Breaking

8, మే 2021, శనివారం

కంటి కింద నల్లని చారలు మరియు వాపు తగ్గాలంటే ఏం చెయ్యాలి, how to erase dark circles under eyes, dark circles problem under eyes

మిత్రులందరికీ స్వాగతం...

ఈ ఆర్టికల్ లో మీకు నేను కంటి కింద నల్లని చారలు మరియు వాపు తగ్గటానికి కొన్ని పరిష్కార మార్గాలు చెబుతాను. ఒకవేళ వాటి వల్ల తగ్గలేదంటే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

How to rectify dark circles problem under eyes
కంటి కింద నల్లటి చారలు తగ్గించేదెలా

*కంటి కింద నల్లని చారలు లేదా వాపు రావడానికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మనం తినే తిండి లేదా ఆహారపు అలవాట్లు, వయస్సు, మనకి ఏమైనా వ్యాధులు ఉన్నాయా, వాడుతున్నటువంటి మెడిసిన్స్, హార్మోన్స్ మరియు మానసిక స్థితిని బట్టి కంటి కింద నల్లని చారలు లేదా వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Eye problems
కంటి కింద వాపు
*ముందుగా కంటి కింద వాపు గురించి ప్రస్తావించాల్సి వస్తే బాగా ఏడ్చేవాళ్ళకు కన్నీటిలో ఉండే ఉప్పు కారణంగా ఐ బ్యాగ్స్స్ (కంటి కింద వాపు) వస్తుంటాయి. కలత నిద్ర మరియు తక్కువ నిద్రపోయేవారిలో కంటి లూబ్రికేషన్ లో పలు రకాల మార్పులు సంభవిస్తాయి. ఇవి క్రమక్రమంగా కంటి కింద క్యారీ బ్యాగులకు దారి తీస్తుంటాయి. అంతే కాకుండా రాత్రి పడుకుని పొద్దున్న లేచాక కంటి చుట్టూ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ సరిగ్గా జరగకపోయినా కూడా రెండు కళ్ళు బాగా ఉబ్బుతుంటాయి. థైరాయిడ్ సమస్యలు, బ్లిఫారో కెలాసిస్, మోనో న్యూక్లియసిస్ మొదలైనవాటి కారణంగా కంటి చుట్టూ ఫ్లూయిడ్స్ చేరుతుంటాయి. పొగాకు మరియు ఆల్కహాల్ కారణంగా చాలా త్వరగా నిద్రలేమి వస్తుంది. అందువల్ల కూడా వీరిలో ఐ బ్యాగ్స్ రావడం సర్వసాధారణం. కంటి కింద వాపు ఎక్కువ కాలం ఉంటే కనుక ఆ వ్యక్తికి ఏదో డిజార్డర్ ఉందని భావించి డాక్టర్ని సంప్రదించాలి.

*కంటి కింద వాపుని తగ్గించే విధానం:
నీరు ఎక్కువగా తాగడం, ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మరియు ఆహారంలో "ఏ"   "సీ"   "ఈ"  విటమిన్స్ ఉండేలా చూసుకుంటే కనుక కంటి కింద వాపుని కొంత తగ్గించొచ్చు.
*నిద్రలో తలకింద ఎత్తుని పెంచుకోవడం, కళ్ళ మీద మరియు చుట్టూ ఐస్ ని రుద్దుకోవడం ద్వారా ఫ్లూయిడ్ (కంటి కింద వాపు) సమస్యని సరిచేసుకోవచ్చు. రోజుకి ఎనిమిది గంటల సుఖవంతమైన నిద్ర ఖచ్చితంగా ఉండాలి.
*ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల మెంతులు నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. మెంతులు చెడు కొలెస్ట్రాల్ ని మరియు పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి.
*ఆముదంలో ఉండే "రిసినో ఎలిక్ ఆసిడ్" కి పేరుకుపోయన కొవ్వు పదార్థాలను తొలగించే శక్తి ఉంది. కావున కాటన్ బాల్స్ ను ఆముదంలో ముంచి ఐ బ్యాగ్స్ లేదా నల్ల మచ్చలపై రుద్దండి. మంచి రిజల్ట్ వచ్చేవరకు కొన్ని రోజులు కొనసాగించండి.
*వెల్లుల్లి పేస్ట్ ను  ఐ బ్యాగ్స్ పై ఉంచటం వల్ల కొంత ఫలితం రాబట్టవచ్చు. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే మాత్రం ఎక్కువ సమయం ఈ పేస్ట్ ను చర్మంపై ఉంచకండి.
*ఉల్లిపాయని పిండి ఆ రసంలో కొద్దిగా ఉప్పుని కలపండి. రాత్రిపూట పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని ఐ బ్యాగ్స్ మరియు నల్ల మచ్చల పై పూయండి. కంటికి తగలనీయకుండా ఈ మిశ్రమాన్ని పూయండి. కంటికి తగిలితే కళ్ళు మండిపోతాయి జాగ్రత్త.

*ఇక కళ్ళ కింద నల్లని చారలు విషయానికొస్తే బాగా కళ్ళ వాపుకి సంబంధించి పైన ఏ ఏ కారణాలు చెప్పామో అవే కారణాల వల్ల కూడా కంటి కింద నల్లని మచ్చలు ఏర్పడతాయి.
Dark circles problem under eyes
కంటి కింద నల్లటి వలయాలు
*నల్లని మచ్చలు నివారించండిలా...
*ప్రతిరోజు నిద్రపోయేముందు కంటి కింద నెమ్మదిగా చూపుడు వేలుతో సున్నితంగా రుద్దండి. ‌‌‌‌‌‌‌‌‌‌ఇలా కనీసం రెండు నిమిషాలైనా చెయ్యాలి.
*అనవసరమైన టెన్షన్స్ ని పెట్టుకోకుండా మెదడుని ప్రశాంతంగా ఉంచాలి. ఎందుకంటే విపరీతమైన స్ట్రెస్ మరియు టెన్షన్స్ ఇంకా ఒత్తిడి వల్ల కూడా కంటి కింద నల్లని మచ్చలు ఏర్పడతాయి. కావున వీటికి దూరంగా ఉండండి.
Sleeping
ప్రశాంతమైన నిద్ర
*ఆరోగ్యకరమైన ఆహారం మరియు రోజుకి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.
*సిగరెట్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉండండి.
*ఎండలో బయటకి వెళ్ళినప్పుడు తలకి క్యాప్ మరియు కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అల్ట్రా వైలెట్ కిరణాల వల్ల చర్మంలో ఉండే మెలనోసైట్స్ బాగా ప్రభావితం అయ్యి ఎక్కువ మెలనిన్ ని రిలీజ్ చేస్తాయి. ఆ విధంగా కూడా కళ్ళ కింద నల్ల మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది.
*కంటి క్రింద నల్ల మచ్చలు ఏర్పడిన ప్రదేశంలో స్వచ్ఛమైన తేనెతో మర్దన చేస్తే కొంత ఫలితం ఉండొచ్చు. కనీసం అయిదు నిమిషాలు పాటు సున్నితంగా మర్దనా చేయవలెను. ఒక అరగంట పాటు ఆ తేనెని అలాగే ఉంచి ఆ తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.
*మెత్తగా ఉన్నటువంటి నల్లని బంకమట్టిని కంటి కింద నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో కొద్దిగా రాసుకోవాలి. అలా ఒక అరగంట పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. కళ్ళ కింద ప్రదేశంలో చల్లని మట్టి తగలటం వల్ల రక్తప్రసరణ బాగయ్యే అవకాశం ఉంది.
*కంటికి సంబంధించిన ఎక్సర్సైజులు బాగా చేస్తుండాలి. అంటే కళ్ళని మూసి తెరవటం, కళ్ళు పెద్దగా చేసి చూడటం, కళ్ళని అటు ఇటు గుండ్రంగా తిప్పడం మరియు ముఖానికి సంబంధించిన ఎక్సర్సైజులు చేయడం వల్ల కూడా కంటి కింద నల్ల మచ్చలు రాకుండా చేసుకోవచ్చు..
CLICK HERE TO PURCHASE YOGA MATS
*పగటిపూట కొద్దిసేపు నిద్రపోవటం ద్వారా కూడా కంటి కింద నల్లని మచ్చలు రాకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఒక గంటసేపు నిద్రపోవడం వల్ల స్ట్రెస్ తగ్గి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది రాత్రిపూట తక్కువ సేపు నిద్ర పోతారు. అటువంటప్పుడు పగటిపూట అందులోనూ మధ్యాహ్నం పూట కాసేపు నిద్ర పోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల కూడా కంటి కింద నల్ల మచ్చలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
*విటమిన్ ఎ మరియు సి ఎక్కువగా ఉండే పండ్ల రసాల్ని ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకోండి.
*స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, టీవీ మరియు ట్యాబ్ లను తక్కువసేపు ఉపయోగించటం మంచిది. గంటల తరబడి వాటినే చూస్తూ ఉండటం వల్ల కూడా కంటి కింద నల్ల మచ్చలు, వాపు మరియు ఇతర సమస్యలు ఎదురయ్యే ప్రాబ్లం ఉంది.

*నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ని అందరికీ షేర్ చెయ్యండి. సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏

*అట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్.
మీకు హెల్త్ మరియు కిచెన్ టిప్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్
NUZVID HEALTH AND KITCHEN ని SUBSCRIBE చేసుకోండి.
లింక్ కోసం ఇక్కడ CLICK చెయ్యండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి