Breaking

24, ఏప్రిల్ 2021, శనివారం

ఐఫోన్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, Apple iPhone Facts in Telugu, Facts About Apple iPhone

 Hi Friends....

iPhone Facts by NUZVID TECH EXP
ఐఫోన్ ఫ్యాక్ట్స్

ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను ఐఫోన్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుదామని అనుకుంటున్నాను. నా ప్రజెంటేషన్ నచ్చితే ఈ ఆర్టికల్ ని అందరికీ షేర్ చేయండి.

*యాపిల్ ఐఫోన్- ఇప్పటికీ కూడా మధ్యతరగతి ప్రజలకిి ఐఫోన్ కొనడం అన్నది తీరని కలగానే అనిపిస్తుంది.

ఇప్పటికీ ధనవంతులు ఈ ఫోన్ ని ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ధర ఎక్కువ అన్న విషయం పక్కన పెడితే దీనిలోని ఫీచర్స్ అద్భుతం మరియు సెక్యూరిటీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. తక్కువ ఫీచర్స్ ఉన్న ఐఫోన్ ని కొనాలంటే కనీసం ముప్పై వేలయినా పెట్టాల్సిందే. ఈ కాస్ట్ లో ఆండ్రాయిడ్ లో మంచి హై ఫీచర్స్ ఉన్న మొబైలే వచ్చేస్తుంది తెలుసా. అయినా కానీ అందరూ ఐఫోన్ ని ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకుందాం.

యాపిల్ కంపెనీ లోగో

Apple iPhone
ఐఫోన్ కంపెనీ ఫౌండర్స్

Apple iPhone interesting facts by SIVA RAM YADAV DASARI from NUZVID TECH EXP
అయితే యాపిల్ కంపెనీ మొదటి లోగో ఇది కాదు. మొదటి లోగో కింద ఇచ్చిన ఫోటో మాదిరిగా ఉంటుంది.

Apple Logo
ఈ లోగోను డిజైన్ చేసిన వ్యక్తి పేరు రోనాల్డ్ వేన్. 1976లో ఈ పాత లోగో డిజైన్ చేశారు. ఆ తర్వాత సగం కొరికిన యాపిల్ ని కొత్త లోగో గా సెలెక్ట్ చేశాారు. కొత్త లోగో రకరకాల డిజైన్లలో మారి ఫైనల్ గా ఇలా అయ్యింది.
Apple company logo
యాపిల్ కంపెనీ లోగో
ఈ లోగోని రాబ్ జొనాఫ్ 1977లో డిజైన్ చేశారు.
ఇంతకీ యాపిల్ కంపెనీని ఎప్పుడు  స్థాపించారో తెలుసాా...?
స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్, రోనాల్డ్ వేన్ 1973 ఏప్రిల్ 1 న స్థాపించారు.
*ప్రపంచంలో ఐఫోన్ ధరలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. అయితే ఐఫోన్ ఏ దేశంలో ఎక్కువ ధర పలుకుతుంది తెలుసా..?
బ్రెజిల్... అక్కడ ఐఫోన్ ఖరీదు మిగతా దేశాల కంటే చాలా ఎక్కువ.
Apple company founders
ఇక్కడ విచిత్రం ఏంటంటే...??
మూడవ పార్ట్నర్ అయినా రోనాల్డ్ వేన్ తన దగ్గర ఉన్నటువంటి యాపిల్ కంపెనీ 10% షేర్స్ అప్పట్లో (1977) కేవలం 2300 డాలర్లకి అమ్ముకున్నాడు. ప్రస్తుతం ఆ షేర్స్ విలువ ఎంతో తెలుసా...?
సుమారుగా ఆరు లక్షల కోట్లు. ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఇతనే.
స్టీవ్ జాబ్స్ మరియు వోజ్నియాక్ యాపిల్ కంప్యూటర్స్ తయారు చేయడానికి తమ దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోవడంతో ఇద్దరూ తమ దగ్గర ఉన్నటువంటి వ్యాన్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ని రెండు వేల డాలర్లకు అమ్మేసి కంప్యూటర్లను తయారు చేశారు. తాముు   సక్సెస్ అవుతామని ఊహించారు కాబట్టే అంత పెట్టుబడి పెట్టారు.
First Apple computer
మొట్టమొదటి యాపిల్ కంప్యూటర్
మొదటి యాపిల్ ఐఫోన్ ని 2007 జనవరి 9న 499 ఖరీదుకి స్టీవ్ జాబ్స్ ద్వారా మార్కెట్లో ప్రవేశపెట్టబడింది.
First generation Apple iPhone
మొట్టమొదటి యాపిల్ ఐఫోన్
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్టీవ్ జాబ్స్ ఐ ఫోన్ ని మార్కెట్లో ప్రవేశ పెడుతున్నాడన్న విషయం ఆ కంపెనీలోని 99% ఎంప్లాయిస్ కి కూడా తెలియదు తెలుసా...!! అప్పట్లో ఐఫోన్ ఒక సంచలనం. ఇప్పటికీ కూడా ఇతర మొబైల్ కంపెనీలు ఐఫోన్ లోని ఫీచర్స్ని కాపీ కొట్టిిి కొత్త మోడల్స్ ని రిలీజ్ చేస్తుంటాయి. దటీజ్ యాపిల్.
స్టీవ్ జాబ్స్ తన మొదటి ఐఫోన్ కి కోడ్ నేమ్ గా M68 అనే పేరు పెట్టాడు. 1988నాటికి యాపిల్ కంప్యూటర్స్ బాగా అమ్ముడవుతున్న టైంలోనే స్టీవ్ జాబ్స్ కంపెనీ నుంచి బయటికి వచ్చేశాడు. దీనికి గల కారణం ఏమిటంటే యాపిల్ కంపెనీ తమ కంప్యూటర్స్ రేట్లని విపరీతంగా పెంచేసింది. అది స్టీవ్ జాబ్స్ కు ఎంత మాత్రం నచ్చలేదు. అందుకే బయటకి వచ్చేశాడు. అందరికీ అందుబాటు ధరల్లోనే తమ ప్రొడక్ట్స్ ఉండాలనేది స్టీవ్ జాబ్స్ అభిమతం.
స్టీవ్ జాబ్స్

అలా యాపిల్ కంపెనీ నుంచి బయటికి వచ్చాక స్టీవ్ జాబ్స్ నెక్సస్ కంప్యూటర్స్ అనే కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అంతేకాకుండా పిక్సర్ యానిమేషన్ స్టూడియోని కూడా స్థాపించాడు.
Next computers by Steve Jobs
నెక్స్ట్ కంప్యూటర్స్


Pixar studio
డిస్నీ యానిమేటెడ్ మూవీస్ ని నిర్మించేది ఈ పిక్సర్ స్టూడియోనే. ఆ తర్వాత మళ్ళీ 1996లో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు.
యాపిల్ ఐఫోన్ లో ఉండే SIRI ని డెవలప్ చేసింది శ్రీ ఇంటర్నేషనల్ అనే కంపెనీ. 2011 లో iPhone 4S మోడల్ లో సిరీ ని ప్రవేశపెట్టారు.
ఐఫోన్ సిరి

*ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2014లో గూగుల్, అమెజాన్ మరియు ఫేస్బుక్ కంపెనీల రెవిన్యూ ఎంతుందో ఒక్క యాపిల్ కంపెనీ రెవిన్యూనే అంత వచ్చింది తెలుసా...!
అదీ యాపిల్ కంపెనీ గొప్పతనం అంటే.
ఆపిల్ కంపెనీ షేర్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు మొదట్లో దాని విలువ కేవలం 22 డాలర్లు మాత్రమే. కానీ ఇప్పుడు దాని విలువ 5 కోట్లు పైమాటే.
సెక్యూరిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకపోవడం..
సాఫ్ట్వేర్ మరియు హార్డ్ వేర్ ఆప్టిమైజేషన్ కరెక్ట్ గా ఉండటం ఆపిల్ కంపెనీ సక్సెస్ కి ముఖ్య కారణమని చెప్పవచ్చు.
అడ్వర్టైజింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల యాపిల్ ప్రొడక్ట్స్ ధరలు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాయి.
యూజర్ ఫ్రెండ్లీ మరియు టాప్ మోస్ట్ సెక్యూరిటీ ఉండటం కూడా ఆపిల్ కంపెనీ సక్సెస్ కి ఒక ప్రధాన కారణం.
ఉదాహరణకు ఆండ్రాయిడ్ ఫోన్లో 6జీబీ ఉందనుకోండి. అదే యాపిల్ ఐఫోన్ లో 2జీబీ ఉంటే సరిపోతుంది.
*యాపిల్ మ్యాక్ బుక్ ప్రో ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడింది తెలుసా.
Apple MacBook Pro saved life
బుల్లెట్ ఇరుక్కున్న యాపిల్ మ్యాక్ బుక్ ప్రో
అదెలాగంటే... ఒక‌సారి ఎయిర్ పోర్టులో ఒక సైకో కిల్లర్ తుపాకి తీసుకుని అందరినీ విచక్షణారహితంగా కాల్చ సాగాడు. అయితే ఒక బుల్లెట్ అక్కడే ఉన్న ఒక స్టూడెంట్ వెనక బ్యాక్ ప్యాక్ లో ఉన్న మ్యాక్ బుక్ ప్రో లో ఇరుక్కు పోయింది. అలా యాపిల్ ప్రొడక్ట్ ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడింది.
*గూగుల్ ప్లేస్టోర్ రావటానికి ముందే ఐఫోన్ లో యాప్ స్టోర్ ఉంది.
*ఐఫోన్ లో "ఐ" అంటే ఏమిటో మీకు తెలుసా...?
ఇంటర్నెట్
ఇన్ స్ట్రక్ట్
ఇండివిడ్యువల్
ఇన్ఫాం
ఇన్ స్పైర్
*గొరిల్లా గ్లాస్ ని మొదట ఆపిల్ ఐఫోన్ లోనే వాడారు తెలుసా...!
నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ని లైక్ చెయ్యండి.
అట్లాగే మీకు లేటెస్ట్ టెక్నాలజీ అప్ డేట్స్ కావాలంటే నా నా టెక్ ఛానల్ NUZVID TECH EXP ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ CLICK చెయ్యండి.
Technology related videos in Telugu
NUZVID TECH EXP



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి