వీళ్ళ జీవితం మీకు మంచి మోటివేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ ని రాస్తున్నాను. ఈ ఆర్టికల్ నచ్చితే వేరేవాళ్ళకి ఫార్వర్డ్ చెయ్యండి. అట్లాగే మీకు లేటెస్ట్ సినిమా రివ్యూస్ కావాలంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్ NUZVID CINEMA TALKIES ని SUBSCRIBE చేసుకోండి.
ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్లిపోదామా...!
1. రాబర్ట్ డౌనీ
Robert Downey real life success story
Robert Downey
ఐరన్ మ్యాన్ అనగానే మనకి గుర్తుకొచ్చే పేరు రాబర్ట్ డౌనీ. అంతే కాకుండా టోనీ స్టార్క్ అనే కొత్త రకమైన గడ్డం స్టైల్ ని మొట్టమొదట మొదలు పెట్టింది రాబర్ట్ డౌనీయే. అయితే ఇతను స్టార్ కాకముందు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. 1996లో డ్రగ్స్ వాడుతున్నందుకు మరియు 57 మాగ్నం గన్ వాడుతున్నందుకుగాను పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత జడ్జి అతనిని డ్రగ్ టెస్ట్ కి హాజరు కావాలని ఆదేశించారు. కానీ రాబర్ట్ డౌనీ ఆ డ్రగ్ టెస్ట్ కి హాజరవ్వలేదు. దాని కారణంగా పోలీసులు అతనిని మళ్ళీ అరెస్ట్ చేసి లాస్ ఏంజిల్స్ కౌంటీ జైల్లో ఆరు నెలలు ఉంచారు. ఆ తర్వాత కోర్టు అతనిని మళ్ళీ డ్రగ్ టెస్ట్ కి హాజరు ఇవ్వమని ఆదేశించినా కూడా అతను హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను అతను మూడు సంవత్సరాల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. ఇలాగ అతని జీవితం మొదట్లో చాలా ఒడిదుడుకులతో సాగింది.
Alley Mcbell movie

ఆ తర్వాత అతను అల్లీ మెక్ బెల్ అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించాడు. తర్వాత అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 2008లో అతను చేసిన ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ అతనికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది. ఇప్పటికీ హాలీవుడ్లో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో ఇతను కూడా ఒకడు. తన జీవితం గురించి డౌనీ ఏమంటాడంటే....
"ఎప్పుడైతే మనం జాబ్ అనే ఒక గుహలోంచి బయటికి వచ్చామో... అరెరే అనవసరంగా జాబ్ వదిలేశామే అన్న ఫీలింగ్ ఉండకూడదు... మన టార్గెట్ రీచ్ అయ్యేవరకు బాగా కష్టపడాల్సిందే"
భలే చెప్పాడు కదా...!
2.జోష్ బ్రాలిన్
Josh Bralin success story
జోష్ బ్రాలిన్ అంటే ఎవరికీ పెద్దగా గుర్తుండకపోవచ్చు గానీ... థానోస్ క్యారెక్టర్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు అతనిని.
Josh brolin as Thanos character
థానోస్ క్యారెక్టర్ ప్రేక్షకుల మీద చాలా ప్రభావం చూపింది. హీరోలతో సమానంగా ఆ క్యారెక్టర్ అతనికి చాలా పేరుని తీసుకువచ్చింది. అవెంజర్స్ సినిమాలో లాగానే ఇతనికి నిజజీవితంలో కూడా చాలామంది శత్రువులు ఉన్నారు. జోష్ బ్రాలిన్ కాలిఫోర్నియాలో పుట్టి పెరిగాడు. చిన్న వయసులోనే Goonies అనే ఒక సినిమాలో నటించి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు.
Goonies movie Josh Bralin
ఆ తర్వాత డ్రగ్స్ కి బానిస అయ్యి ఆ అలవాటు నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నించాడు. తర్వాత ఎలాగోలా ఆ చెడు అలవాటు నుంచి బయటపడ్డాడు. విచిత్రం ఏంటంటే... అతనితో కలిసి డ్రగ్స్ తీసుకున్న తన ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. ఇతనొక్కడే బతికి బయటపడ్డాడు. అదృష్టం అంటే ఇతనిదే కదా.
3. మార్క్ రఫెల్లో
Mark ruffalo as Hulk character
హాలీవుడ్ సినిమాల్లో ఇతని క్యారెక్టర్ తెలియనివాళ్లు ఉండరు. ఎందుకంటే అతను చేసినటువంటి హల్క్ క్యారెక్టర్ అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుని తీసుకొచ్చింది.
Hulk images
ముఖ్యంగా అవెంజర్స్ సినిమాల్లో అతను చేసే సాహసాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. సినిమాల్లో ఎన్నో విన్యాసాలు చేసే మార్క్ రఫెల్లో నిజ జీవితంలో మాత్రం చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. 2002లో ఇతని బ్రెయిన్ లో ట్యూమర్ బయటపడింది. దాని కారణంగా తను విపరీతమైన నొప్పితో బాధపడేవాడు. ఒకానొక సందర్భంలో ఈ ట్యూమర్ వల్ల ఆయన ఫేసులో ఎడమ భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది కూడా. ట్యూమర్ బాధపెడుతున్నా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు.
అయితే.... డిసెంబర్ ఒకటి 2008న అతని బ్రదర్ ని ఎవరో షూట్ చేసి చంపేశారు. అప్పుడా ఇంట్లో అతని బ్రదర్ తో పాటు ఉంటున్న షాషా మిచెల్ అన్న వ్యక్తి కూడా డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడం వలన చనిపోయాడు. ఆ కేసు ఇప్పటికీ అన్ సాల్వుడ్ గానే ఉంది. ఈ సంఘటన గురించి మార్క్ రఫెల్లో ఏమన్నాడంటే.... "జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ముందు ముందు ఇంతకంటే పెద్ద కష్టాలు మనకి ఎదురుకావచ్చు. వాటిని ఫేస్ చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి కూడా."
ఇతను చెప్పింది నిజమే కదా ఫ్రెండ్స్....!
4. స్కార్లెట్ జొహాన్సన్.
Hollywood heroine Scarlett Johansson
అవెంజర్స్ సినిమాలు చూసినవాళ్లకి ఈమె క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలుసు. అంతే కాకుండా  ఐరన్ మ్యాన్-2, బ్లాక్ విడో, కెప్టెన్ మార్వెల్ సినిమాలు ఈవిడకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
కానీ.....! చిన్నతనంలో తను ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కడుపునిండా తినడానికి తిండి కూడా దొరికేది కాదు. ఒక పూట తిని ఇంకో పూట ఆకలితో నిద్రపోవాల్సి వచ్చేది. 
Scarlett Johansson avengers movie
సినిమాల్లోకి వచ్చాక తనలా ఎవరూ ఆకలితో బాధపడకూడదని తన సంపాదనలో చాలా భాగం దానధర్మాలకు వినియోగించింది. నిజంగా తనది చాలా మంచి మనసు కదా....!
5. టామ్ హార్డీ
Tom hardy
ఇతను హాలీవుడ్ లో విలన్ క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు. అయితే వెనం సినిమా ఇతనికి బాగా పేరు తెచ్చి పెట్టింది.
Venom movie
ఈ సినిమా తరువాత అతను ఎన్నో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించాడు. అయితే చిన్నతనంలో ఇతను సరిగ్గా చదవటంలేదనే కారణంతో స్కూలు నుంచి పంపించేశారు. అంతేకాకుండా టీనేజ్ లో డ్రగ్స్ మరియు ఆల్కహాల్ కి బానిస అయ్యాడు. ఆ తర్వాత ఎంతో కష్టంగా వాటి నుంచి బయటపడ్డాడు. టీనేజ్లో ఉన్నప్పుడు ఒక కొట్లాటలో కొంతమంది అతనిని బాగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి చావు అంచుల వరకు వెళ్ళాడు. అతను బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు కూడా. కానీ అతను తన మనోబలంతో బ్రతికి బయటపడ్డాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అతనిలా దారి తప్పాడు. కానీ ప్రస్తుతం హాలీవుడ్ లో ఉన్న నెంబర్ వన్ యాక్టర్స్ లో ఇతను కూడా ఒకడు.
మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ కింది వీడియో చూడగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి