Breaking

26, ఏప్రిల్ 2021, సోమవారం

కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుగులో, interesting facts in Telugu, amazing and surprising facts in Telugu

మిత్రులందరికీ స్వాగతం...

ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి చెబుతాను. ఆ ఫ్యాక్ట్స్ గనుక మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి.

NUZVID EXPRESS

అట్లాగే మీకు లేటెస్ట్ సినిమా రివ్యూస్ అండ్ అప్డేట్స్ కావాలనుకుంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. నా మూవీ యూట్యూబ్ ఛానల్ పేరు NUZVID CINEMA TALKIES. లింక్ కోసం ఇక్కడ CLICK చెయ్యండి.

NUZVID CINEMA TALKIES

1. బిస్కెట్స్

AMAZING FACTS ABOUT BISCUITS
బిస్కెట్ లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం

బిస్కెట్స్ ని మొదట్లో సముద్రంలో చేపల వేట కోసం వెళ్ళే వాళ్ళు, ప్రయాణం చేసే వాళ్ళ కోసం తయారు చేశారు. ఎందుకంటే ఒక్కోసారి నెలల తరబడి సముద్రం మీదే గడపాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ నెలలు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో బిస్కెట్స్ ని చాలా గట్టిగా తయారు చేసేవాళ్ళు. ఎంత గట్టిగా అంటే వాటిని తినాలంటే సుత్తులతో పగలగొట్టుకుని మరీ తినాలి. ఒకవేళ అలా పగలగొట్టకుండా పొరపాటున పంటి కింద పెట్టుకుంటే పన్ను కూడా విరిగిపోయేది తెలుసా...!

2. జీన్స్ ప్యాంట్

Interesting facts about jeans pants
రకరకాలైన జీన్స్ ప్యాంట్లు

జీన్స్ ప్యాంట్ ని మొదట్లో గనుల్లో పనిచేసే కార్మికుల కోసం తయారు చేశారంటే మీరు నమ్ముతారా...?

Amazing facts about jeans pant
జీన్స్ ప్యాంట్
ఎందుకంటే గనుల్లో పనిచేసే కార్మికులు భూగర్భంలో బాగా కిందికి వెళుతుంటారు. కిందికి వెళ్ళే కొద్దీ వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. అలా వేడిని తట్టుకుంటాయనే ఉద్దేశంతో జీన్స్ పాంట్స్ ని తయారు చేశారు. అవి కాస్తా ఇప్పుడు ట్రెండీగా మారిపోయాయి.


3. బైబిలు

Amazing and surprising facts about Bible

ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువగా అమ్ముడుపోయిన బుక్ బైబిల్.

అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే...!!

ప్రపంచంలో ఎక్కువగా చదివిన బుక్  జె.కె.రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ బుక్.

Surprising facts about Harry potter book
హ్యారీ పాటర్ బుక్

భలే విచిత్రంగా ఉంది కదూ...!

4. జర్నల్ ఆఫ్ ఇవల్యూషనరీ సైకాలజీ   అనే బుక్ లో రాసిన దాని ప్రకారం

Interesting facts about lady psychology
సైకాలజీ బుక్
ఆడవాళ్ళు తమకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా గట్టిగా మాట్లాడుతారంట. మీతో అలా ఎవరైనా మాట్లాడారేమో చెక్ చేసుకోండి.


5. కపిల్ దేవ్

KAPIL DEV
వరల్డ్ కప్ ట్రోఫీతో కపిల్
ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ప్రతీ భారతీయుడు గర్వంగా ఫీలయ్యే సందర్భం ఇది. హర్యానా హరికేన్ అని పిలవబడే మన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సాధించిన రికార్డుని ఇంతవరకు ఎవరూ అధిగమించలేదు తెలుసా. బహుశా ముందు ముందు ఆ రికార్డుని ఎవ్వరూ అధిగమించగలరేమో. ఇంతకీ అదేంటంటే టెస్ట్ క్రికెట్ లో 5 వేల పరుగులు మరియు 400 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్ ఈయనే. ముందు తరాల వాళ్ళకి ఈ రికార్డుని అధిగమించడం అసాధ్యమే.
మేరా భారత్ మహాన్ 🇮🇳🇮🇳🇮🇳

6. కలర్స్ ని చూసి భయపడటాన్ని క్రోమో ఫోబియా అంటారు.

7. మనిషి శరీరంలో "ముక్కు" జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది తెలుసా...!

8. స్నానం చేయడం అంటే భయ పడటాన్ని అబల్టో  ఫోబియా అంటారు.

9.ప్రపంచంలో అత్యంత లోతైన ప్రదేశంలో పోస్ట్ బాక్స్ ఉన్నటువంటి దేశం జపాన్. 10 మీటర్ల లోతున నీటిలో ఉన్నటువంటి ఈ పోస్ట్ బాక్స్ గిన్నిస్ బుక్లోకి కూడా ఎక్కింది.

Post box under sea water
నీటిలో ఉన్న పోస్ట్ బాక్స్ (జపాన్)
10. ఆరోగ్యకరంగా ఉన్న ఒక మనిషి శరీరంలోని రక్తం షుమారుగా  20 లక్షల దోమలకి ఆహారంగా సరిపోతుంది.
Mosquito
దోమకాటు
11. ప్రపంచంలో ఎక్కువ మంది మిలియనీర్స్ ఉన్నటువంటి దేశం సింగపూర్. ఇక్కడ ప్రతి పది మందికి ఒక మిలియనీర్ ఉంటాడు తెలుసా.
Beautiful Singapore
సింగపూర్ నగరం
12.  థాయిలాండ్ లో ఉన్నటువంటి బ్యాంకాక్ యూనివర్సిటీ ఒక విచిత్రమైన పని చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఇంతకీ అదేంటంటే వాళ్ళ యూనివర్సిటీ స్టూడెంట్స్ పరీక్షల్లో కాపీ కొట్టడం ఈమధ్య బాగా ఎక్కువైపోయింది. దీనికి నివారణగా ఆ యూనివర్సిటీ వాళ్ళు యాంటీ ఛీటింగ్ హెల్మెట్స్ ని తయారుచేయించి చి స్టూడెంట్స్ తలకి తగిలించి వాళ్ళ చేత ఎగ్జామ్ రాయించారు. ఆ హెల్మెట్స్ ఇలా ఉన్నాయి.
Anti cheating helmets in Bangkok examination
యాంటీ చీటింగ్ హెల్మెట్స్
భలే ఐడియా కదా...!
13. ప్రపంచంలో అతి తక్కువ క్రైమ్ రేట్ ఉన్న దేశం నెదర్లాండ్స్. ఈ దేశంలో క్రైమ్ రేట్ ఎంత తక్కువ అంటే 2013లో ఖైదీలు లేక 8 జైళ్ళని మూసేసారు తెలుసా.
14. అలారంని కనిపట్టక ముందు "నాకర్స్ అప్" అనే ఒక ఉద్యోగం ఉండేది.
Knockers up
నాకర్స్ అప్ ఉద్యోగం
వీళ్ళ పని ఏంటంటే క్లయింట్ ఇచ్చిన టైంకి వెళ్ళి ఒక పొడవాటి కర్రను తీసుకుని వాళ్లు నిద్రలేచే దాకా తలుపుని దబదబా బాదేేయటమే.
వామ్మో ఇదేం ఉద్యోగంరా బాబు...!
15. జపాన్లో ఉండేటటువంటి మొబైల్ ఫోన్లలో 99% వాటర్ ప్రూఫ్ మొబైల్సే తెలుసా...!
Beautiful lady using mobile phone
మొబైల్ ఫోన్
ఎందుకంటే జపనీస్ ప్రజలు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మరియు స్నానం చేస్తున్నప్పుడు కూడా మొబైల్స్ ని వాడుతూనే ఉంటారు. అందుకే జపాన్ లో వాటర్ ప్రూఫ్ మొబైల్స్ ఎక్కువగా అమ్ముడవుతాయి.
నా ప్రజెంటేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
థాంక్యూ
అండ్
జైహింద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి