Breaking

27, ఏప్రిల్ 2021, మంగళవారం

యోగా వల్ల కలిగే ఉపయోగాలు, Vrikshasana Benefits, కొన్ని రకాలైన యోగాసనాలు వాటి ఉపయోగాలు, Uses of Yoga

మిత్రులందరికీ స్వాగతం

Yoga Asan uses and benefits
యోగా ద్వారా కలిగే లాభాలు

ఈ ఆర్టికల్ లో మీకు యోగాకి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. దాంతో పాటు యోగా చేయడం వలన కలిగే  ఉపయోగాలన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తాను.

ముఖ్య గమనిక: యోగా చేసినంత మాత్రాన మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అనుకుంటే అది మీ అపోహే. యోగాతో పాటు సమతుల ఆహారం, రోజుకి ఎనిమిది గంటల నిద్ర మరియు మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగా అన్నది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా యోగాకి మీ శరీరం సహకరించగలిగి ఉండాలి.

కావున ఈ విషయాన్ని గమనించగలరు.

1. యోగా చేయటం వల్ల శరీరంలోని అవయవాలన్నింటికీ బలం చేకూరుతుంది. కండరాలను దృఢంగా ఉంచుతుంది.

2. మానసికంగా దృఢంగా ఉంచుతుంది మరియు పని ఒత్తిడి వల్ల కలిగే అలసట మరియు స్ట్రెస్ ని దూరం చేస్తుంది.

3. ప్రతి రోజు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మెదడుతో పాటు శరీరంలోని అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తాయి.

యోగాసనాలు దాని ఉపయోగాలు
యోగా మరియు దాని ఉపయోగాలు
3. కొన్ని రకాలయినటువంటి దీర్ఘకాలిక రోగాలు యోగా ద్వారా తగ్గించవచ్చు లేదా అదుపులో ఉంచవచ్చు. 

4. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరంలోని అనవసరమైనటువంటి కొవ్వు కరిగి నాజూకుగా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల అధిక బరువు మరియు రక్తపోటు అదుపులో ఉంటుంది. భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతే కాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ గోముఖాసనం వేయడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. షుగర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూనే యోగాసనాలు వేయటం మంచిది.

CLICK HERE TO PURCHASE YOGA MATS

5. వెన్నునొప్పి, కీళ్ళ నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్లకి యోగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు మరియు కీళ్ళ నొప్పులకి శీర్షాసనం మరియు సర్వాంగాసనం బాగా పనిచేస్తాయి.

6. చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి ముఖ్య కారణం నిద్రలేమి. అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం. రోజువారీ సంఘటనల నుంచి ఎదురయ్యే పని ఒత్తిడి, మానసిక సమస్యలు దీనికి కారణం కావచ్చు. నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తుంటే గనుక బాగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు శీర్షాసనం, సర్వాంగాసనం మరియు హలాసనం వేయడం ఉత్తమం. ధ్యానం కూడా నిద్రలేమి సమస్యను నివారిస్తుంది.

**ముఖ్య గమనిక: నిపుణుల సమక్షంలోనే యోగా చేయండి. అంతే కాకుండా యోగా ఎప్పుడూ హడావుడిగా చెయ్యకూడదు. ప్రశాంతంగా నిదానంగా యోగా చేయాలి. ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకొని ఖాళీ కడుపుతో యోగాసనాలు వేయడం శరీరానికి చాలా మంచిది. ఉదయం పూట సూర్యరశ్మి వెలుతురులో యోగా చేస్తే ఇంకా మంచిది. ఉదయం ఎనిమిది గంటల లోపు వచ్చే లేత సూర్య కిరణాలు శరీరం మీద పడుతున్నప్పుడు యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Yoga benefits in Telugu
యోగా వల్ల కలిగే ఉపయోగాలు

7. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల గుండెకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాని వల్ల గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

8. యోగా మనలో పాజిటివ్ థింకింగ్ ని బాగా పెంచుతుంది. పాజిటివ్ థింకింగ్ తో ఎటువంటి అనారోగ్యాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. పాజిటివ్ థింకింగ్ వల్ల ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది కాబట్టి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.

*వృక్షాసనం దాని ఉపయోగాలు**

vrksasana benefits and steps
వృక్షాసనం
*ఒంటిి కాలి మీద చెట్టు ఆకారంలో నుంచుని ఉంటాము కాబట్టి దీనికి వృక్షాసనం అని పేరు వచ్చింది.
*శరీరం మీద కంట్రోల్ రావాలంటే ఈ ఆసనాన్ని మించింది లేదు.
*ఈ ఆసనం వేయడం వల్ల మనలోని ఏకాగ్రత బాగా పెరుగుతుంది.
*ఏకాగ్రత పెరగటం వల్ల విద్యార్థులు చదువులో ఎప్పుడూ ముందుంటారు.
*ఒంటి కాలి మీద నుంచుని రెండు చేతులూ పైకి చాపి సూర్యుని చూస్తూ ఈ ఆసనం వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు రాబట్టవచ్చు.
* ఎప్పుడూ ఒకే కాలు మీద ఈ ఆసనం వేయకుండా అప్పుడప్పుడు కాలు మారుస్తూ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
*రెగ్యులర్గా ఈ ఆసనం వేయడం వల్ల శరీరం నాజూకుగా తయారవుతుంది. సినిమా హీరోయిన్లు వేసే ముఖ్యమైన ఆసనాల్లో ఇది కూడా ఒకటి.
Vrukshasana uses
వృక్షాసనం యొక్క ఉపయోగాలు
*ఈ ఆసనం ప్రతిరోజు వేయటం వల్ల కాళ్ళకి మరియు నడుముకి బలాన్నిస్తుంది.
* శరీరాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఈ ఆసనం తోడ్పాటునందిస్తుంది.
*సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్లు ఈ ఆసనం వేయడం మంచిది.
*నరాలు మరియు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.
*శరీరానికి మనసుకి చక్కటి సమన్వయాన్ని అందిస్తుంది ఈ ఆసనం.
Vrikshasana Benefits
వృక్షాసనం మొదటి నుంచి
*మనసుకి ప్రశాంతతని అందించే అద్భుతమైనటువంటి ఆసనం ఇది. కాబట్టి రెగ్యులర్ గా ఈ ఆసనాన్ని వేయండి.
*చాలా మంది వృక్షాసనాన్ని కళ్ళు మూసుకుని వేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఈ ఆసనాన్ని వేసేటప్పుడు కళ్ళు తెరిచి ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మరియు ఆరోగ్యానికి సంబంధించి మంచి ఫలితాలు రాబట్టవచ్చు.
*మైగ్రేన్ తలనొప్పి మరియు అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఈ ఆసనం వేయకూడదు.
Vrikshasana benefits
వృక్షాసనం
*వృక్షాసనం వేసే విధానం:
నిటారుగా నిలబడి ఒక కాలిని మడిచి రెండవ కాలు తొడ పైభాగానికి పైన చూపించిన చిత్రంలో లాగా మడిచి పెట్టాలి. ఇప్పుడు రెండు చేతులను పైకి నిటారుగా చాపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఎదురుగా ఉన్నటువంటి ఒక వస్తువు మీద మన దృష్టిని నిలిపి ఏకాగ్రతతో ఈ ఆసనం వేయాలి. కొద్దిసేపు కుడి కాలు మీద ఆ తర్వాత కొద్దిసేపు ఎడమ కాలు మీద మార్చుకుంటూ ఈ ఆసనం వేయాలి. మొదట్లో ఒక నిమిషం తో మొదలు పెట్టి తర్వాత పెంచుకుంటూ పోవాలి. ఈ ఆసనం ఎంత ఎక్కువసేపు వేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి.
నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఆర్టికల్ ని అందరికీ షేర్ చేయండి.

అట్లాగే మీకు హెల్త్ మరియు కిచెన్ కు సంబంధించిన టిప్స్ కావాలంటే NUZVID HEALTH AND KITCHEN YOUTUBE CHANNEL ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ CLICK చెయ్యండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి